ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి కి మరియు యూక్రేన్ అధ్యక్షుని కి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ

Posted On: 04 OCT 2022 6:49PM by PIB Hyderabad

యూక్రేన్ అధ్యక్షుడు గౌరవనీయుడు శ్రీ వోలోదిమిర్ జెలెన్ స్కీ తో ఈ రోజు న టెలిఫోన్ ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు.

యూక్రేన్ లో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సంఘర్షణ ను గురించి నేత లు ఇద్దరు చర్చించారు. ఈ పోరాటాన్ని శీఘ్రం గా సమాప్తం చేసుకొని, మరి సంభాషణ, ఇంకా దౌత్యం తాలూకు మార్గం లో ముందుకు పోవలసిన అవసరం ఉందంటూ ప్రధాన మంత్రి తాను ఇదివరకు ఇచ్చిన పిలుపు ను మరో సారి సైతం గుర్తు కు తెచ్చారు.   ఈ సంఘర్షణ కు ఎటువంటి సైనిక పరిష్కారం ఉండదన్నదే తన గట్టి నమ్మకం అని ఆయన అంటూ, ఎటువంటి శాంతి ప్రయాసల కు అయినా తోడ్పాటు ను అందించడం కోసం భారతదేశం తయారు గా ఉందని తెలియజేశారు.  ఐక్య రాజ్య సమితి చార్టర్ ను, అంతర్జాతీయ చట్టాన్ని మరియు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ఇంకా ప్రాదేశిక అఖండత ను గౌరవించడం ఎంతయినా ముఖ్యం అని కూడా ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.

యూక్రేన్ సహా అన్ని పరమాణు కేంద్రాల భద్రత కు  భారతదేశం ప్రాముఖ్యాన్ని ఇస్తోందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. పరమాణు కేంద్రాల కు ఏ విధమైనటువంటి అపాయాలు ఎదురైనా సార్వజనిక ఆరోగ్యం పైన మరియు పర్యావరణం పైన దూరగామి మరియు వినాశకారి పరిణామాలు తలెత్తుతాయంటూ ఆయన మరీ మరీ చెప్పారు.
ఇద్దరు నేత లు గ్లాస్ గో లో 2021వ సంవత్సరం నవంబరు లో జరిగిన తమ వెనుకటి సమావేశం అనంతరం ద్వైపాక్షిక సహకారం తాలూకు ముఖ్య రంగాల పై తాజా గా మరో సారి మాట్లాడుకొన్నారు.

 

***



(Release ID: 1865348) Visitor Counter : 121