ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమబంగాల్ లోని జల్ పాయ్ గుడీ లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టంవాటిల్లినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండిపరిహారాన్ని ప్రకటించారు

Posted On: 06 OCT 2022 9:17AM by PIB Hyderabad

పశ్చిమ బంగాల్ లోని జల్ పాయ్ గుడీ లో దుర్గ పూజ ఉత్సవాల వేళ జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ఈ విషాద సంఘటన లో మృతుల యొక్క దగ్గరి బంధువుల కు 2 లక్షల రూపాయల వంతున మరియు గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘పశ్చిమ బంగాల్ లోని జల్ పాయ్ గుడీ లో దుర్గ పూజ ఉత్సవాల వేళ దుర్ఘటన సంభవించిందని తెలిసి దు:ఖించాను. ఈ దుర్ఘటన లో తమ ప్రియతముల ను కోల్పోయిన వ్యక్తుల కు ఇదే నా సంతాపం: ప్రధాన మంత్రి @narendramodi’’

 

‘‘పశ్చిమ బంగాల్ లోని జల్ పాయ్ గుడీ లో దుర్గ పూజ ఉత్సవాల వేళ జరిగిన విషాద సంఘటన లో చనిపోయిన వారి యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది : ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.

 

****

DS/ST

 

 

DS/ST


(Release ID: 1865532) Visitor Counter : 157