ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌ మ‌హాత్మా మందిర్‌క‌న్వెన్ష‌న్ వ‌ద్ద‌జ‌రిగిన డిఫెన్స్ ఎక్స్‌పో 22ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి


హిందూస్థాన్ ఎయిరో నాటిక్స్‌లిమిటెడ్ రూపొదించిన దేశీయ శిక్ష‌ణ విమానం హెచ్ టిటి -40ని ఆవిష్క‌రించిని ప్ర‌ధాన‌మంత్రి

మిష‌న్ డిఫెస్పేస్‌ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి

దీశా ఎయిర్‌ఫీల్డ్‌కు శంకుస్థాప‌న‌

“భార‌తీయ కంపెనీలు మాత్ర‌మే పాల్గొంటున్న తొలి డిఫెన్స్ ఎక్స్ పో ఇది. ఇందులో ఇండియాలో త‌యారైన ప‌రిక‌రాల‌ను మాత్ర‌మే ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు.”

డిఫెన్స్ ఎక్స్ పో ఇండియాపై అంత‌ర్జాతీయంగా ఉన్న న‌మ్మ‌కానికి నిద‌ర్శ‌నం

ఇండియా -ఆఫ్రికాల‌మ‌ధ్య సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డి, కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి.

దీశాలో ఆప‌రేష‌నల్ బేస్ ఏర్పాటుతో మ‌న బ‌ల‌గాల ఆకాంక్ష‌లు నేడు నెర‌వేరాయి

అంత‌రిక్ష‌ సాంకేతిక ప‌రిజ్ఞానంలో ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను త్రివిధ ద‌ళాలు స‌మీక్షించి , గుర్తించాయి.

“స్పేస్ టెక్నాల‌జీ భార‌త‌దేశ‌పు ఉదార అంత‌రిక్ష దౌత్యానికి కొత్త నిర్వ‌చ‌నాన్ని ఇస్తోంది.,”
ర‌క్ష‌ణ రంగంలో, న‌వ‌భార‌త‌దేశం అంత‌ర్జాలం, ఆవిష్క‌ర‌ణ‌, అమ‌లు (ఇంట‌ర్నెట్,ఇన్నొవేష‌న్‌, ఇంప్లిమెంటేష‌న్‌) మంత్రంతో
ముందుకు దూసుకువెళుతోంది.

“ మ‌నం రాగ‌ల సంవ‌త్స‌రాల‌లో 5 బిలియ‌న్ డాల‌ర్ల ల‌క్ష్యాన్ని అంటే 40 వేల కోట్ల రూపాయ

Posted On: 19 OCT 2022 11:53AM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ, గుజ‌రాత్ గాంధీన‌గ‌ర్‌లోని మ‌హాత్మామందిర్‌క‌న్వెన్ష‌న్ , ఎగ్జిబిష‌న్ సెంట‌ర్ వ‌ద్ద డిఫెఎక్స్‌పో  22ను ఈరోజు ప్రారంభించారు. ఇండియ‌న్ పెవిలియ‌న్ వ‌ద్ద ప్ర‌ధాన‌మంత్రి హెచ్ టిటి -40 ని ఆవిష్క‌రించారు. ఇది హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ రూప‌క‌ల్ప‌న చేసిన శిక్ష‌ణ ఎయిర్ క్రాఫ్ట్‌. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి డిష‌న్ డిఫె స్పేస్‌, ను కూడా ప్రారంభించారు. అలాగే గుజ‌రాత్‌లోని దీశా వైమ‌నాకి స్థావ‌రానికి శంకుస్థాప‌న చేశారు.
ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్యక్ర‌మంలో మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కు చెందిన ఈ కార్య‌క్ర‌మానికి అతిథుల‌ను ప్ర‌ధాన‌మంత్రిగా, గుజ‌రాత్ బిడ్డ‌గా స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్టు చెప్పారు..
డిఫెన్స్ ఎక్స్ పో 2022 నిర్వ‌హ‌ణ గురించి చెబుతూ ప్ర‌ధాన‌మంత్రి, న‌వ‌భార‌త దేశ సామ‌ర్ధ్యానికి ఇది ప్ర‌తీక అన్నారు. అమృత్ కాల్ లో చెప్పుకున్న సంక‌ల్పానికి ప్ర‌తిరూపం అని అన్నారు. రాష్ట్రాల స‌హ‌కారం, దేశ ప్ర‌గ‌తి రెండింటి స‌మ్మేళ‌న‌మే ఇది అని ఆయ‌న అన్నారు. యువ‌త క‌ల‌లు, శ‌క్తి ,  సామ‌ర్ధ్యాలు, సంక‌ల్పాలు ఇందులో ఉన్నాయ‌ని అన్నారు.  ఆశావ‌హ‌దృక్ప‌థం, స్నేహ‌పూర్వ‌క దేశాల‌కు అవ‌కాశాలు ఇందులో క‌నిపిస్తాయ‌న్నారు.

