సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఐటీ రూల్స్‌ 2021 ప్రకారం 10 యూట్యూబ్‌ ఛానెల్స్‌నుండి 45 యూట్యూబ్‌ వీడియోలను బ్లాక్ చేసిన ఐ అండ్‌ బీ మంత్రిత్వ శాఖ


కొన్నివర్గాలకు వ్యతిరేకంగా చేసిన ద్వేషపూరిత ప్రసంగాలు మరియు మత సామరస్యాన్ని దెబ్బతీసే వీడియోలు బ్లాక్ చేయబడ్డాయి

భారతదేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు మరియు శాంతి భద్రతలకు హాని కలిగించే ఉద్దేశంతో మార్ఫింగ్ చేయబడిన చిత్రాలు మరియు వీడియోలు ఉపయోగించబడుతున్నాయి

Posted On: 26 SEP 2022 5:44PM by PIB Hyderabad

ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదికల ఆధారంగా కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 10 యూట్యూబ్ ఛానెల్‌ల నుండి 45 యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని యూట్యూబ్‌ని ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021లోని నిబంధనల ప్రకారం సంబంధిత వీడియోలను బ్లాక్ చేయమని 23.09.2022న ఆదేశాలు జారీ చేయబడ్డాయి. బ్లాక్ చేయబడిన వీడియోలకు 1 కోటి 30 లక్షల వీక్షణలు ఉన్నాయి.

ఈ కంటెంట్‌లో తప్పుడు వార్తలు మరియు మతపరమైన వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో మార్ఫింగ్ చేసిన వీడియోలు ఉన్నాయి. కొన్ని వర్గాల మతపరమైన హక్కులను ప్రభుత్వం తీసివేసిందనే తప్పుడు వాదనలు, మతపరమైన సంఘాలపై హింసాత్మక బెదిరింపులు, భారతదేశంలో అంతర్యుద్ధం ప్రకటించడం మొదలైనవి వాటిలో ఉన్నాయి. అలాంటి వీడియోలు దేశంలో మత సామరస్యాన్ని కలిగించడంతో పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కనుగొనబడింది.

మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసిన కొన్ని వీడియోలు అగ్నిపథ్ పథకం, భారత సాయుధ దళాలు, భారత జాతీయ భద్రతా ఉపకరణం, కాశ్మీర్ మొదలైన వాటికి సంబంధించిన వాటిపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగించబడుతున్నాయి.  విదేశాలతో భారతదేశ స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే విధంగా ఉన్న తప్పుడు కంటెంట్ మరియు జాతీయ భద్రత కోణం నుండి సున్నితమైనదని గమనించబడింది.

కొన్ని వీడియోలు భారత భూభాగంలోని జమ్ము కశ్మీర్  మరియు లడఖ్ భూభాగాలతో  ఉన్న సరిహద్దులను తప్పుగా చిత్రీకరించాయి. ఇటువంటి కార్టోగ్రాఫిక్ తప్పుగా పేర్కొనడం భారతదేశ సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు హానికరం.

మంత్రిత్వ శాఖ ద్వారా బ్లాక్ చేయబడిన కంటెంట్ భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో భారతదేశ స్నేహపూర్వక సంబంధాలు మరియు దేశంలోని పబ్లిక్ ఆర్డర్‌కు హానికరంగా ఉన్నట్లు కనుగొనబడింది. దీని ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69ఏ పరిధిలో కంటెంట్ కవర్ చేయబడింది.

భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రత, జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు మరియు శాంతిభద్రతలకు భంగం కలిగింతే ప్రయత్నాలను అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

image.png

image.png

 

******



(Release ID: 1862461) Visitor Counter : 268