ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో వైద్యం కోసం ప్రజలు సొంతంగా చేస్తున్న ఖర్చులకు సంబంధించి జాతీయ ఆరోగ్య ఖాతాలు (ఎన్ హెచ్ ఏ ) అందిస్తున్న సమాచారంలో లోపాలు


ఉన్నాయంటూ వెలువడిన పత్రికా కధనాలు తప్పుదోవ పట్టించే విధంగా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి

2018-19 సమాచారం ఆధారంగా దేశంలో వైద్యం కోసం ప్రజలు సొంతంగా చేస్తున్న ఖర్చుల అంచనాలు రూపొందాయి.

Posted On: 07 OCT 2022 1:47PM by PIB Hyderabad

జాతీయ ఆరోగ్య ఖాతాల్లో లోపాలు ఉన్నాయంటూ వెలువడిన వార్తల్లో వాస్తవం లేదు. ముఖ్యంగా దేశంలో వైద్యం కోసం ప్రజలు సొంతంగా చేస్తున్న ఖర్చులకు  సంబంధించి ఈ వార్తల్లో ప్రస్తావించిన అంశాలు తప్పుదోవ పట్టించే విధంగా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించి జరుగుతున్న వ్యయాన్ని జాతీయ ఆరోగ్య ఖాతాలు అంచనా రూపంలో సూచిస్తాయి. దేశంలో నెలకొన్న ఆరోగ్య వ్యవస్థ పనితీరును ప్రతిబింబించే విధంగా రూపొందే అంచనాలు ఆరోగ్య సూచికలపై  సాధించిన ఆర్థిక  పురోగతిని పర్యవేక్షించడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తాయి.

జాతీయ ఆరోగ్య ఖాతాల అంచనాలు ఇటీవల విడుదల అయ్యాయి. వైద్యం కోసం ప్రజలు చేస్తున్న సొంత  వ్యక్తిగత వ్యయం తగ్గిందని ఈ నివేదికలు తెలియజేశాయి. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని అంచనాలు చెబుతున్నాయి. అయితే, దేశంలో పనిచేస్తున్న ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ఆరోగ్య ఆర్థికవేత్త ఈ అంచనాలను 'ఎండమావి'గా వర్ణించారు. దీనిని ఆధారంగా చేసుకుని కొన్ని వార్తా సాధనాలు వార్తలు ప్రచురించాయి. ఈ వార్తలు వాస్తవాలకు దూరంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. 

నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (NSO) సమాచార విశ్వవనీయతను ప్రశ్నించే విధంగా వార్తలు వెలువడ్డాయి.  నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సొంత వ్యయానికి సంబంధించి 2017-18, 2014లో అంచనాలు సిద్ధం చేసింది. రెండు సార్లు నిర్వహించిన 71వ మరియు 75వ రౌండ్‌ల సర్వే ఒకేవిధంగా సారూప్యత కలిగి ఉండేలా చూసేందుకు గృహాలను ఎంపిక చేసేందుకు ఒకే విధమైన నమూనాకు  రూపకల్పన చేసి ఉపయోగించడం జరిగింది. 

ఏడాది పాటు నిర్వహించిన సర్వే ఆధారంగా 2017-18 సమాచారం సిద్దమయింది. 2014 సర్వే ఆరు నెలలు సాగింది. సర్వే జరిగిన కాలం సమాచార సేకరణలో కీలకంగా ఉంటుంది. ఎక్కువ కాలం సాగిన 2017-18 సర్వే గతంలో 2014లో జరిగిన సర్వే కంటె  సమాచార విశ్వనీయత ఎక్కువగా ఉంటుంది. 2014 సర్వే నివేదికను ఎటువంటి అనుమానం లేకుండా అమోదించిన నిపుణులు 2017-18 సర్వే నివేదిక విశ్వసనీయతను ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. 

ఎటువంటి ఆధారాలు లేకుండా, సమర్ధనీయం కాని అంశాల ఆధారంగా తమకు నచ్చిన అంశాలను ఎంపిక చేసుకుని నిరాధారమైన  విమర్శలు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు.   “సమస్యాత్మకంగా అనిపించడం/అసంభవం అనిపించడం” వంటి సూత్రీకరణలు ఆధారంగా  ఊహాజనిత వార్తలు ప్రచురించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. 

