మంత్రిమండలి

విద్య సంబంధి అర్హతల పరస్పర గుర్తింపు ను ఇవ్వడం కోసం భారతదేశాని కి, యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ఎండ్  నార్థర్న్ ఐర్లండ్ ల మధ్య సంతకాలైన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కిఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 07 SEP 2022 4:08PM by PIB Hyderabad

భారత గణతంత్ర ప్రభుత్వాని కి మరియు యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఎండ్ నార్థర్న్ ఐర్లండ్ ల మధ్య 2022వ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ న సంతకాలు జరిగిన విద్యార్హతల పరస్పర గుర్తింపు సంబంధి అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) కు మాన్య ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న 2022 సెప్టెంబర్ 7వ తేదీ న ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ సమావేశం లో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని మంజూరు చేయడమైంది.

భారతదేశాని కి మరియు యుకె కు మధ్య అర్హత ల పరస్పర గుర్తింపు అనేది విద్య పరమైన సహకారాన్ని మరియు విద్యార్థుల రాకపోకల ను ప్రోత్సహించడాని కి ఉద్దేశించినటువంటిది. యుకె వద్ద నుంచి వారి ఒక సంవత్సరం మాస్టర్స్ ప్రోగ్రాము కు మాన్యత ను ఇవ్వాలన్న అభ్యర్థన ను పరిశీలన లోకి తీసుకోవడమైంది. 2020వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లో ఇరు దేశాల విద్య శాఖ మంత్రుల మధ్య జరిగిన సమావేశం లో దీనికి సంబంధించి ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైంది. ఒకటో సమావేశం 2021వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ న జరిగింది. దాని తరువాత మరిన్ని చర్చోపచర్చలు, సంప్రదింపులు సాగిన అనంతరం ఉభయ పక్షాలు ముసాయిదా ఎమ్ఒయు విషయం లో ఒక అంగీకారానికి వచ్చాయి.

ఈ ఎమ్ఒయు విద్యార్హత లు, అధ్యయనం తాలూకు గడువు, విద్యపరమైన డిగ్రీలు/అర్హతల కు సంబంధించిన దస్తావేజు పత్రాలు మరియు రెండు దేశాల విద్య బోధన సంస్థ ల ద్వారా జారీ చేసిన గుర్తింపు పత్రాల యొక్క పరస్పర మాన్యత కు మార్గాన్ని సుగమం చేయాలి అనే ధ్యేయం తో రూపొందింది. ఇంజీనియరింగ్, వైద్యం, నర్సింగ్ మరియు పారా-మెడికల్ ఎడ్యుకేశన్, ఫార్మసీ, న్యాయ శాస్త్రం మరియు భవన నిర్మాణ శాస్త్రం ల వంటి వృత్తి ప్రధానమైన డిగ్రీల ను ఈ ఎమ్ఒయు పరిశీలన పరిధి లోకి తీసుకోలేదు. అంతేకాకుండా, జాతీయ విద్య విధానం (ఎన్ఇపి) 2020 లో నిర్దేశించుకొన్నటువంటి మన లక్ష్యాల లో ఒక లక్ష్యమైన విద్య అంతర్జాతీయీకరణ లక్ష్యానికి అనుగుణం గా ఉన్నత విద్య సంస్థ ల మధ్య సంయుక్త డిగ్రీ మరియు ద్వంద్వ డిగ్రీ పాఠ్యక్రమాల స్థాపన కు కూడా మార్గాన్ని ఈ ఎమ్ఒయు సుగమం చేయనుంది.

ఈ ఎమ్ఒయు ఉభయ దేశాల మధ్య విద్య సంబంధి స్వరూపం, కార్యక్రమాలు మరియు ప్రమాణాల గురించి సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే, రెండు దేశాల మధ్య విద్యార్థులు మరియు వృత్తి నిపుణుల రాక పోకల ను పెంపొందింప చేయడం లో సహాయకారి గా ఉంటుంది. దీని ద్వారా ఉభయ పక్షాల అంగీకారం మేరకు విద్య రంగం లో సహకారాని కి అవకాశం ఉన్న ఇతర రంగాల తో పాటు అధ్యయన కార్యక్రమాల వికాసాని కి కూడా ఉభయ పక్షాల సమ్మతి మేరకు ప్రోత్సాహం అందనుంది.

ఈ ఎమ్ఒయు రెండు దేశాల కు చెందిన జాతీయ విధానం, చట్టం, నియమ నిబంధనల కు లోబడి అర్హత ల ఆమోదాని కి సంబంధించి సమాన ప్రాతిపదిక ప్రకారం గుర్తింపు ను ఇస్తుంది.

 

***



(Release ID: 1857560) Visitor Counter : 164