ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ లాజిస్టిక్స్ విధానం విడుదల చేసిన ప్రధానమంత్రి
“భారతదేశం తయారీ హబ్ గా మారుతోందన్న అభిప్రాయం ప్రపంచం దృష్టిలో స్థిరపడుతోంది”
“ఈ పాలసీ ఆరంభం మాత్రమే, పురోగతికి విధానంతో పాటు పనితీరు కూడా ప్రధానం”
“జాతీయ లాజిస్టిక్స్ విధానం ఆకస్మికంగా వచ్చింది కాదు, దాని వెనుక 8 సంవత్సరాల శ్రమ ఉంది”
“ప్రస్తుతం 13-14 శాతం ఉన్న లాజిస్టిక్స్ వ్యయాలు వీలైనంత త్వరలో ఒక అంకె స్థాయికి దింపాల్సి ఉంది”
“యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్‌ఫారం - యులిప్; రవాణా రంగానికి చెందిన అన్ని డిజిటల్ సర్వీసులు ఒకే వేదిక పైకి”
“గతిశక్తి, జాతీయ లాజిస్టిక్స్ విధానం కలిసికట్టుగా దేశాన్ని కొత్త పని సంస్కృతి దిశగా నడిపిస్తాయి”
“అభివృద్ధి చెందిన దేశంగా మారాలని నిశ్చయంగా ఉన్న భారత్ అభివృద్ధి చెందిన దేశాలతో మరింతగా పోటీ పడాల్సి ఉంది, అప్పుడే అన్నీ పోటీ సామర్థ్యం గలవిగా మారతాయి”
“మౌలిక వసతుల అభివృద్ధి, వ్యాపారాల విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపునకు జాతీయ లాజిస్టిక్స్ విధానంలో అద్భుతమైన అవకాశాలున్నాయి”
Posted On:
17 SEP 2022 7:41PM by PIB Hyderabad
విజ్ఞాన్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ లాజిస్టిక్స్ విధానం (ఎన్ఎల్ పి) విడుదల చేశారు.
అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న భారతదేశం ఆకాంక్షను సాకారం చేసే దిశగా పడిన పెద్ద అడుగే ఈ జాతీయ లాజిస్టిక్స్ విధానమని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి అన్నారు. “చివరి ప్రదేశానికి కూడా వేగవంతంగా వస్తుసేవలను అందించేందుకు, రవాణాపరమైన సవాళ్లకు ముగింపు పలికేందుకు, తయారీదారులకు కాలం, సమయం కూడా ఆదా చేసేందుకు, వ్యవసాయ ఉత్పత్తుల వృధాను నివారించేందుకు గట్టి ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలకు చక్కని ఉదాహరణే నేటి జాతీయ లాజిస్టిక్స్ విధానం” అని ప్రధానమంత్రి చెప్పారు. దీని ఫలితంగా సమన్వయంలో ఏర్పడే మెరుగుదల ఆ రంగంలో వేగం పెరగడానికి దోహదపడుతుంది.
ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారతదేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. నేటి ఉదయం విడుదల చేసిన చిరుత పులుల గురించి ప్రస్తావిస్తూ మనందరం చిరుత వలెనే లగేజి వేగంగా కదలాలని కోరుకుంటాం అని ఆయన వ్యాఖ్యానించారు.
“మేక్ ఇన్ ఇండియా, దేశం స్వయం-సమృద్ధం కావాలన్న ఆకాంక్ష ప్రతీ ఒక్క చోట కనబడుతున్నాయి. భారతదేశం భారీ ఎగుమతి లక్ష్యాలు ఏర్పరచుకోవడమే కాదు, వాటిని సాధించేందుకు కూడా కృషి చేస్తోంది. భారతదేశం తయారీ హబ్ గా మారుతోందన్న అభిప్రాయం ప్రపంచంలో స్థిరపడుతోంది. మనం పిఎల్ఐ పథకం గురించి అధ్యయనం చేసినట్టయితే ప్రపంచం దాన్ని ఆమోదించిందని మనం గుర్తిస్తాం” అని ప్రధానమంత్రి అన్నారు.
ఈ పరిస్థితిలో జాతీయ లాజిస్టిక్స్ విధానం అన్ని రంగాలకు నూతన శక్తిని అందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ విధానం ఒక ఆరంభం మాత్రమే, పురోగతి కోసం ఈ పాలసీకి పనితీరు సైతం జోడు కావాలి అని ఆయన వివరించారు. “నేడు భారతదేశం ఏ విధానం తీసుకురావాలన్నా ముందస్తుగా దానికి అవసరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తుంది, అప్పుడే విధానం విజయవంతంగా అమలు పరుస్తుంది. జాతీయ లాజిస్టిక్స్ విధానం ఏదో హడావిడిగా వచ్చింది కాదు, 8 సంవత్సరాల శ్రమ దాని వెనుక ఉంది. ఎన్నో పాలసీ మార్పులు చోటు చేసుకుంటాయి, ఎన్నోనిర్ణయాలు వస్తాయి. నా 22 సంవత్సరాల పరిపాలనానుభవం దాని వెనుక ఉంది” అని ఆయన చెప్పారు.
