మంత్రిమండలి
azadi ka amrit mahotsav

గృహసంబంధి ఎల్ పిజి లో నష్టాలకు గాను పిఎస్ యు ఒఎమ్ సి లకు22,000 కోట్ల రూపాయలను ఒక సారి గ్రాంటు రూపం లో ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 12 OCT 2022 4:25PM by PIB Hyderabad

సార్వజనిక రంగం లోని మూడు చమురు మార్కెటింగ్ కంపెనీల కు (పిఎస్ యు ఒఎమ్ సి లు) 22 వేల కోట్ల రూపాయల ఒక సారి గ్రాంటు రూపం లో ఇవ్వాలంటూ పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ తీసుకు వచ్చిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.  ఈ గ్రాంటు ను ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) కు భారత్ పెట్రోలియం కార్పొరేశన్ లిమిటెడ్ (బిపిసిఎల్) కు మరియు హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేశన్ లిమిటెడ్ (హెచ్ పిసిఎల్) కు మధ్య పంపిణీ చేయడం జరుగుతుంది.

ఈ ఆమోదం ద్వారా పిఎస్ యు ఒఎమ్ సిల కు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పట్ల వాటి వచన బద్ధత ను కొనసాగించడంలో తోడ్పాటు లభించనుంది. దీనితో గృహసంబంధి ఎల్ పిజి సరఫరాల లో ఎటువంటి అంతరాయం ఎదురవదు; మేక్ ఇన్ ఇండియా ఉత్పాదన ల కొనుగోలు కు సమర్థన కూడా లభించగలదు.

గృహ సంబంధి ఎల్ పిజి సిలిండర్ లను ఐఒసిఎల్బిపిసిఎల్హెచ్ పిసిఎల్ వంటి సార్వజనిక రంగం లోని చమురు మార్కెటింగ్ కంపెనీ ల ద్వారా వినియోగదారుల కు హేతుబద్ధమయిన ధరల కు సరఫరా చేయడం జరుగుతున్నది.

2020వ సంవత్సరం జూన్ మొదలుకొని 2022 జూన్ మధ్య కాలం లో ఎల్ పిజి యొక్క అంతర్జాతీయ ధర ల లో దాదాపు గా 300 ల శాతం పెరుగుదల నమోదైంది. ఏమైనప్పటికీ, వినియోగదారులకు అంతర్జాతీయ ఎల్ పిజి ధరల లో హెచ్చు తగ్గు ల ప్రభావం భారీ నుండి రక్షణ ను కల్పించడం కోసం గృహ సంబంధి ఎల్ పిజి ధరల లో ఈ వృద్ధి ని పూర్తి స్థాయి లో బదలాయించడం జరుగలేదు. తదనుగుణంగా పైన ప్రస్తావించిన కాలం లో స్వదేశీ ఎల్ పిజి ధర ల లో 72 శాతం మాత్రమే పెరుగుదల చోటు చేసుకొంది. దీనితో ఈ ఒఎమ్ సి లకు భారీ నష్టాలు వచ్చాయి.

ఈ నష్టాల ను చవిచూసినప్పటికీ, మూడు పిఎస్ యు ఒఎమ్ సి లు దేశం లో ఈ నిత్యావసర వంట సంబంధి ఇంధనం తాలూకు సరఫరా లు నిరంతరాయం గా కొనసాగేటట్లు శ్రద్ధ ను తీసుకొన్నాయి.

 

 ***


(Release ID: 1867186) Visitor Counter : 217