ప్రధాన మంత్రి కార్యాలయం
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని శ్రద్ధాంజలి
ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయంలో లాల్ బహదూర్ శాస్త్రి
గ్యాలరీ నుంచి కొన్ని చిత్రాలను ప్రజలతో పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
02 OCT 2022 9:15AM by PIB Hyderabad
భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించి తన ఆలోచనలపై ఒక వీడియోను ప్రజలతో పంచుకున్నారు. అలాగే న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయంలో లాల్ బహదూర్ శాస్త్రి గ్యాలరీ నుంచి ఆయన జీవిత విశేషాలను తెలిపే కొన్ని చిత్రాలను ప్రజలతో పంచుకున్నారు.
దీనికి సంబంధించి ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత్వం, నిర్ణయాత్మకత యావద్భారత ప్రజానీకం ప్రశంసలు అందుకున్నాయి. మన చరిత్రలో చాలా కీలకమైన సమయంలో దృఢమైన ఆయన నాయకత్వ పటిమ చిరస్మరణీయం. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.
“ఇవాళ శాస్త్రీజీ జయంతి నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయంలోగల ఆయన గ్యాలరీ నుండి కొన్ని సంగ్రహ జ్ఞాపకాలను కూడా మీతో పంచుకుంటున్నాను. ఇవి ప్రధానిగా ఆయన జీవనాన్ని, అందుకున్న విజయాలను వివరిస్తాయి. జీవితంలో ఒక్కసారి ఈ మ్యూజియంను సందర్శించండి...” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1864391)
आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam