కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ముసాయిదా 'ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్లు-2022' పై అభిప్రాయాలకు ఆహ్వానం
प्रविष्टि तिथि:
22 SEP 2022 11:16AM by PIB Hyderabad
టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఆధునిక మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రజా సంప్రదింపు ప్రక్రియను ప్రారంభించింది. లై 2022లో కేంద్రం 'భారతదేశంలో టెలికమ్యూనికేషన్‌ను నియంత్రించే కొత్త చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ అవసరం'పై ఒక కన్సల్టేషన్ పేపర్ ప్రచురించింది. దీనిపై ఇప్పుడు అభిప్రాయాలు ఆహ్వానించబడ్డాయి. ఈ ముసాయిదా బిల్లుపై వాటాదారులు,పరిశ్రమ సంఘాల నుండి వ్యాఖ్యలు స్వీకరించబడ్డాయి. సంప్రదింపులు మరియు చర్చల ఆధారంగా, మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్లు, 2022 ముసాయిదాను సిద్ధం చేసింది. తదుపరి సంప్రదింపులను సులభతరం చేయడానికి, బిల్లు యొక్క సంక్షిప్త అవలోకనాన్ని అందించడానికి ఒక వివరణాత్మక నోట్ కూడా తయారు చేయబడింది. ముసాయిదా బిల్లు మరియు వివరణాత్మక గమనికను https://dot.gov.in/relatedlinks/indian-telecommunication-bill-2022లో లింక్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. వ్యాఖ్యలను ఈ మెయిల్ ఐడీకి పంపవచ్చు: naveen[dot]kumar71[at]gov[dot]in. వ్యాఖ్యలను పంపడానికి చివరి తేదీ అక్టోబర్ 20, 2022.
***
(रिलीज़ आईडी: 1861620)
आगंतुक पटल : 298