మంత్రిమండలి
‘‘భారతదేశంలో సెమికండక్టర్ ల అభి వృద్ధి మరియు డిస్ ప్లే మేన్యుఫాక్చరింగ్ ఇకోసిస్టమ్ సంబంధి కార్యక్రమం’ లోసవరణల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
21 SEP 2022 3:47PM by PIB Hyderabad
భారతదేశం లో సెమికండక్టర్ ల అభి వృద్ధి మరియు డిస్ ప్లే మేన్యుఫాక్చరింగ్ ఇకోసిస్టమ్ సంబంధి కార్యక్రమం’ లో ఈ కింద పేర్కొన్న సవరణల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది:
i. భారతదేశం లో సెమికండక్టర్ ఫేబ్ యొక్క స్థాపన కు ఉద్దేశించిన పథకం లో భాగం గా అన్ని టెక్నాలజీ నోడ్స్ కు గాను ప్రాజెక్టు వ్యయం లో 50 శాతం సమానత ప్రాతిపదిక న ఆర్థిక సహాయాన్ని అందజేయడం.
ii. డిస్ ప్లే ఫేబ్స్ ను స్థాపించే యోజన లో భాగం గా ప్రాజెక్టు వ్యయం లో 50 శాతం సమానత్వం ప్రాతిపదిక న ఆర్థిక సహాయాన్ని అందజేయడం.
iii. భారతదేశం లో కాంపౌండ్ సెమికండక్టర్ స్ / సిలికాన్ ఫోటోనిక్స్ / సెన్సర్ స్ ఫేబ్ ఎండ్ సెమికండక్టర్ ఎటిఎమ్ పి/ ఒఎస్ఎటి సదుపాయాల ను స్థాపించడానికి గాను పథకం లో భాగం గా మూలధన వ్యయం లో 50 శాతానికి సమానత్వం ప్రాతిపదిక న ఆర్థిక సహాయం. దీనికి అదనం గా, పథకం లో భాగం అయిన లక్షిత టెక్నాలజీల లో డిస్ క్రీట్ సెమికండక్టర్ ఫేబ్స్ కూడా కలసి ఉంటాయి.
సవరించిన కార్యక్రమం లో భాగం గా, అన్ని టెక్నాలజీ నోడ్స్ కు సెమికండక్టర్ ఫేబ్స్ ను ఏర్పాటు చేయడం కోసం ప్రాజెక్టు వ్యయం లో 50 శాతం మేరకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. కాంపౌండ్ సెమికండక్టర్ మరియు అధునాతన పేకేజింగ్ ల తాలూకు విశిష్టమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం మరియు స్వభావాన్ని దృష్టి లో పెట్టుకొని, సవరించిన కార్యక్రమం; కాంపౌండ్ సెమికండక్టర్ స్ / సిలికాన్ ఫోటోనిక్స్ / సెన్సర్ స్ ఫేబ్ ఎండ్ సెమికండక్టర్ ఎటిఎమ్ పి/ ఒఎస్ఎటి సదుపాయాల ను స్థాపించడానికి గాను మూలధన వ్యయం లో 50 శాతం మేరకు సమానత్వం ప్రాతిపదిక న ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం భారతదేశం లో ఫేబ్స్ ను స్థాపించడం కోసం అనేక ప్రపంచ సెమికండక్టర్ రంగ సంస్థల ను ఆకర్షించింది. సవరించిన కార్యక్రమం తో భారతదేశం లో సెమికండక్టర్ మరియు డిస్ ప్లే మేన్యుఫాక్చరింగ్ లో పెట్టుబడులు వేగాన్ని పుంజుకొనేందుకు వీలు ఉంది. పెట్టుబడి కి ఆసక్తి ని కనబరచే సంస్థల తో జరిగిన చర్చ ఆధారం గా, తొలి సెమికండక్టర్ సదుపాయాన్ని స్థాపించే పనులు త్వరలోనే ఆరంభం కావచ్చన్న అంచనా ఉంది.
భారతదేశం లో సెమికండక్టర్స్ ను మరియు డిస్ ప్లే మేన్యుఫాక్చరింగ్ ఇకోసిస్టమ్ ను అభివృద్ధిపరచడానికి సంబంధించిన కార్యక్రమాని కి నోడల్ ఏజన్సి గా ఉన్నటువంటి ‘ఇండియా సెమికండక్టర్ మిశన్’ కు సలహా ఇవ్వడానికి గాను పరిశ్రమ జగతి కి మరియు విద్య జగతి కి చెందిన ప్రపంచ నిపుణుల తో కూడిన ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సలహా సంఘం సిలికాన్ సెమికండక్టర్ ఫేబ్స్ / సిలికాన్ ఫోటోనిక్స్ / సెన్సర్ స్ / డిస్ క్రీట్ సెమికండక్టర్ ఫేబ్స్ మరియు ఎటిఎమ్ పి/ ఒఎస్ఎటి లకు సంబంధించిన అన్ని టెక్నాలజీ నోడ్స్ కు గాను ఒకే విధమైన సమర్థన ను అందించాలి అంటూ సర్వ సమ్మతి తో సిఫారసు చేసింది. దీనిని ప్రభుత్వం స్వీకరించింది. ఇతరత్రా రంగాల తో పాటు వాహన, విద్యుత్తు మరియు టెలికమ్ అన్వయాల కారణం గా 45 ఎఎన్ఎమ్ మరియు అంత కంటే పైచిలుకు టెక్నాలజీ నోడ్స్ కు గిరాకీ ఎక్కువ గా ఉంది. దీనికి తోడు, ఈ (వి)భాగం మొత్తం సెమికండక్టర్ బజారు లో ఇంచుమించు 50 శాతం గా ఉంది.
***
(Release ID: 1861208)
Visitor Counter : 323
Read this release in:
Odia
,
Marathi
,
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada