హోం మంత్రిత్వ శాఖ

పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థ‌ల‌ను చ‌ట్ట‌విరుద్ధ సంస్థ‌లుగా ప్ర‌క‌టించిన హోం వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌

Posted On: 28 SEP 2022 9:03AM by PIB Hyderabad

 దేశ స‌మ‌గ్ర‌త‌కు, భ‌ద్ర‌త‌కు, సార్వ‌భౌమ‌త్వానికి విఘాతం క‌ల్గించేలా తీవ్ర‌వాదం, అందుకు ఆర్థిక మ‌ద్ద‌తు, కొంద‌రిని ల‌క్ష్యంగా చేసుకుని భ‌యాన‌కంగా హ‌త్య చేయ‌డం, దేశ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ను విస్మ‌రించ‌డం, ప్ర‌జా శాంతికి భంగం క‌లిగించ‌డం వంటి తీవ్ర‌మైన నేరాల‌లో  పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ), దాని అనుబంధ లేక అనుబ‌ద్ధ సంస్థ‌లు జోక్యం క‌లిగి ఉన్న‌ట్టు క‌నుగొన్నారు. 
క‌నుక‌, ఈ సంస్థ చ‌ట్ట‌వ్య‌తిరేక‌, అనైతిక కార్య‌క‌లాపాల‌ను అరిక‌ట్ట‌డం అవ‌స‌ర‌మ‌ని గుర్తించిన హోం వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) స‌హా దాని అనుబంధ సంస్థ‌లు, సంఘ‌ట‌న‌లు రీహాబ్ ఇండియా ఫౌండేష‌న్ (ఆర్ఐఎఫ్‌), క్యాంప‌స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సిఎఫ్ఐ), ఆలిండియా ఇమామ్స్ కౌన్సిల్ (ఎఐఐసి), నేష‌న‌ల్ క‌న్ఫెడ‌రేష‌న్ ఆఫ్ హ్యూమ‌న్ రైట్స్ ఆర్గ‌నైజేష‌న్ (ఎన్‌సిహెచ్ ఆర్ ఒ), నేష‌న‌ల్ వుమ‌న్స్ ఫ్రంట్‌, జూనియ‌ర్ ఫ్రంట్‌, ఎంప‌వ‌ర్ ఇండియా ఫౌండేష‌న్‌, రీహాబ్ ఫౌండేష‌న్‌, కేర‌ళ‌ల‌ను అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్ష‌న్) యాక్ట్‌, (చ‌ట్ట‌విరుద్ధ కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం), 1967లోని నిబంధ‌న‌ల కింద చ‌ట్ట‌విరుద్ధ సంస్థ‌లుగా ప్ర‌క‌టించింది. 
పిఎఫ్ఐని నిషేధిస్తూ జారీ చేసిన గెజెట్ నోటిఫికేష‌న్‌ను చూసేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండిః 

 

***(Release ID: 1862924) Visitor Counter : 216