ప్రధాన మంత్రి కార్యాలయం

యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని గౌరవనీయురాలు ఎలిజాబెథ్ ట్రస్ గారి కి మరియుప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ

Posted On: 10 SEP 2022 6:58PM by PIB Hyderabad

యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని గౌరవనీయురాలు ఎలిజాబెథ్ ట్రస్ గారి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ మాధ్యమం ద్వారా మాట్లాడారు.

యుకె యొక్క ప్రధాని పదవీబాధ్యతల ను ఎలిజాబెథ్ ట్రస్ గారు స్వీకరించిన సందర్భం లో ఆమె కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. ఆమె ఇది వరకు వ్యాపార మంత్రి గా మరియు విదేశీ వ్యవహారాల మంత్రి గా విధుల ను నిర్వహించిన కాలం లో భారతదేశం-యుకె ద్వైపాక్షిక సంబంధాల కు అందించిన తోడ్పాటుల ను కూడా ఆయన ప్రశంసించారు. భారతదేశాని కి మరియు యుకె కు మధ్య గల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం కోసం నేత లు ఇరువురు వారి యొక్క వచనబద్ధత ను వ్యక్తం చేశారు.

రోడ్ మ్యాప్ 2030 యొక్క అమలు లో ఇంతవరకు నమోదు అయినటువంటి పురోగతి, ప్రస్తుతం కొనసాగుతున్న ఎఫ్ టిఎ సంబంధి సంప్రదింపు లు, రక్షణ మరియు భద్రత పరమైన సహకారం, ఇంకా ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా ఇరు పక్షాల హితం ముడిపడ్డ వివిధ అంశాల పై ఇద్దరు నేత లు చర్చించారు.

మహారాణి రెండో ఎలిజాబెథ్ యొక్క దుఃఖదాయక మరణం పట్ల యుకె రాజ కుటుంబాని కి మరియు అక్కడి ప్రజానికాని కి భారతదేశం ప్రజల పక్షాన ప్రగాఢ సంతాపాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

***



(Release ID: 1858674) Visitor Counter : 103