యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

కొత్త విద్యా విధానంలోని విద్యతో పాటు క్రీడలు...నైపుణ్యాభివృద్ధికి మైలురాయిగా నిలుస్తాయి - అనురాగ్ ఠాకూర్


జలంధర్‌లోని దోబా కళాశాలలో 65వ స్నాతకోత్సవం

Posted On: 21 SEP 2022 10:11AM by PIB Hyderabad

దేశంలోని యువ తరాన్ని బ్రెయిన్ డ్రైన్ నుంచి కాపాడేందుకు, వారు మేధాశక్తిని పెంచుకునే దిశగా పయనించేలా చూడాలని కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. 'డిజిటల్ ఇండియా' కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా భారత ప్రభుత్వం యావత్ ప్రపంచానికి చాటిచెప్పిందని, అందుకే ఇప్పుడు దేశంలో ఆన్‌లైన్ లేదా యూపీఐ ద్వారా ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.  

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001F6AF.jpg

 

ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీ. అనురాగ్ సింగ్ ఠాకూర్ జలంధర్‌లోని దోబా కళాశాలలో జరిగిన కాన్వొకేషన్‌లో విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు

 

జలంధర్‌లోని దోబా కాలేజీలోని వారిందర్ ఆడిటోరియంలో జరిగిన కళాశాల 65వ స్నాతకోత్సవంలో శ్రీ ఠాకూర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 34 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి క్రీడలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, ప్రాంతీయ భాషా విద్య రంగాల్లో విప్లవాత్మక అడుగులు వేసిందన్నారు. 'స్కిల్ ఇండియా' కార్యక్రమం కింద దేశంలోని యువతకు అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించామని, సాఫ్ట్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి దేశ విదేశాల్లో మంచి కెరీర్‌ను నిర్మించుకునేందుకు లెక్కలేనన్ని అవకాశాలు కల్పించామన్నారు.

 

నేటి యుగం మహిళా సాధికారత అని, మహిళలు అన్ని రంగాలలో- ముఖ్యంగా విద్య మరియు క్రీడలలో ముందుకు సాగడమే దీనికి అతిపెద్ద నిదర్శనమని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 11వ స్థానంలో ఉండడం సంతోషించదగ్గ విషయమన్నారు. ధనిక, పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు విజయవంతమైన డిజిటల్ లావాదేవీల ద్వారా డిజిటల్ ఇండియాగా మారాలనే దేశ కలను సాకారం చేసినందుకు ప్రజలను అభినందించాల్సిన అవసరం ఉంది.

 

అంతకుముందు, శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా కళాశాల ఆవరణలో మొక్క నాటారు.

 

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002JK0N.jpg

 

కేంద్ర మంత్రితో పాటు విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేస్తున్న శ్రీ చంద్ర మోహన్, ప్రొఫెసర్ ప్రదీప్ భండారి, డాక్టర్ సుష్మా చావ్లా, ధృవ్ మిట్టల్ ,శ్రీ అష్మీ సోంధీ 

 

ఈ సందర్భంగా ముఖ్య అతిథి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ను చంద్రమోహన్‌, అవినాష్‌ కపూర్‌, డాక్టర్‌ సుష్మా చావ్లా, ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రదీప్‌ భండారి దోబా అవార్డు, దుశ్శాలతో సత్కరించారు.

 

శ్రీ చంద్ర మోహన్ మాట్లాడుతూ దోబా కళాశాల కుటుంబం మొత్తం తెలివైన, ప్రతిభావంతులైన పూర్వ విద్యార్థి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్‌ను చూసి గర్విస్తోందని, విద్యార్థులు అతనిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.

 

 

 

*****



(Release ID: 1861413) Visitor Counter : 102