పర్యటక మంత్రిత్వ శాఖ
జాతీయ పర్యాటక పోలీస్ విధానంపై ఏర్పాటైన జాతీయ సదస్సులో అక్టోబర్ 19న ప్రసంగించనున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సహకారంతో సదస్సు నిర్వహిస్తున్న పర్యాటక మంత్రిత్వ శాఖ
పర్యాటక రంగానికి అనువైన జాతీయ స్థాయి పర్యాటక పోలీస్ విధానం రూపకల్పన లక్ష్యంగా జాతీయ సదస్సు నిర్వహణ
సదస్సులో ప్రసంగించనున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యెస్సో నాయక్, హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్
प्रविष्टि तिथि:
18 OCT 2022 11:07AM by PIB Hyderabad
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPR&D) సహకారంతో అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్స్/ఇన్‌స్పెక్టర్ జనరల్స్ జాతీయ సదస్సును కేంద్ర పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. యూనిఫాం టూరిస్ట్ పోలీస్ స్కీమ్, న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 2022 అక్టోబర్ 19న జరిగే సదస్సులో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సదస్సుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక , ఈశాన్య ప్రాంత అభివృద్ధి మండలి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి హాజరవుతారు.
పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యెస్సో నాయక్, హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్, హోంశాఖ కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా, పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ శ్రీ బాలాజీ శ్రీవాత్సవ, హోంశాఖ విదేశీ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి, రాజస్థాన్, కేరళ, గోవా, మేఘాలయ రాష్ట్రాల పర్యాటక శాఖ కార్యదర్శులు, అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల డిజిలు /ఐజీలు, హోంశాఖ,పర్యాటక శాఖ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సీనియర్ అధికారులు సదస్సులో పాల్గొంటారు.
పర్యాటక రంగానికి అనువైన జాతీయ స్థాయి పర్యాటక పోలీస్ విధానం రూపకల్పన లక్ష్యంగా జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాల డీజీ/ఐజీ అధికారులు పాల్గొనే సదస్సులో పర్యాటక కేంద్రాలు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో దేశ విదేశీ పర్యాటకులకు భద్రత, రక్షణ కల్పించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా జాతీయ స్థాయిలో విధానాన్ని రూపొందించడం, పటిష్ట పోలీసు వ్యవస్థ రూపకల్పన అంశాలను జాతీయ సదస్సులో చర్చిస్తారు.
పర్యాటక రంగానికి అనువైన పోలీస్ వ్యవస్థపై బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రూపొందించిన నివేదికను సదస్సులో చర్చిస్తారు. నివేదిక అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై హోంశాఖ, పర్యాటక శాఖ, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులకు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సలహాలు, సూచనలు అందిస్తుంది. దేశ, విదేశీ పర్యాటకులకు అవసరమైన భద్రత, రక్షణ కల్పించేందుకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని నియమించే అంశంపై కార్యాచరణ రూపొందించాలని లక్ష్యంతో సదస్సును నిర్వహిస్తున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన యంత్రాంగాలను ఒక వేదిక పైకి తెచ్చి సమన్వయంతో కలిసి పనిచేసి పర్యాటక పోలీసు వ్యవస్థను పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు సదస్సు కృషి చేస్తుంది. జాతీయ స్థాయిలో పర్యాటక పోలీసు విధానం అమలు చేసి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో స్వదేశీ, విదేశీ పర్యాటకుల నిర్దిష్ట అవసరాలను గుర్తించి తగిన చర్యలు అమలు చేసే అంశాలను సదస్సులో చర్చిస్తారు. ప్రపంచ స్థాయిలో భారతదేశంలో పర్యాటకుల రక్షణ, భద్రతకు సంబంధించి నెలకొన్న అపోహలు తొలగించి, భారతదేశాన్ని పర్యాటకుల స్వర్గ ధామంగా మార్చి భారతదేశాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన గమ్యస్థానంగా మార్చడంలో సహాయపడుతుంది.
***
(रिलीज़ आईडी: 1868774)
आगंतुक पटल : 196