డిఫెక్స్‌పో ఎడిష‌న్ ప్ర‌త్యేక‌త‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఇది తొలి డిఫెన్స్ ఎక్స్‌పో అని, భార‌తీయ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయ‌ని చెప్పారు. ఇండియాలో త‌యారైన‌వి మాత్ర‌మే ఇందులో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన‌ట్టు చెప్పారు. ఉక్కు మ‌నిషి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ పుట్టిన భూమి నుంచి భార‌త‌దేశ సామ‌ర్ధ్యాల‌ను మ‌నం ప్ర‌పంచం ముందు ఉంచుతున్నామ‌ని ఆయ‌న అన్నారు.
ఈ ఎక్స్‌పో లో 1300 మందికి పైగా ఎగ్జిబిట‌ర్లు పాల్గొంటున్నారు. ఇందులో ఇండియా ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ ఎగ్జిబిట‌ర్లు, భార‌త ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ‌తో అనుసంధాన‌మైన సంయుక్త రంగ సంస్థ‌లు, ఎం.ఎస్‌.ఎం.ఇలు, వంద‌కు పైగా స్టార్ట‌ప్ సంస్థ‌లు ఉన్నాయి. ఒక సింగిల్ ఫ్రేమ్‌లో భార‌త దేశ సామ‌ర్ధ్యం, అవ‌కాశాలు ఇక్క‌డ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపిస్తాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.మున్నెన్న‌డూ లేనంత‌గా 400 ఎం.ఒ.యుల‌పై సంత‌కాలు జ‌ర‌గ‌నున్న‌ట్టుకూడా ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

