ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022 సెప్టెంబర్ నెలలో రూ.1,47,686 కోట్ల స్థూల జీఎస్టీ ఆదాయం సేకరణ


వరుసగా ఏడు నెలల పాటు నెలవారీ జీఎస్టీ ఆదాయం రూ. 1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువ

సెప్టెంబర్ 2022 నెల రాబడి 2021లో అదే నెలలో జీఎస్టీ రాబడి కంటే 26% ఎక్కువ

సెప్టెంబరులో 1.1 కోట్లకు పైగా ఇ-వే బిల్లులు, ఇ-ఇన్‌వాయిస్‌లు (72.94 లక్షల ఇ-ఇన్‌వాయిస్‌లు, 37.74 లక్షల ఇ-వే బిల్లులు)తో సెప్టెంబరులో మరో మైలురాయిని దాటింది, 2022 సెప్టెంబరు 30న ఎన్ఐసి ద్వారా అమలులోకి వచ్చిన జీఎస్టీ పోర్టల్‌లో ఎటువంటి లోపం లేకుండా తేవడం జరిగింది.

Posted On: 01 OCT 2022 12:59PM by PIB Hyderabad

సెప్టెంబర్ 2022 నెలలో సేకరించిన స్థూల జీఎస్టీ రాబడి రూ. 1,47,686 కోట్లు, ఇందులో సీజీఎస్టీ రూ. 25,271 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ.31,813 కోట్లు, ఐ జీఎస్టీ రూ. 80,464 కోట్లు ( వస్తు దిగుమతులు రూ.41,215 కోట్ల తో సహా), సెస్ కింద రూ.10,137 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ. 856 కోట్లతో సహా).

ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సీజీఎస్టీకి రూ.31,880 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ. 27,403 కోట్లను ఎప్పటిలాగే సర్దుబాటు చేసింది. సెప్టెంబర్ 2022 నెలలో సాధారణ సెటిల్‌మెంట్ల తర్వాత కేంద్రం, రాష్ట్రాల ఆదాయం  సీజీఎస్టీకి రూ.57,151 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ. 59,216 కోట్లు కేటాయింపు అయింది. 

సెప్టెంబర్ 2022 నెల రాబడి గత సంవత్సరం ఇదే నెలలో జీఎస్టీ రాబడి కంటే 26% ఎక్కువ. వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 39% ఎక్కువగా ఉన్నాయి. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు (సేవల దిగుమతి తో సహా) గత సంవత్సరం ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయం కంటే 22% ఎక్కువగా ఉన్నాయి.

ఇది ఎనిమిదవ నెల, ఇప్పుడు వరుసగా ఏడు నెలలు, నెలవారీ  జీఎస్టీ ఆదాయాలు రూ. 1.4 లక్షల కోట్ల మార్కు కంటే ఎక్కువగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో సెప్టెంబర్ 2022 వరకు  జీఎస్టీ రాబడిలో వృద్ధి 27% ఉంది, ఆగస్టు 2022 నెలలో, 7.7 కోట్ల ఇ-వే బిల్లులు జెనెరేట్ అయ్యాయి. ఇది జూలై 2022 లో 7.5 కోట్ల కంటే స్వల్పంగా ఎక్కువ.

ఈ నెలలో రెండో అత్యధిక సింగిల్ డే కలెక్షన్ రూ. 49,453 కోట్లు సెప్టెంబర్ 20న రెండవ అత్యధిక 8.77 లక్షల చలాన్‌లు దాఖలయ్యాయి, తర్వాత  2022 జూలై 20న 9.58 లక్షల చలాన్‌ల ద్వారా కేవలం రూ. 57,846 కోట్లు సేకరించారు, ఇది సంవత్సరం ముగింపు రిటర్న్‌లకు సంబంధించినది. జీఎస్టిఎన్  ద్వారా నిర్వహిస్తున్న జీఎస్టీ పోర్టల్ పూర్తిగా స్థిరీకరణ అయింది. ఏ లోపాలు లేవని  ఇది స్పష్టంగా చూపిస్తుంది. 30వ తేదీన ఎన్‌ఐసి నిర్వహిస్తున్న పోర్టల్‌లో ఎలాంటి లోపం లేకుండా 1.1 కోట్లకు పైగా ఇ-వే బిల్లులు, ఇ-ఇన్‌వాయిస్‌లు (72.94 లక్షల ఇ-ఇన్‌వాయిస్‌లు , 37.74 లక్షల ఇ-వే బిల్లులు) జెనెరేట్ అయి సెప్టెంబర్‌లో మరో మైలురాయిని దాటింది. 

దిగువ చిత్రం ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల  జీఎస్టీ ఆదాయాల ట్రెండ్‌లను చూపుతుంది. సెప్టెంబర్ 2021 తో పోలిస్తే సెప్టెంబర్ 2022 నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరించిన   జీఎస్టీ  రాష్ట్రాల వారీ గణాంకాలను టేబుల్ చూపుతుంది.

 

 

రాష్ట్రాల వారీగా 2022 సెప్టెంబర్ లో జీఎస్టీ రెవిన్యూ వృద్ధి 

రాష్ట్రం 

సెప్టెంబర్ -21

సెప్టెంబర్-22

వృద్ధి 

జమ్మూ కాశ్మీర్ 

377

428

13%

హిమాచల్ ప్రదేశ్ 

680

712

5%

పంజాబ్ 

1,402

1,710

22%

చండీగఢ్ 

152

206

35%

ఉత్తరాఖండ్ 

1,131

1,300

15%

హర్యానా 

5,577

7,403

33%

ఢిల్లీ 

3,605

4,741

32%

రాజస్థాన్ 

2,959

3,307

12%

ఉత్తర ప్రదేశ్ 

5,692

7,004

23%

బీహార్ 

876

1,466

67%

సిక్కిం 

260

285

9%

అరుణాచల్ ప్రదేశ్ 

55

64

16%

నాగాలాండ్ 

30

49

61%

 మణిపూర్ 

33

38

17%

మిజోరాం 

20

24

22%

త్రిపుర 

50

65

29%

మేఘాలయ 

120

161

35%

అస్సాం 

968

1,157

20%

పశ్చిమ బెంగాల్ 

3,778

4,804

27%

ఝార్ఖండ్ 

2,198

2,463

12%

ఒడిశా 

3,326

3,765

13%

ఛత్తీస్గఢ్ 

2,233

2,269

2%

మధ్యప్రదేశ్ 

2,329

2,711

16%

గుజరాత్ 

7,780

9,020

16%

దామన్ డయ్యు 

0

0

-38%

దాద్రా నాగర్ హవేలీ 

304

312

3%

మహారాష్ట్ర 

16,584

21,403

29%

కర్ణాటక 

7,783

9,760

25%

గోవా 

319

429

35%

లక్షద్వీప్ 

0

3

731%

కేరళ 

1,764

2,246

27%

తమిళనాడు 

7,842

8,637

10%

పుదుచ్చేరి 

160

188

18%

అండమాన్ నికోబార్ దీవులు 

20

33

69%

తెలంగాణ 

3,494

3,915

12%

ఆంధ్రప్రదేశ్ 

2,595

3,132

21%

లడఖ్ 

15

19

27%

ఇతర ప్రాంతం 

132

202

53%

కేంద్ర పరిథి 

191

182

-5%

మొత్తం 

86,832

1,05,615

22%

 

 

****


(Release ID: 1864567) Visitor Counter : 174