పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన అంతర్జాతీయ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ) మరియు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసిఏఓ )
ఒప్పంద ఆలోచనను 2022 మే లో ప్రతిపాదించిన విమానయాన శాఖ మంత్రి శ్రీ శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా
2030 నాటికి ఉద్గార తీవ్రతను 33-35% తగ్గించడం,పునరుత్పాదక స్థాపక శక్తిని 175 జీడబ్ల్యుకి పెంచాలని లక్ష్యంగా పనిచేస్తున్న భారతదేశం
Posted On:
28 SEP 2022 9:00AM by PIB Hyderabad
మాంట్రియల్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసిఏఓ ) 42వ సదస్సులో భాగంగా 2022 సెప్టెంబర్ 26న జరిగిన ఒక కార్యక్రమంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ)
, ఐసిఏఓ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. భారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా, ఫ్రాన్స్ రవాణా మంత్రి మాన్సియర్ క్లెమెంట్ బ్యూన్, మరియు ఐసిఏఓ కౌన్సిల్ అధ్యక్షుడు సాల్వటోర్ స్కియాచిటానో సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై ఐసిఏఓ సెక్రటరీ జనరల్ జువాన్ కార్లోస్ సలాజర్ మరియు ఐఎస్ఏ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ శ్రీ జాషువా విక్లిఫ్ సంతకాలు చేశారు.
2022 మే నెలలో మాంట్రియల్‌లో పర్యటించిన జ్యోతిరాదిత్య ఎం సింధియా ఐఎస్ఏతో కలిసి ఐసిఏఓ పనిచేసే ప్రతిపాదన పరిశీలించాలని ఐసిఏఓ అధ్యక్షునికి సూచించారు. నాలుగు నెలల్లో రెండు సంస్థల మధ్య అవగాహన కుదిరింది. 2015 లో పారిస్ లో జరిగిన కాప్ 21 సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తో జరిపిన చర్చల సందర్భంగా ప్రతిపాదించిన అనేక ముఖ్యమైన కార్యక్రమాలు ఈ అవగాహన ఒప్పందం తో కార్యరూపం దాల్చనున్నాయి.
ఐక్యరాజ్య సమితికి చెందిన పలు సంస్థలతో సహా 32 భాగస్వామ్య సంస్థలు, 121 దేశాలు ఐఎస్ఏ లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. శిలాజ ఇంధన వినియోగం తగ్గించి సౌర శక్తిని సమర్ధంగా వినియోగం అయ్యేలా చూసే అంశంపై దృష్టి సారించి ఐఎస్ఏ పనిచేస్తోంది. ఎల్డీసీ, ఎస్ఐడీసీ ప్రభావం పై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్న సభ్య దేశాలకు తక్కువ ఖర్చుతో, సమర్ధంగా పునరుత్పాదక శక్తిని ఉపయోగించే అంశంపై ఐఎస్ఏ పరిష్కార మార్గాలను అందిస్తోంది.
2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గిస్తామని కాప్ 26 సమావేశంలో భారతదేశం ప్రకటించింది. ప్రజా సంక్షేమం జాతీయ యాజమాన్య సూత్రాల ఆధారంగా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలన్న లక్ష్యంగా ప్రభుత్వ విధానాల రూపకల్పన జరిగింది. నిబద్ధతతో కొనసాగుతుంది. భారతదేశం 175 జీడబ్ల్యు పునరుత్పాదక ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సౌర శక్తి ద్వారా 100 జీడబ్ల్యు ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్నది భారతదేశ లక్ష్యంగా ఉంది. 2030 నాటికి ఉద్గార తీవ్రతను 33-35% తగ్గించి, అన్ని గ్రామాలకు సౌర శక్తిని వినియోగించి విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు. ప్రపంచంలో పూర్తిగా సౌర శక్తిపై ఆధారపడి పనిచేస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ విమానాశ్రయం గా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది.
ఫ్రాన్స్ సహకారంతో తమ దేశంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రపంచ దేశాలను కోరింది. సౌర విద్యుత్ రంగంలో ట్రిలియన్ డాలర్ల విలువ చేసే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించిన కూటమి మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు అందుబాటు ధరలో సౌర విద్యుత్తు అందించాలని నిర్ణయించింది.
విమానయాన రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఐసిఏఓ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఐఎస్ఏ, ఐసిఏఓల మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందం లక్ష్య సాధనకు ఉపకరిస్తుంది. మరింత మెరుగైన సమయంలో వచ్చేది కాదు, ఎందుకంటే ఇది సౌరశక్తిని ఉపయోగించుకునే రాష్ట్రాల సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా సాగుతున్న ప్రయత్నాలకు ఒప్పందం చేయూత ఇస్తుంది. అవసరమైన సమాచారాన్ని అందించడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, ప్రాజెక్టులను అమలు చేసే అంశంలో అవగాహన ఒప్పందం పని చేస్తుంది. ఇది అన్ని సభ్య దేశాల విమానయాన రంగంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించి, ఎక్కువ చేస్తుంది.
***
(Release ID: 1862898)
Visitor Counter : 327