ఈ ఎక్స్ పోకు వివిధ దేశాల‌నుంచి వ‌చ్చిన సానుకూల స్పంద‌న‌ను ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఇండియా త‌న క‌ల‌ల‌కు ఒక రూపాన్ని ఇస్తున్న‌ప్పుడు ఆఫ్రికానుంచి 53 మిత్ర దేశాలు త‌మ‌తో అడుగు ముందుకువేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఈ సంద‌ర్బంగా రెండో ఇండియా - ఆఫ్రికా ర‌క్ష‌ణ చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇండియా- ఆఫ్రికాల‌మ‌ధ్య సంబంధాలు కాల‌ప‌రీక్ష‌కు నిలిచిన‌వ‌ని ఆయ‌న అన్నారు.  కాలం గ‌డిచేకొద్దీ ఈ సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డి కొత్త పుంత‌లు తొక్కుతున్నాయ‌న్నారు. ఆఫ్రికా-గుజ‌రాత్ మ‌ధ్య గ‌ల ప్రాచీన సంబంధాల‌ను ప్ర‌ధానమంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆఫ్రికాలోని తొలి రైల్వే లైన్ల ఏర్పాటులో గుజ‌రాత్ లోని క‌చ్ ప్రాంత ప్ర‌జ‌లు పాల్గొన్న‌ట్టు తెలిపారు. ఆఫ్రికాలో నిత్య‌జీవితంలో వాడే చాలా ప‌దాల‌కు మూలాలు ఆఫ్రికాలోని గుజ‌రాతీ క‌మ్యూనిటీ వాడే ప‌దాల‌లో ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. మ‌హాత్మాగాంధీ వంటి ప్ర‌పంచ నేత‌కు గుజ‌రాత్ జ‌న్మ‌భూమి అయితే వారి తొలి క‌ర్మ‌భూమి ఆఫ్రికా అని ఆయ‌న అన్నారు.  ఇప్ప‌టికీ భార‌త విదేశాంగ విధానంలో ఆఫ్రికాతో  సంబంధం కీల‌క‌మైన‌ద‌ని ఆయ‌న అన్నారు. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌పంచం మొత్తం వాక్సిన్ గురించి ఆందోళ‌న చెందితే, ఇండియా ఆఫ్రికాలోని మ‌న మిత్ర దేశాల‌కు ప్రాధాన్య‌త ప్రాతిప‌దిక‌న వాక్సిన్‌ను అంద‌జేసిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.
రెండో ఇండియ‌న్ ఒష‌న్ రీజియ‌న్ ప్ల‌స్ (ఐఓఆర్‌ప్ల‌స్‌) స‌ద‌స్సును ఈ డిఫెక్స్‌పో సంద‌ర్భంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇది ఐఓఆర్‌ప్ల‌స్ దేశాల మ‌ద‌ద్య శాంతి, సుస్థిరత ప్ర‌గ‌తి సుసంప‌న్న‌త‌ల‌ను పెంపొందించేందుకు స‌మ‌గ్ర చ‌ర్చ‌కు వీలుకల్పించ‌నుంది. ఈ ప్రాంతంలోని అంద‌రికీ భ‌ద్ర‌త‌, పురోగ‌తి ఉండాల‌న్న (ఎస్ఎజిఎఆర్‌) ప్ర‌ధాన‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ఈ స‌మ‌గ్ర చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి.అంత‌ర్జాతీయ భ‌ద్ర‌త‌నుంచి అంత‌ర్జాతీయ వాణిజ్యం, స‌ముద్ర‌యాన భ‌ద్ర‌త వంటివి అంత‌ర్జాతీయంగా అత్యంత ప్రాధాన్య‌త‌గ‌ల అంశాలుగా రూపుదిద్దుకున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. వాణిజ్య నౌకాయానం కూడా గ్లోబ‌లైజేష‌న్ కాలంలో బాగా పెరిగింద‌ని ఆయ‌న అన్నారు. ఇండియాపై ప్ర‌పంచం ఆకాంక్ష‌లు బాగా పెరిగాయ‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి, ఆ ఆకాంక్ష‌ల‌ను ఇండియా త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తుంద‌ని ప్ర‌పంచానికి హామీ ఇస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఈ డిఫెన్స్ ఎక్స్‌పో ఇండియాపై అంత‌ర్జాతీయంగా ఉన్న విశ్వాసానికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌దాన‌మంత్రి చెప్పారు.

 గుజ‌రాత్‌లోని దీశా ఎయిర్‌ఫీల్డ్‌కు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేశారు.ఈ వైమానిక స్థావ‌రం దేశ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌కు అద‌నంగా వ‌చ్చి చేరుతున్న‌ట్టుచెప్ఆప‌రు. దీశా ఎయిర్‌ఫీల్డ్ స‌రిహ‌ద్దుల‌కు ద‌గ్గ‌రగా ఉన్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ప‌శ్చిమ స‌రిహ‌ద్దుల‌లో ఎలాంటి దుశ్చ‌ర్య‌నైనా తిప్పికొట్టేందుకు ఇండియా స‌న్న‌ద్ధ‌త మ‌రింత పెరిగిన‌ట్టు ప్ర‌ధ‌నామంత్రి తెలిపారు. మేం అధికారంలోకి వ‌చ్చాక‌, దీశాలో ఆప‌రేష‌న‌ల్ బేస్ ఏర్పాటుచేయాల‌నుకున్నాం. ఈ స్థావ‌రం ఏర్పాటుతో బ‌ల‌గాల ఆకాంక్ష నేడు నెర‌వేరిన‌ట్ట‌యింది. ఈ ప్రాంతం దేశ భ‌ద్ర‌త‌లో కీల‌క‌కేంద్రం కానున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

