రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం గుజరాత్ విశ్వవిద్యాలయం స్టార్టప్ ప్లాట్ ఫారమ్ 'హెర్ స్టార్ట్'- ను ప్రారంభించిన భారత రాష్ట్రపతి



విద్య మరియు గిరిజన అభివృద్ధికి సంబంధించిన గుజరాత్ ప్రభుత్వ వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం/శంకుస్థాపనలు చేసిన రాష్ట్రపతి

Posted On: 04 OCT 2022 1:37PM by PIB Hyderabad

 

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (అక్టోబర్ 4, 2022) అహ్మదాబాద్ లోని గుజరాత్ విశ్వవిద్యాలయం స్టార్టప్ ప్లాట్ ఫారమ్ అయిన 'హెర్ స్టార్ట్'ను ప్రారంభించారు.  విద్య మరియు గిరిజన అభివృద్ధికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వ వివిధ ప్రాజెక్టులను  ఆమె వర్చువల్ గా గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి ప్రారంభోత్సవం/శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాత్రమే కాకుండా భారతదేశ అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఇస్రో మాజీ ఛైర్మన్, డాక్టర్. కె. కస్తూరిరంగన్; మరియు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు కూడా కావడం గుజరాత్ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని అన్నారు.

 

డాక్టర్ విక్రమ్ సారాభాయ్ వంటి పూర్వ విద్యార్థులున్న సంస్థ శాస్త్ర, పరిశోధన మరియు ఆవిష్కరణ రంగాల్లో అగ్రగామిగా నిలవడం సహజమని రాష్ట్రపతి అన్నారు. గుజరాత్ యూనివర్శిటీ క్యాంపస్ లో 450కి పైగా స్టార్టప్ లు పనిచేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. మరియు 125 కంటే ఎక్కువ మంది మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థలు ఈ విశ్వవిద్యాలయం ద్వారా చురుకుగా మద్దతు ఇస్తున్నాయి. అలాగే సుమారు 15,000 మంది మహిళా వ్యవస్థాపకులు ఈ చొరవతో ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో అసోసియేట్ అయ్యారు. అటువంటి స్టార్టప్ ఫ్రెండ్లీ యూనివర్శిటీలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం అంకితమైన ఒక స్టార్టప్ ఫ్లాట్ ఫారాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఈ వేదిక ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల ఆవిష్కరణను, ప్రారంభ ప్రయత్నాలను పెంపొందించడమే కాకుండా ఔత్సాహిక మహిళాపారిశ్రామిక వేత్తలను వివిధ ప్రభుత్వ , ప్రైవేటు సంస్థలతో అనుసంధానం చేయడంలో ఒక సమర్థవంతమైన వేదికగా నిలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

 

గుజరాత్ లో విద్యకు సంబంధించిన సైనిక్ స్కూల్, గర్ల్స్ లిటరసీ రెసిడెన్షియల్ స్కూల్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి తెలిపారు. ఎందుకంటే శాస్త్ర, పరిశోధన మరియు ఆవిష్కరణలలో భారతదేశం యొక్క స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి పాఠశాల విద్య ద్వారా పునాది రాయి నిర్మించబడుతుంది.

 

ఇతర రంగాలతో పాటు విద్యారంగంలో గుజరాత్ గణనీయమైన పురోగతిని సాధించిందని రాష్ట్రపతి అన్నారు. గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రంలో బడి మానేసే రేటు 22 శాతం నుంచి 1.37 శాతానికి తగ్గింది. ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి కూడా 40 నుండి 26 కు మెరుగుపడింది. నేడు, 'విద్యా సమీక్ష కేంద్రం' ద్వారా దాదాపు 55,000 పాఠశాలల్లో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులపై నిజ-సమయ పర్యవేక్షణ జరుగుతోంది, ఫలితంగా విద్యార్థుల అభ్యాస ఫలితాలు మెరుగుపడతాయి. 'మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్' కింద వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని దాదాపు 20,000 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

 

ఉన్నత విద్యారంగంలోనూ గుజరాత్ గణనీయమైన ప్రగతిని సాధించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. 2001-02లో రాష్ట్రంలో కళాశాలల సంఖ్య 775 ఉండగా, 2020-21 నాటికి ఈ సంఖ్య 3,100కు పైగా పెరిగింది. ఉన్నత విద్య మూల్యాంకనం కోసం ఈ రాష్ట్రంలో భారతదేశపు మొట్టమొదటి విద్య నాణ్యత మరియు పర్యవేక్షణ సెల్, 'గరిమా సెల్' స్థాపించబడింది. 'వన్ బంధు-కల్యాణ్ యోజన'ని సమర్థవంతంగా అమలు చేయడంతో గిరిజన సమాజంలో అక్షరాస్యత శాతం గణనీయంగా పెరిగిందని ఆమె అన్నారు. ఈ పథకం గిరిజన విద్యార్థులలో పాఠశాల డ్రాపౌట్ రేటును మెరుగుపరిచింది.

 

గత రెండు దశాబ్దాలుగా గుజరాత్ అనేక అభివృద్ధి పారామితులలో అగ్రగామిగా ఉందని రాష్ట్రపతి అన్నారు. ఇది పరిశ్రమ, ఆవిష్కరణ మరియు మౌలిక సదుపాయాల సమ్మిళిత అభివృద్ధిలో అనేక బెంచ్‌మార్క్‌లను అందించింది.

 

ప్రతి రాష్ట్రానికి దాని స్వంత అభివృద్ధి నమూనా ఉందని, ఇది రాష్ట్ర వనరులు మరియు అవసరాలను బట్టి నిర్ణయించబడుతుందని రాష్ట్రపతి అన్నారు. కానీ గుజరాత్ సర్వతోముఖాభివృద్ధి సాధించిన తీరు ఇతర రాష్ట్రాలకు సమ్మిళిత అభివృద్ధి మార్గాన్ని చూపింది. అన్ని రాష్ట్రాలు ఒకదాని నుంచి మరొకటి నేర్చుకుని, తమ విజయవంతమైన నమూనాలను అవలంబించడం ద్వారా ముందుకు సాగితే, అమృత్-కాల్ సమయంలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

 

రాష్ట్రపతి ప్రసంగం కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి -

 

 

******

 


(Release ID: 1865065) Visitor Counter : 226