ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యాత్రికుల వాహనం హిమాచల్ ప్రదేశ్  లోని కుల్లూ లో లోయ లో పడిపోయినకారణం గా ప్రాణనష్టం జరిగినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 26 SEP 2022 10:42AM by PIB Hyderabad

యాత్రికుల వాహనమొకటి హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ జిల్లా లో లోయ లో పడిపోయిన ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తుల కు అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం జరుగుతోందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. క్షతగాత్రులు త్వరితగతి న పునఃస్వస్థులు కావాలని కూడా ఆయన ఆకాంక్షించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘యాత్రికుల వాహనం హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ లో లోయ లో పడిపోయిన ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు నేను నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను; ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తుల కు చేతనైన అన్ని విధాలుగాను సహాయాన్ని అందించడం జరుగుతోంది. వారు త్వరలో పునఃస్వస్థులు కావాలని నేను కోరుకొంటున్నాను: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.

****

DS/ST


(Release ID: 1862228) Visitor Counter : 129