భ‌విష్య‌త్తులో  ఏదైనా బ‌ల‌మైన దేశం అనేదానికి అర్థం  ఆ దేశ స్పేస్ టెక్నాల‌జీ ఒక ఉదాహ‌ర‌ణ కానున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.ఈ రంగానికి సంబంధించిన వివిధ స‌వాళ్ల‌ను త్రివిధ ద‌ళాలూ స‌మీక్షించి , వాటిని గుర్తించిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు మ‌నం కృషి చేయ‌వ‌ల‌సి ఉంద‌ని ఆయ‌న అన్నారు. మిష‌న్ డిఫెన్స్ స్పేస్ గురించి ఆయ‌న చెబుతూ, ఇది ఈ రంగంలో ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించడంతోపాటు, మ‌న బ‌ల‌గాల‌ను బ‌లోపేతం చేస్తుంద‌ని, నూత‌న , వైవిధ్యంతో కూడిన ప‌రిష్కారాల‌ను అందిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. అంత‌రిక్ష సాంకేతిక ప‌రిజ్ఞానం భార‌త‌దేశ ఉదార అంత‌రిక్ష దౌత్యానికి కొత్త‌నిర్వ‌చ‌నం ఇవ్వ‌నున్న‌ద‌ని అన్నారు. ఇది కొత్త అవ‌కాశాల‌ను సృష్టించ‌నున్న‌దని కూడా చెప్పారు. ఎన్నో ఆఫ్రికా దేశాలు, ఎన్నో ఇత‌ర చిన్న దేశాలు దీనినుంచి ప్ర‌యోజ‌నం పొంతున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. 60 కిపైగా వ‌ర్ధ‌మాన దేశాలతో ఇండియా త‌న అంత‌రిక్ష విజ్ఞానాన్ని పంచుకుంటున్న‌ట్టు ఆయ‌న తెలిపారు."ద‌క్షిణాసియా ఉప‌గ్ర‌హం ఇందుకు గొప్ప ఉదాహ‌ర‌ణ . వ‌చ్చే ఏడాది నాటికి ప‌ది ఏసియాన్ దేశాలు కూడా ఎప్ప‌టికప్పుడు భార‌త ఉప‌గ్ర‌హ స‌మాచారాన్ని అందుకోగ‌లుగుతాయి. అభివృద్ధి చెందిన దేశాలైన యూర‌ప్ అమెరికాలుకూడా మ‌న ఉప‌గ్ర‌హ స‌మాచారాన్ని ఉప‌యోగించుకుంటున్నాయి" అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

 

సంకల్పం. నూతన ఆవిష్కరణ, ఇంకా ఆచరణ అనే మంత్రం తో న్యూ ఇండియా రక్షణ రంగం లో ముందుకు పోతోందని ప్రధాన మంత్రి అన్నారు. 8 సంవత్సరాల క్రితం వరకు చూస్తే, భారతదేశాన్ని ప్రపంచం లో అతి పెద్ద రక్షణ రంగ సంబంధి దిగుమతి దారు దేశం గా పరిగణించేవారు, అయితే న్యూ ఇండియా సంకల్పాన్ని, ఇచ్ఛా శక్తి ని చాటుకొంది; మరి ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రస్తుతం రక్షణ రంగం లో ఒక సాఫల్య గాథ గా మారుతోంది అని ఆయన అన్నారు. ‘‘మన రక్షణ సంబంధి ఎగుమతులు గత 5 సంవత్సరాల లో 8 రెట్లు వృద్ధి చెందాయి. మేం రక్షణ పరికరాల ను, ఉపకరణాల ను ప్రపంచం లో 75 కు పైగా దేశాల కు ఎగుమతి చేస్తున్నాం. 2021-22 సంవత్సరం లో భారతదేశం నుండి రక్షణ సంబంధి ఎగుమతులు $ 1.59 బిలియన్ డాలర్ కు అంటే దాదాపు 13 వేల కోట్ల రూపాయల విలువ గల స్థాయి కి చేరుకొన్నాయి. రాబోయే కాలం లో 5 బిలియన్ డాలర్ లకు అంటే 40 వేల కోట్ల రూపాయల విలువ గల స్థాయి కి చేరుకోవాలి అని మేం లక్ష్యం గా పెట్టుకొన్నాం’’ అని ఆయన అన్నారు.

