సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఇలు తమ వర్గంలో ఊర్ధ్వగామి మార్పు జరిగి తత్ఫలితంగా పున:వర్గీకరణకు గురైన తేదీ నుంచి ఒక ఏడాదికి బదులుగా మూడేళ్ళ పాటు పన్నుయేతర ప్రయోజనాలను పొందడాన్ని కొనసాగించేందుకు ఎంఎస్ఎంఇల కోసం నోటిఫికేషన్ జారీ
Posted On:
19 OCT 2022 11:24AM by PIB Hyderabad
కర్మాగారం, యంత్రాలు లేదా పరికరాలు లేదా టర్నోవర్ లేక రెండిటికీ సంబంధించి పెట్టుబడికి సంబంధించిన విషయాలలో ఊర్ధ్వగామి మార్పు జరిగి తత్ఫలితంగా తిరిగి వర్గీగకరణకు గురైనప్పుడు, ఒక సంస్థ పున:వర్గీకరణకు ముందుగా ఉన్నట్టుగా అన్ని పన్నుయేతర ప్రయోజనాలను ఊర్ధ్వగామి మార్పు జరిగిన తేదీ నుంచి మూడేళ్ళ వరకు పొందడాన్ని కొనసాగించవ్చునని ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ 18.10.2022న జారీ చేసిన ఎస్ఒ 4926 (ఇ) ద్వారా నోటిఫై చేసింది.
ఈ నిర్ణయాన్నిఎంఎస్ఎంఇ భాగస్వాములతో తగిన చర్చలు జరిపిన తర్వాత, ఆత్మనిర్భర్ అభియాన్ కు అనుగుణంగా తీసుకుంది. ఎంఎస్ఎంఇలు తమ వర్గంలో పైకి వెళ్ళి తత్ఫలితంగా పున:వర్గీకరణకు గురైనప్పుడు ఒక ఏడాదికి బదులుగా మూడేళ్ళ పాటు పన్నుయేతర ప్రయోజనాలను పొందేందుకు భారత ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ అనుమతించింది. సార్వజనీన సేకరణ విధానం, చెల్లింపుల్లో జాప్యం,తదితరాలతో సహా పలు ప్రభుత్వ పథకాలు పన్నుయేతర ప్రయోజల పరిధిలోకి వస్తాయి.
***
(Release ID: 1869360)
Visitor Counter : 223