సాగర్ మాల, భారత్ మాల వంటి పథకాలు, ప్రత్యేక సరకు రవాణా కారిడార్ల నిర్మాణం వేగవంతం చేయడం వంటివి లాజిస్టిక్స్ కనెక్టివిటీకి అవసరం అయిన వ్యవస్థీకృత మౌలిక వసతులు అభివృద్ధి చేస్తాయి. భారతీయ పోర్టుల్లో మొత్తం సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని, కంటైనర్ నౌకల ప్రయాణ కాలపరిమితి 44 గంటల నుంచి 26 గంటలకు తగ్గిందని శ్రీ మోదీ సూచించారు. ఎగుమతుల వృద్ధికోసం 40 వైమానిక కార్గో టెర్మినల్స్ ఏర్పాటయ్యాయి, 30 విమానాశ్రయాల్లో శీతలీకరణ వసతులు కల్పించడం జరిగింది., 35 మల్టీ మోడల్ హబ్ లు దేశంలో అందుబాటులోకి వస్తున్నాయి అని ప్రధానమంత్రి చెప్పారు. “జల మార్గాల ద్వారా పర్యావరణ మిత్రమైన, పొదుపుతో కూడిన రవాణా వసతులు మనం కల్పించగలుగుతాం. ఇందుకోసం దేశంలో కొత్త జలమార్గాల ఏర్పాటు కూడా జరుగుతోంది” అని ప్రధానమంత్రి తెలిపారు. కరోనా కష్టకాలంలో జరిగిన కిసాన్ రైల్, కిసాన్ ఉడాన్ ప్రయోగాల గురించి ఆయన ప్రస్తావించారు. నేడు దేశంలోని 60 విమానాశ్రయాలలో కృషి ఉడాన్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు.
లాజిస్టిక్స్ రంగం పటిష్ఠతకు టెక్నాలజీని అమలుపరచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఇందులో భాగంగా ఇ-సంచిత్ ద్వారా పేపర్ లెస్ గా ఎగ్జిమ్ వ్యాపార ప్రాసెసెంగ్, కస్టమ్స్ కోసం ఫేస్ లెస్ అసెస్ మెంట్, ఇ-వే బిల్లులు, ఫాస్టాగ్ వంటి వసతుల ఏర్పాటు కోసం ప్రభుత్వం చొరవ తీసుకున్నదని ఆయన చెప్పారు. ఇవన్నీ లాజిస్టిక్స్ విభాగం సమర్థతను గణనీయంగా పెంచాయని తెలిపారు. అంతే కాదు, లాజిస్టిక్స్ రంగం సమస్యలు తేలిగ్గా పరిష్కరించడానికి జిఎస్ టి వంటి ఏకీకృత పన్ను వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. డ్రోన్ పాలసీ, డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పిఎల్ఐ పథకంతో అనుసంధానం చేయడం వంటి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. “ఇలాంటివి ఎన్నో చేసిన అనంతరం జాతీయ లాజిస్టిక్స్ విధానం ఆవిష్కరిం చాం” అని ఆయన వివరించారు. “లాజిస్టిక్స్ వ్యయాలను 13-14 శాతం నుంచి ఒకే అంకె స్థాయికి వీలైనంత త్వరలో తీసుకురావడం మన ధ్యేయం కావాలి. మనం ప్రపంచ స్థాయిలో పోటీ సామర్థ్యం సాధించాలంటే ఇది అందుబాటులో ఉన్న ఫలమే” అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.
యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫారం లేదా యులిప్ రవాణా రంగానికి చెందిన డిజిటల్ సేవలన్నింటినీ ఒకే చోటికి తెస్తుంది, ఎగుమతిదారులకు సుదీర్ఘ, సంక్లిష్ట ప్రాసెస్ నుంచి విముక్తం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. అలాగే ఈ విధానం ద్వారా సేవల్లో సరళత కోసం కొత్త డిజిటల్ వేదిక ఇ-లాగ్స్ కూడా ప్రారంభమయిందని చెప్పారు. “పారిశ్రామిక సంఘాలు తమ కార్యకలాపాలకు, ప్రభుత్వ ఏజెన్సీలతో పనితీరులో ఎదురవుతున్న సమస్యల గురించి ఈ పోర్టల్ ద్వారా నేరుగా తెలియచేయగలుగుతాయి. ఇలాంటి కేసులన్నింటి సత్వర పరిష్కారానికి సంపూర్ణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది” అని ఆయన చెప్పారు.
పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అన్ని రకాలుగాను జాతీయ లాజిస్టిక్స్ విధానానికి మద్దతు ఇస్తుంది అని శ్రీ మోదీ చెప్పారు. ఈ కృషిలో రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మద్దతు పట్ల కూడా ప్రధానమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకోసం అన్ని శాఖలు కలిసికట్టుగా కృషి చేయడం ప్రారంభించాయన్నారు. “రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులపై భారీ డేటా సిద్ధం చేశారు. నేడు పిఎం గతిశక్తి పోర్టల్ పై 1500 అంచెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డేటా అందుబాటులోకి వస్తోంది” అని ప్రధానమంత్రి చెప్పారు. “గతిశక్తి, జాతీయ లాజిస్టిక్స్ విధానం రెండూ కలిసి నేడు దేశంలో కొత్త పని సంస్కృతిని సృష్టిస్తున్నాయి. ఇటీవల ఆమోదించిన గతిశక్తి విశ్వవిద్యాలయం నుంచి వెలుపలికి వచ్చే ప్రతిభ కూడా ఇందుకు సహాయకారిగా ఉంటుంది” అని ఆయన అన్నారు.
నేడు ప్రపంచం యావత్తు భారతదేశాన్ని ఒక “ప్రజాస్వామిక సూపర్ పవర్”గా చూస్తోంది అని ప్రధానమంత్రి చెప్పారు. భారతదేశంలోని అసాధారణ ప్రతిభతో కూడిన వాతావరణం క్షేత్రస్థాయి నిపుణుల కట్టుబాటును, పురోగతిని ప్రశంసిస్తోందని నొక్కి చెప్పారు. “నేడు భారతదేశం పట్ల ప్రపంచ వైఖరి మారుతోంది. నేడు ప్రపంచం భారతదేశాన్ని సానుకూలంగా మదింపు చేస్తోంది, భారతదేశంపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది” అని ప్రధానమంత్రి తెలిపారు.
ప్రపంచ సంక్షోభం మనందరినీ చుట్టుముట్టిన సమయంలో భారతదేశం, భారత ఆర్థిక వ్యవస్థ చూపిన సంయమనం ప్రపంచం మొత్తంలో కొత్త విశ్వాసం నింపిందని ప్రధానమంత్రి అన్నారు. “గత కొద్ది సంవత్సరాల్లో చేపట్టిన సంస్కరణలు, అమలుపరిచిన విధానాలు గతంలో ముందెన్నడూ కనివిని ఎరుగనివి. దాంతోనే మనపై ప్రపంచ విశ్వాసం పెరిగింది” అని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచం విశ్వాసం పొందేందుకు జాతి యావత్తు పూర్తిగా సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “ఇది మనందరి బాధ్యత, మనందరిపై ఆ బాధ్యత ఉంది. నేడు ప్రారంభించిన జాతీయ లాజిస్టిక్స్ విధానం ఈ కృషిలో దేశానికి ఎంతో సహాయకారిగా ఉంది” అన్నారు.
భారతీయుల పోటీ సామర్థ్యం గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ “అభివృద్ధి చెందిన దేశంగా మారాలనుకుంటున్న భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో మరింతగా పోటీ పడాలి. అందుకోసం ప్రతీ ఒక్కరూ పోటీ సామర్థ్యంతో నిలవాలి” అని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. “సేవల రంగం, తయారీ రంగం, ఆటోమొబైల్స్, ఎలక్ర్టానిక్స్ వంటి ఏ రంగాల్లో అయినా మనకి భారీ లక్ష్యాలున్నాయి. వాటిని మనం సాధించాలి” అని ప్రధానమంత్రి సూచించారు. భారత దేశంలో తయారైన వస్తువుల పట్ల ప్రపంచంలో ఆకర్షణ పెరుగుతోందని ప్రధానమంత్రి తెలిపారు. “దేశంలో తయారైన వ్యవసాయ ఉత్పత్తులు, మొబైల్ ఫోన్లు, బ్రహ్మోస్ క్షిపణులు అన్నింటి పైన ప్రపంచంలో చర్చ జరుగుతోంది” అని ఆయన అన్నారు. భారతదేశంలో ఉత్పత్తి అయిన కోవిడ్ వ్యాక్సిన్లు, ఔషధాలు ప్రపంచంలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన విషయం ప్రధానమంత్రి గుర్తు చేశారు.