ప్రపంచం భారతదేశం యొక్క సాంకేతిక విజ్ఞానం పైన ప్రస్తుతం ఆధారపడుతోంది, భారతదేశం యొక్క సైన్యాలు వాటి సామర్థ్యాలను నిరూపించుకోవడం దీనికి కారణం. భారతదేశ నౌకాదళం ఐఎన్ఎస్- విక్రాంత్ వంటి అత్యాధునిక విమాన వాహక నౌకల ను తన జట్టు లోకి చేర్చుకొంది. ఈ ఇంజీనియరింగ్ అద్భుతాన్ని, ఈ ఉత్కృష్ట కార్యాన్ని కొచిన్ శిప్ యార్డ్ లిమిటెడ్ దేశీయ సాంకేతిక పరిజ్ఞానం తో ఆవిష్కరించింది. భారత వాయుసేన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం లో భాగం గా అభివృద్ధి పరచినటువంటి తేలికపాటి పోరాట ప్రధానమైన ప్రచండ్ హెలికాప్టర్స్ ను అక్కున చేర్చుకోవడం అనేది భారతదేశం యొక్క రక్షణ రంగం సత్తా కు ఒక స్పష్టమైన ఉదాహరణ గా ఉంది అని ఆయన వివరించారు.
భారతదేశం యొక్క రక్షణ రంగాన్ని స్వయంసమృద్ధమైంది గా తీర్చిదిద్దడాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ సామగ్రి తాలూకు రెండు జాబితాల ను కూడా సైన్యాలు ఖరారు చేశాయి; ఈ సామగ్రి ని దేశం లోపలే సేకరించడం జరుగుతుంది అని వెల్లడించారు. ఆ కోవ కు చెందిన 101 పరికరాల జాబితా ను ఈ రోజు న విడుదల చేయడం జరుగుతున్నది. ఈ నిర్ణయాలు సైతం ఆత్మ నిర్భర భారతదేశం శక్తి సామర్థ్యాల ను పట్టి చూపుతున్నాయి. ఈ జాబితా కు తరువాయి గా ఇదే తరహా లో రక్షణ రంగాని కి చెందినటువంటి 411 పరికరాల ను ఒక్క మేక్ ఇన్ ఇండియా పరిధి లోనే కొనుగోలు చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. అంత భారీ బడ్జెటు భారతదేశం యొక్క కంపెనీ ల పునాది ని పటిష్ఠపరచి ఆ కంపెనీల ను కొత్త శిఖరాల కు తీసుకు పోతుంది అని ప్రధాన మంత్రి తెలిపారు. దీని ద్వారా అత్యధిక ప్రయోజనాన్ని పొందేది దేశం లోని యువతే అని ఆయన అన్నారు.
రక్షణ రంగ సరఫరాల లో కొన్ని కంపెనీ లు సృష్టించిన గుత్తాధిపత్యం స్థానం లో ప్రస్తుతం ఆధారపడదగిన ఐచ్ఛికాలు అనేకం మొగ్గ తొడుగుతున్నాయి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘భారతదేశంలోని యువత రక్షణ పరిశ్రమ లో ఈ తరహా గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడం అనే శక్తి ని ప్రదర్శించింది. మరి మన యువత యొక్క ఈ ప్రయాస ప్రపంచ హితం కోసం అని చెప్పాలి’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దీని నుండి గొప్ప ప్రయోజనాలను వనరుల లేమి కారణం గా భద్రత పరం గా వెనుకబడిపోయిన ప్రపంచం లోని చిన్న దేశాలు ఇక మీదట అందుకోగలుగుతాయి అని ఆయన నొక్కిచెప్పారు.

