ప్రధాన మంత్రి కార్యాలయం

అక్టోబర్ 16న 75 జిల్లాల లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ (డిబియు) లను దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధాన మంత్రి


డిబియు లు దేశం లో ఆర్థిక సేవల ను అందరికీ అందుబాటు లోకి తీసుకురావడాన్ని మరింత గా విస్తృతం చేస్తాయి

డిబియు లు డిజిటల్ ఫినాన్శల్ లిటరసీ ని వ్యాప్తి చేస్తాయి. అంతే కాకుండా, వినియోగదారుల లో సైబర్ సెక్యూరిటీ సంబంధి చైతన్యాన్ని మరియు తీసుకోవలసిన జాగ్రత్త చర్య ల ను తెలియజేస్తాయి

డిబియు లు ఏడాది పొడవునా బ్యాంకింగ్ ఉత్పాదనల ను మరియు సేవల ను డిజిటల్ మాధ్యమం ద్వారా పొందే అనుభూతి ని అందిస్తాయి

Posted On: 14 OCT 2022 3:43PM by PIB Hyderabad

ఆర్థిక సేవల ను మరింత మంది కి అందుబాటు లోకి తీసుకుపోయే క్రమం లో మరొక చర్యా అన్నట్లు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 16వ తేదీ నాడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫిరెన్సింగ్ మాధ్యమం ద్వారా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ లను దేశ ప్రజల కు సమర్పణం చేయనున్నారు. ఈ సందర్భం లో ఆయన సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

 

ఆర్థిక మంత్రి 2022-23 కేంద్ర బడ్జెట్ ఉపన్యాసం లో భాగం గా, మన దేశాని కి స్వాతంత్ర్యం తాలూకు 75 సంవత్సరాలు పూర్తి అయ్యే సందర్భం లో దేశం లోని 75 జిల్లాల లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ (డిబియు)లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించారు. దేశం లో మూలమూలన డిజిటల్ బ్యాంకింగ్ తాలూకు ప్రయోజనాలను ప్రజలు అందుకొనేటట్లు చూడాలన్న ధ్యేయం తో ఈ డిబియుల ను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇవి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పరిధి లో ఏర్పాటవుతున్నాయి. ఈ ప్రయాస లో సార్వజనిక రంగంలోని 11 బ్యాంకు లు, 12 ప్రైవేటు రంగ బ్యాంకు లు మరియు ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు పాలుపంచుకొంటున్నాయి.

 

 

 

ఈ డిబియుల ను బ్రిక్ ఎండ్ మోర్టార్ అవుట్ లెట్ ల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ప్రజల కు పొదుపు ఖాతా ను తెరవడం, ఖాతా లో నిలవ ఉన్న నగదు ఎంత అనేది సరిచూసుకోవడం, పాస్ బుక్ లో లావాదేవీ ల వివరాల ను అచ్చువేయడం, నిధుల బదలాయింపు, ఫిక్స్డ్ డ్ డిపాజిట్ లలో పెట్టుబడి పెట్టడం, రుణం కోసం దరఖాస్తు చేయడం, జారీ చేసినటువంటి చెక్కు కు సంబంధించి సొమ్ము చెల్లింపును ఆపివేయాలంటూ ఆదేశించడం, డెబిట్ కార్డు కోసం గాని లేదా క్రెడిట్ కార్డు కోసం గాని దరఖాస్తు పెట్టడం, అకౌంట్ స్టేట్ మెంటు ను పరిశీలించడం, వివిధ పన్నులను చెల్లించడం, బిల్లుల ను చెల్లిలంచడం, నామినేశన్ ను సమర్పించడం మొదలైన అనేక వేరు వేరు డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాల ను అందుబాటు లోకి తీసుకురావడం జరుగుతుంది.

 

 

 

వినియోగదారులకు ఏమంత ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా బ్యాంకింగ్ ఉత్పాదనల ను మరియు సేవల ను ఏడాది పొడవునా వారి వీలు ను బట్టి పొందేందుకు డిబియు లు తోడ్పడుతాయి. అవి డిజిటల్ ఫినాన్శల్ లిటరసీ ని విస్తృతం గా వ్యాప్తి లోకి తీసుకువస్తాయి. మరీ ముఖ్యం గా సైబర్ సెక్యూరిటీ విషయం లో చైతన్యాన్ని, అలాగే తత్సంబంధిత జాగ్రత్త చర్యల ను తీసుకొనే అంశాల లో వినియోగదారుల కు అవగాహన ను కలిగించడం పై శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాక డిబియు లు నేరు గా ఇవ్వజూపే సేవ ల పరంగా గాని లేదా బిజినెస్ ఫెసిలిటేటర్ లు/ కరస్పాండెంట్ ల సేవల పరంగా గాని వినియోగదారుల కు ఏవైనా సమస్య లు తల ఎత్తేటట్లయితే గనక ఆ సమస్యల ను పరిష్కరించడానికి మరియు రియల్ టైం ప్రాతిపదిక న సహాయాన్ని అందించడానికి తగినన్ని పరిష్కార యంత్రాంగాల ను కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా సమకూర్చడం జరుగుతుంది.

 

 

 

 

***

 

 



(Release ID: 1867818) Visitor Counter : 204