2017-18 కి సంబంధించి  నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిద్ధం చేసిన నివేదికలో ప్రభుత్వం కల్పిస్తున్న ఆరోగ్య సేవలను ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. 2017-18లో ఆరోగ్య సంరక్షణ కోసం చేస్తున్న సొంత ఖర్చు తగ్గిందని మురళీధరన్ తదితరులు రెండు జాతీయ సర్వేలను  ఆధారంగా చేసుకుని  నిర్వహించిన అధ్యయనం (2020) లో వెల్లడయింది. ఈ అధ్యయన వివరాలను  ప్రముఖ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ప్రచురించింది.

రెండు సర్వేలు జరిగిన మధ్య కాలంలో ప్రభుత్వం ప్రజల కోసం ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సౌకర్యాలను అభివృద్ధి చేసింది.ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను  ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.దీనితో ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజలు చేయాల్సిన ఖర్చు తగ్గింది. రెండు జాతీయ సర్వేల నివేదికలు ఇదే అంశాన్ని స్పష్టం చేశాయి.  

ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను ఉపయోగించుకుని వైద్య సలహాలు పొందుతున్న వారి సంఖ్య గత 15 రోజుల్లో 5% పెరిగింది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 4%, పట్టణ ప్రాంతాల్లో 3% పెరిగింది.ప్రసవం విషయంలో ప్రభుత్వ సౌకర్యాలు వినియోగించుకుంటున్న వారి సంఖ్య  గ్రామీణ ప్రాంతాల్లో 13%, పట్టణ ప్రాంతాల్లో 6% పెరిగింది.

వైద్యం కోసం ఆసుపత్రిలో చేరుతున్న వారి కోసం ప్రభుత్వం కల్పించిన సౌకర్యాల వల్ల వైద్య ఖర్చులు సరాసరిన 20% పైగా తగ్గాయి. ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల కోసం చేస్తున్న ఖర్చు పట్టణ ప్రాంతాల్లో 9%, గ్రామీణ ప్రాంతాల్లో 16% వరకు తగ్గింది. 

నిపుణులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఆస్పత్రి ఖర్చులు తగ్గడాన్ని ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. ఆస్పత్రి ఖర్చులు తగ్గాయని చెప్పడానికి  "తార్కిక వివరణ లేదు" అని అంటున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా వైద్య సంరక్షణలో వస్తున్న మార్పులు అర్ధం కాకపోవడం వల్ల ఇటువంటి వాదనలకు దిగుతున్నారు. ఇన్‌పేషెంట్ సంరక్షణకు కాకుండా  నుండి ఔట్ పేషెంట్ సంరక్షణకు  ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యత ఏర్పడింది.  కొన్ని దేశాలు దీనికోసం ప్రత్యేక విధానాలు రూపొందించి అమలు చేస్తున్నాయి.   

వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరకుండా చికిత్స పొందుతున్న వారి సంఖ్య గత 15 రోజుల్లో గణనీయంగా పెరిగింది. అవుట్ పేషెంట్ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రజల సంఖ్య రెండు సర్వేల మధ్య కాలంలో 5%కి మించి పెరిగింది. ప్రజలు ఆస్పత్రిలో చేరకుండా బయట ఉండి వైద్య సేవలు పొందడానికి మొగ్గు చూపిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.  

గణాంకాలు, వాస్తవాలను పరిశీలిస్తే 2018-19 జాతీయ ఆరోగ్య ఖాతాల విశ్వసనీయతపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇటువంటి సమాచారాన్ని ప్రజలు విజ్ఞతతో పరిశీలించి అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.  

మూలధన పెట్టుబడిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆరోగ్య రంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం పెరుగుతుంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2013-14 నుంచి ఆరోగ్య రంగంపై చేస్తున్న వ్యయంలో పెరుగుదల కనిపిస్తుంది.  

ప్రస్తుత ప్రభుత్వం 2013-14 నుంచి 2017-18 వరకు చేసిన వ్యయం క్రమబద్ధంగా పెరుగుతోంది.  ఆరోగ్య రంగంలో ప్రభుత్వ వ్యయం స్థూల జాతీయోత్పత్తి లో 10% పైగా పెరిగింది.   

***



(Release ID: 1865917) Visitor Counter : 164