‘‘రక్షణ రంగాన్ని అనంతమైన అవకాశాలు, సకారాత్మక సంభావ్యత లు కలిగినటువంటి రంగం గా భారతదేశం చూస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రక్షణ రంగం లో ఉన్న పెట్టుబడి అవకాశాల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ లో, తమిళ నాడు లో రెండు డిఫెన్స్ కారిడార్ లను భారతదేశం నిర్మిస్తోంది; భారతదేశం లో పెట్టుబడి పెట్టడం కోసం ప్రపంచం లోని పెద్ద పెద్ద కంపెనీ లు అనేకం తరలి వస్తున్నాయి అని ఆయన అన్నారు. ఈ రంగం లో సూక్ష్మ, లఘు, మధ్యతరహా వ్యాపార సంస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) లకు ఉన్న సత్తా ను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పెద్ద కంపెనీ ల పెట్టుబడి కి వెనుక దన్నుగా నిలచే సరఫరా వ్యవస్థ ను ఏర్పరచడం లో మా యొక్క ఎమ్ఎస్ఎమ్ఇ లు అండదండల ను అందిస్తాయి అని ఆయన అన్నారు. ‘‘ఈ రంగం లో ఆ స్థాయి పెట్టుబడులు యువత కోసం ఇదివరకు ఎన్నడూ ఆలోచన అయినా చేయనటువంటి విధం గా ఉద్యోగావకాశాల ను పెద్ద ఎత్తున కల్పించనున్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.


డిఫెన్స్ ఎక్స్ పో లో భాగం పంచుకోవడానికి వచ్చినటువంటి అన్ని కంపెనీల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి పిలుపును ఇస్తూ, భారతదేశం యొక్క భవిష్యత్తు ను కేంద్ర స్థానం లో నిలుపుతూ ఈ అవకాశాల కు రూపు రేఖల ను ఇవ్వవలసిందంటూ విజ్ఞప్తి చేశారు. ‘‘మీరు వినూత్న ఆవిష్కరణ లు చేయండి. ప్రపంచం లో అత్యుత్తమం గా నిలుస్తాం అంటూ ఒక ప్రతిజ్ఞ ను స్వీకరించండి. ఒక బలమైనటువంటి, అభివృద్ధి చెందినటువంటి భారతదేశాని కి రూపు రేఖల ను ఇవ్వండి. మిమ్మల్ని ఎల్లవేళ లా సమర్థించడానికి సిద్ధం గా నేను ఉంటాను’’ అని చెబుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ వ్రత్, రక్షణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జెనరల్ శ్రీ అనిల్ చౌహాన్, సైనిక దళాల ప్రధాన అధికారి జెనరల్ శ్రీ మనోజ్ పాండే, వాయు సేన ప్రధాన అధికారి ఎయర్ చీఫ్ మార్షల్ శ్రీ వి.ఆర్. చౌధరి, నౌకాదళం ప్రధాన అధికారి అడ్మిరల్ శ్రీ ఆర్. హరి కుమార్ లతో పాటు రక్షణ రంగ విషయాల లో భారత ప్రభుత్వానికి కార్యదర్శి డాక్టర్ శ్రీ అజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.


పూర్వరంగం


ప్రధాన మంత్రి డిఫ్ ఎక్స్ పో 22 ను ప్రారంభించారు. ప్రధాన మంత్రి డిఫ్ ఎక్స్ పో 22 ను ప్రారంభిస్తారు.పాథ్ టు ప్రైడ్ఇతివృత్తం లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్ పో, ఇండియన్ డిఫెన్స్ ఎక్స్ పో లో ఇంత వరకు ఎన్నడూ లేనంత పెద్ద భాగస్వామ్యానికి సాక్షి కానుంది. మొట్టమొదటిసారిగా విదేశీ ఓఈఎమ్ లయొక్క భారతదేశ అనుబంధ సంస్థ లు, భారతదేశంలో నమోదయిన కంపెనీ డివిజన్ లు, భారతీయ కంపెనీతో జాయింట్ వెంచర్ కలిగివున్న ఎగ్జిబిటర్ లు సహా ప్రత్యేకంగా భారతీయ కంపెనీల కోసమే ఉద్దేశించిన రక్షణ సంబంధి ప్రదర్శన ను ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమం భారతదేశం లోని రక్షణ సంబంధి తయారీ కౌశలం ఏ మేరకు విస్తరించింది, దాని స్థాయి ఎలాంటిదో కళ్ళకు కట్టనుంది. ఈ ఎక్స్ పో లో ఒక ఇండియా పెవిలియన్ మరియు స్టేట్ పెవిలియన్ లు ఏర్పాటు కానున్నాయి. ఇండియా పెవిలియన్ లో ప్రధాన మంత్రి హిందూస్థాన్ ఎయరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) రూపొందించిన స్వదేశీ శిక్షణ విమానం హెచ్ టిటి- 40 ని ఆవిష్కరించనున్నారు. ఈ విమానం లో అత్యాధునిక యుద్ధ వ్యవస్థలను జతపరచడంతో పాటుగా విమాన చోదకులకు అనుకూలంగా ఉండేటటువంటి సదుపాయాలను కలిపి రూపుదిద్దడం జరిగింది.