భారతదేశంలో తయారైన వస్తువులు నేడు ప్రపంచ మార్కెట్లలో ఆధిపత్యం చూపిస్తున్నాయంటూ అందుకు బలమైన మద్దతు వ్యవస్థ కీలకం ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “ఈ మద్దతు వ్యవస్థను ఆధునీకరించే విషయంలో జాతీయ లాజిస్టిక్స్ విధానం మనకి ఎంతో సహాయకారిగా ఉంటుంది” అని ప్రధానమంత్రి అన్నారు. “లాజిస్టిక్స్ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరించినట్టయితే దేశ ఎగుమతులు పెరుగుతాయి. చిన్న పరిశ్రమలకు, వాటిలో పని చేసే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది” అని శ్రీ మోదీ అన్నారు. “లాజిస్టిక్స్ రంగాన్ని పటిష్ఠం చేయడం వల్ల సామాన్య మానవుని జీవనం సరళం కావడమే కాదు; కార్మికులు, పనివారిపై గౌరవం పెరుగుతుంది” అని ప్రధానమంత్రి అన్నారు.
ప్రసంగం ముగిస్తూ “దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి, వ్యాపారాల విస్తరణకు, ఉపాధి అవకాశాలు పెరగడానికి సహాయపడగల అద్భుత సామర్థ్యం జాతీయ లాజిస్టిక్స్ విధానానికి ఉంది. ఈ సానుకూలతలన్నింటినీ మనం సొమ్ము చేసుకోవాలి” అని ప్రధానమంత్రి సూచించారు.
టివిఎస్ సరఫరా వ్యవస్థ సొల్యూషన్ల కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆర్.దినేష్; అగర్వాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ సిఇఓ శ్రీ రమేష్ అగర్వాల్; ఎక్స్ ప్రెస్ బీస్ లాజిస్టిక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు, సిఇఓ శ్రీ అమితాబ్ సాహా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్; కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి; కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా; కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్; కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ మంత్రి శ్రీ శర్బానంద సోనోవాల్; కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్; కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీ సోమ్ ప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పూర్వాపరాలు...
ఇతర అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే భారతదేశంలో లాజిస్టిక్స్ వ్యయాలు భారీగా ఉండడంతో జాతీయ లాజిస్టిక్స్ విధానం అవసరం ఏర్పడింది. దేశీయ, ఎగుమతి మార్కెట్లలో భారతీయ వస్తువుల పోటీ సామర్థ్యం పెరగాలంటే దేశంలో లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గించడం తప్పనిసరి. లాజిస్టిక్స్ వ్యయాల తగ్గుదల ఆర్థిక వ్యవస్థలో విభిన్న రంగాల పోటీ సామర్థ్యాన్ని పెంచుతుంది, విలువ జోడింపు, సంస్థల విలువ పెరుగుతుంది.
2014 నుంచి ప్రభుత్వం వ్యాపార నిర్వహణ సరళీకరణ, జీవన సరళీకరణ పెంపుపై ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. అధిక వ్యయాలు, అసమర్థతలు తొలగించి అంతర్ శాఖల, రంగాల, బహుళ వ్యవస్థల అధికార పరిధి అన్నింటి మెరుగుదలకు చేసిన కృషి జాతీయ లాజిస్టిక్స్ విధానం. లాజిస్టిక్స్ వ్యవస్థ సంపూర్ణ అభివృద్ధి ఈ దిశగా మరో అడుగు. భారతీయ వస్తువుల పోటీ సామర్థ్యం పెంపు, ఆర్థిక వృద్ధి ఉద్దీపన, ఉపాధి అవకాశాల పెంపునకు జరిగిన ప్రయత్నమే ఈ విధానం.
అందరు భాగస్వాములకు ఉపయోగపడే సమగ్ర ప్లానింగ్, విధానాలను సమన్వయపరిచేందుకు, ప్రాజెక్టుల అమలులో అన్ని రకాల బలాబలాలు వినియోగంలోకి తేవడం కోసం ప్రపంచ శ్రేణి ఆధునిక మౌలిక వసతులు అభివృద్ధి చేయాలన్నది ప్రధానమంత్రి ప్రధాన విజన్. బహుముఖీన కనెక్టివిటీ కోసం గత ఏడాది ప్రధానమంత్రి ప్రారంభించిన పిఎం గతిశక్తి ఈ దిశగా ఒక మంచి అడుగు. జాతీయ లాజిస్టిక్స్ విధానం పిఎం గతిశక్తిని మరింత ఉత్తేజితం చేసి ఆ విధానానికి మరింత ఉత్తేజితంగా ఉంటుంది.
(Release ID: 1860549)
Visitor Counter : 351
Read this release in:
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam