కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బాలిలో జరిగిన జీ20 కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశానికి హాజరైన కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్


బలమైన మరియు స్థిరమైన రికవరీకి కార్మికులకు ఉపాధి పరిస్థితులను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి: శ్రీ భూపేందర్ యాదవ్

Posted On: 14 SEP 2022 3:16PM by PIB Hyderabad

ఈ ఏడాది సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశానికి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శ్రీ. భూపేందర్ యాదవ్ హాజరయ్యారు.

మంత్రుల సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. మహమ్మారి అనంతర కాలంలో ఉపాధి కల్పన, సామాజిక రక్షణ, నైపుణ్యం మరియు అధికారికీకరణకు సంబంధించి దృఢమైన విధానాలను ప్రోత్సహించడానికి దేశాలు కలిసి రావాల్సిన ప్రాముఖ్యత గురించి వివరించారు.

ఎప్పటికప్పుడు మారుతున్న ప్రస్తుత కాలంలో  కీలకమైన ప్రాధాన్యతా రంగాలను ఎంపిక చేసినందుకు ఇండోనేషియాను కేంద్ర మంత్రి ప్రశంసించారు. వాటిలో వికలాంగుల లేబర్ మార్కెట్ ఇంటిగ్రేషన్, కమ్యూనిటీ ఆధారిత వృత్తి శిక్షణను బలోపేతం చేయడం, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం మరియు చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) మద్దతు ఇవ్వడం ద్వారా వికలాంగుల స్థిరమైన వృద్ధి మరియు ఉత్పాదకత వంటివి ఉన్నాయి. ఈ రంగాలన్నింటిలో భారతదేశం సాధించిన ఆదర్శప్రాయమైన విజయాల పట్ల కూడా కేంద్ర మంత్రి వివరించారు.అడ్డా కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి సామాజిక భద్రతా చట్టంలో చేసిన నిబంధనలను ఆయన హైలైట్ చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సంవత్సరం జీ20 ఎంప్లాయ్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశాల నుండి పొందిన అనుభవాలు భారతదేశానికి రాబోయే అధ్యక్ష పదవిలో సహాయపడతాయని అలాగే 21వ శతాబ్దపు పని ప్రపంచానికి చెందిన డైనమిక్ స్వభావం దృష్ట్యా కార్మిక సంక్షేమాన్ని పొందేందుకు తమకు దోహదపడుతుందని ఆయన అన్నారు.

జర్మనీ, సింగపూర్, యూఏఈ, సౌదీ అరేబియా, నెదర్లాండ్స్, తుర్కియా వంటి దేశాలతో కేంద్ర మంత్రి పలు ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ సమావేశాలన్నింటిలోనూ భారత్‌కు చేపట్టనున్న అధ్యక్ష పదవి మరియు విస్తృత ప్రాధాన్యతల గురించి మంత్రి వివరించారు. మన లక్ష్యాల సాధనకు ఆ దేశాలు మరియు సంస్థల మద్దతును కోరారు. వలసలు మరియు చలనశీలత ఒప్పందం, సామాజిక భద్రతా ఒప్పందంపై సంతకం చేయవలసిన అవసరం, అంతర్జాతీయ కార్మికులకు సామాజిక భద్రతను నిర్ధారించడానికి హైలైట్ చేయబడ్డాయి.

ఇండోనేషియా కార్మికశాఖ మంత్రి హెచ్‌ఈ ఇడా ఫౌజియా ఏర్పాటు చేసిన స్వాగత విందుకు కూడా కేంద్ర మంత్రి హాజరయ్యారు.  జీ20కి చెందిన రెండు ప్రముఖ ఎంగేజ్‌మెంట్ గ్రూపులు బి20 - ఎల్20 సంయుక్త ప్రకటనను కూడా వీక్షించారు.

***


(Release ID: 1859266) Visitor Counter : 175