ఇదే కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి మిషన్ డిఫ్ స్పేస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లక్ష్యం ఏమిటి అంటే అది రక్షణ బలగాల కోసమని పరిశ్రమ మరియు స్టార్ట్- అప్స్ ల అండదండల తో అంతరిక్ష రంగానికి సంబంధించి వినూత్నమైన సాల్యూశన్స్ ను అభివృద్ధి పరచాలి అనేదే. ప్రధాన మంత్రి గుజరాత్ లోని దీసా వాయు క్షేత్రాని కి కూడా శంకుస్థాపన చేశారు. ఈ ఫార్వర్డ్ ఎయర్ ఫోర్స్ బేస్ దేశం లో భద్రత పరమైన స్వరూపాని కి పటిష్టత ను సంతరిస్తుంది.



ఈ ఎక్స్ పో లో ‘ఇండియా- ఆఫ్రికా: అడాప్టింగ్ స్ట్రేటిజి ఫార్ సినర్గైజింగ్ డిఫెన్స్ అండ్ సిక్యోరిటి కో ఆపరేశన్’ ఇతివృత్తం తో జరిగే రెండో ఇండియా - ఆఫ్రికా డిఫెన్స్ డైలాగ్ కూడా చోటు చేసుకుంటుంది. రెండో ఇండియన్ ఓశన్ రీజియన్ ప్లస్ (ఐఒఆర్ +) కాన్ క్లేవ్ ను కూడా ఈ ఎక్స్ పో లో నిర్వహించడం జరుగుతుంది. ఇది శాంతి, వృద్ధి, స్థిరత్వం మరియు సమృద్ధి లను ప్రధానమంత్రి యొక్క సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫార్ ఆల్ ఇన్ ద రీజియన్) దృష్టి కోణాని కి అనుగుణం గా ఐఒఆర్ + దేశాల పరమైన రక్షణ సహకారాన్ని వృద్ధి పరచడానికి ఒక సమగ్రమైన చర్చ జరిగేందుకు వేదిక ను సమకూర్చనుంది. ఈ ఎక్స్ పోలోనే మొట్టమొదటి సారి గా రక్షణ రంగం కోసం ఇన్వెస్టర్స్ మీట్ ను కూడా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది వందకు పైగా స్టార్ట్- అప్ లు వాటి యొక్క నూతన ఆవిష్కరణల ను ‘మంథన్ 2022’ లో ప్రదర్శించేందుకు ఒక అవకాశాన్ని చేజిక్కించుకోనున్నాయి. అలాగే ఈ ఎక్స్ పో లో ఐడిఇఎక్స్ (ఇనోవేశన్స్ ఫార్ డిఫెన్స్ ఎక్స్ లెన్స్ ) అనే రక్షణ రంగ సంబంధి వినూత్నమైన కార్యక్రమం కూడా చోటుచేసుకొంటుంది. ఈ కార్యక్రమం లో ‘బంధన్’ కార్యక్రమం మాధ్యమం ద్వారా 451 భాగస్వామ్యాలు కూడా ప్రారంభం కాగలవు.

*****

DS/TS

 


(Release ID: 1869240) Visitor Counter : 222