చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లో రేపటి నుంచి అఖిల భారత న్యాయ మంత్రులు, కార్యదర్శుల సదస్సు


- కీలకోపన్యాసం చేయ‌నున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు

- కార్య‌క్ర‌మం ఆలోచనల మార్పిడికి త‌గిన వేదికను అందిస్తుంది

- వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వారివారి ఉత్తమ పద్ధతులను పంచుకునే అవకాశం అందిస్తుంది

Posted On: 13 OCT 2022 2:53PM by PIB Hyderabad

కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 14 నుండి 16వ తేదీ, 2022  వరకు గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో న్యాయ మంత్రులు, న్యాయ శాఖ కార్యదర్శుల అఖిల భారత సదస్సును నిర్వహించ‌నుంది, ఇందులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన న్యాయ మంత్రులు & న్యాయ కార్యదర్శులు పాల్గొన‌నున్నారు. అక్టోబర్ 15న కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ఈ స‌ద‌స్సులో కీల‌క ప్రసంగం చేయ‌నున్నారు.  న్యాయ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ చొరవ కార‌ణంగా భారతదేశ న్యాయ వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చకు త‌గిన వేదికను అందిస్తుంది, తద్వారా విధాన రూపకర్తలు దేశ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్‌ను అభివృద్ధి చేయవచ్చు. ఈ ఈవెంట్ ఆలోచనల మార్పిడికి వేదికను అందిస్తుంది. వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు వారి ఉత్తమ పద్ధతులను ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది, తద్వారా దేశంలోని మొత్తం న్యాయ వ్యవస్థను దాని పౌరుల ప్రయోజనాల కోసం ముఖ్యంగా సమాజంలోని బలహీన వర్గాల ప్రయోజనాల కోసం అధునికీక‌రణ చేయవచ్చు. "సమిష్టి & చైతన్యవంతమైన నూతన భారతదేశం" చేయడానికి వారిని శక్తివంతం చేయడం.  పౌరులు ముఖ్యంగా సమాజంలోని బలహీన వర్గాల వారి కోసం "సమిష్టి  మ‌రియు  ఉత్తేజకరమైన కొత్త భారతదేశం" చేయడానికి వారికి అధికారం కల్పిస్తుంది.
 

***



(Release ID: 1867785) Visitor Counter : 194