ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తెలంగాణ లోని సికందరాబాద్ లో మంటలు చెలరేగిన కారణం గా ప్రాణనష్టం జరగడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్నిఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు

Posted On: 13 SEP 2022 9:30AM by PIB Hyderabad

తెలంగాణ లోని సికందరాబాద్ లో మంటలు చెలరేగిన కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున మరియు ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పరిహారం గా ఇస్తున్నట్లు కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో -

 

తెలంగాణ లోని సికందరాబాద్ లో మంటలు చెలరేగిన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు దు:ఖిస్తున్నాను. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలో పునఃస్వస్థులు అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి చెల్లించడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున చెల్లించడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొంది.

 


(Release ID: 1858938) Visitor Counter : 146