ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్నల్ (రిటైర్ డ్) శ్రీహెచ్.కె. సచ్ దేవ సతీమణి శ్రీమతి ఉమ సచ్ దేవ తో భేటీ అయిన ప్రధాన మంత్రి 

Posted On: 07 OCT 2022 3:26PM by PIB Hyderabad

శ్రీమతి ఉమ సచ్ దేవ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. 90 ఏళ్ల వయస్సు కలిగిన శ్రీమతి ఉమ సచ్ దేవ తన భర్త, కీర్తిశేషుడు కర్నల్ (రిటైర్ డ్) శ్రీ హెచ్.కె. సచ్ దేవ వ్రాసిన 3 పుస్తకాల యొక్క ప్రతుల ను ప్రధాన మంత్రి కి బహుమతి గా ఇచ్చారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ ల లో -

‘‘శ్రీమతి ఉమ సచ్ దేవ గారి తో ఈ రోజు న నేను ఒక మరచిపోలేనటువంటి సంభాషణ ను జరిపాను. ఆమె వయస్సు 90 ఏళ్లు. గొప్ప శక్తి, ఉత్సాహాల తో పాటు ఆశావాదం కూడా ఉంది ఆమె లో. ఆమె భర్త, కర్నల్ (రిటైర్ డ్) శ్రీ హెచ్.కె. సచ్ దేవ ను పలువురు గౌరవించే వారు. శ్రీ హెచ్.కె. సచ్ దేవ చిరకాలానుభవం కలిగిన వ్యక్తి. జనరల్ @Vedmalik1 Ji కి ఉమా జీ బంధువు కూడాను.’’

‘‘ఉమ గారు ఆవిడ దివంగత భర్త రాసినటువంటి పుస్తకాల ప్రతులు మూడిటి ని నాకు అందజేశారు. వాటి లో రెండు గ్రంథాలు గీత ను గురించినవి కాగా మూడో పుస్తకం పేరు ‘బ్లడ్ ఎండ్ టియర్స్’. ఈ మూడో పుస్తకం దేశ విభజన తాలూకు ఆఘాతభరిత కాలం లో కర్నల్ (రిటైర్ డ్) హెచ్.కె. సచ్ దేవ గారి కి కలిగిన అనుభవాల ను గురించి వివరించేటటువంటి పుస్తకం.’’

‘‘దేశ విభజన వల్ల బాధితులు గా మారి, వారి బ్రతుకుల ను మొదలంటా పునర్ నిర్మించుకొని దేశ పురోగతి కి తోడ్పాటు ను అందించిన వారి కి నివాళి ని అర్పించడం కోసం ఆగస్టు 14వ తేదీ ని దేశ విభజన భయాల స్మరణ దినం గా పాటించాలంటూ భారతదేశం తీసుకొన్న నిర్ణయాన్ని గురించి మేం చర్చించాం. వారు మానవుల దృఢదీక్ష కు మరియు నైతిక ధైర్యాని కి మారుపేరు గా నిలచారు.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(Release ID: 1865925) Visitor Counter : 161