సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ అందించిన అవార్డుల్లో బుక్ ప్రొడక్షన్ 2022కు గాను తొమ్మిది అవార్డులను పొందిన పబ్లికేషన్స్ డివిజన్

Posted On: 30 SEP 2022 11:58AM by PIB Hyderabad

భారతీయ ప్రచురణకర్తల అపెక్స్ బాడీ ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ (ఎఫ్‌ఐపి) 42వ వార్షిక అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బుక్ ప్రొడక్షన్ 2022 ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లికేషన్స్ డివిజన్ దాని శీర్షికలకు వివిధ విభాగాలలో తొమ్మిది అవార్డులను గెలుచుకుంది.


డిపిడి కేటగిరీలలో ఆరు ప్రథమ బహుమతులను గెలుచుకుంది. జనరల్ మరియు ట్రేడ్ బుక్స్ (ఇంగ్లీష్), 'బ్యాలెన్సింగ్ ది విజ్డమ్ ట్రీ', జనరల్ అండ్ ట్రేడ్ బుక్స్ (హిందీ) 'భారత్ విభజన్ కీ కహానీ', ఆర్ట్ అండ్ కాఫీ టేబుల్ బుక్స్ (ప్రాంతీయ భాషలు)లో 'కోర్ట్స్ ఆఫ్ ఇండియా (మరాఠీ)', రిఫరెన్స్ బుక్స్ (ఇంగ్లీష్) 'ఇండియా 2022',  సైంటిఫిక్/టెక్నికల్/మెడికల్ బుక్స్ (హిందీ) 'కోవిడ్-19: వైశిక్ మహామారి', జర్నల్స్ మరియు హౌస్ మ్యాగజైన్స్ (హిందీ)కు గాను 'కురుక్షేత్ర' ఉన్నాయి.

'లోక్‌ తంత్ర కే స్వర్'కు జనరల్ మరియు ట్రేడ్ బుక్స్ (హిందీ) విభాగంలో  రెండవ బహుమతి లభించింది.  పిల్లల పుస్తకాలు (సాధారణ ఆసక్తి) (0-10 సంవత్సరాలు) (హిందీ) 'పినుషి' మరియు జర్నల్స్ విభాగాలలో రెండు తృతీయ బహుమతులు మరియు జర్నల్స్ అండ్ హౌస్ మ్యాగజైన్‌ (ప్రాంతీయ భాషలు)విభాగంలో అజ్కల్ (ఉర్దూ)కు అవార్డు లభించింది.

గత సంవత్సరం, పబ్లికేషన్స్ డివిజన్ వివిధ విభాగాలలో పలు ప్రచురణలకు పది అవార్డులను గెలుచుకుంది. డిబిడి అనేది పుస్తకాలు మరియు పత్రికల రిపోజిటరీ. ఇది జాతీయ ప్రాముఖ్యత మరియు భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని హైలైట్ చేస్తుంది. 1941లో ఏర్పాటైన పబ్లికేషన్స్ డివిజన్ భారతదేశ ప్రభుత్వ ప్రధాన ప్రచురణ సంస్థ. ఇది చరిత్ర, కళ, సాహిత్యం, సంస్కృతి, ఆర్థికం, సైన్స్ మరియు క్రీడలు, గాంధేయ సాహిత్యం, బాలల సాహిత్యం అలాగే ప్రసంగాలతో సహా వివిధ భాషల్లో పుస్తకాలు మరియు పత్రికలను అలాగే జాతీయ నాయకులు మరియు ప్రసిద్ధ వ్యక్తుల ఆత్మకథలను అందిస్తోంది.  ఈ విభాగం పాఠకులు మరియు ప్రచురణకర్తల మధ్య విశ్వసనీయతను పొందింది. అలాగే కంటెంట్ ప్రామాణికత మరియు  ప్రచురణలకు సరసమైన ధరకు ప్రాచుర్యం పొందింది.


 

***



(Release ID: 1864203) Visitor Counter : 103