ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

6 రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, త్రిపుర ఉత్తరప్రదేశ్)- NCDC- జాతీయ వ్యాధి నియంత్రణ శాఖా కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన డాక్టర్ మన్సుఖ్ మాండవియ.


ఎన్‌సిడిసి ప్రయోగశాల నివాస సముదాయాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి

"రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని ఎన్‌సిడిసి శాఖలు ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను, సత్వర నిఘా, త్వరితగతిన వ్యాధిని గుర్తించడం వంటి ముందస్తు ప్రయత్నాలను ప్రారంభించే సమయానుకూల పర్యవేక్షణతో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి": ఆరోగ్య మంత్రి

"అందరికీ ఆరోగ్యాన్ని" అందించడంలో ప్రభుత్వం "సమగ్ర విధానాన్ని" తీసుకుంటోంది: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

Posted On: 06 SEP 2022 1:51PM by PIB Hyderabad

"వ్యాధుల నివారణ, నియంత్రణ, నిర్వహణలో వ్యాధులపై నిఘా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దిశగా NCDC-ప్రాంతీయ శాఖలు కీలకమైన భూమిక నిర్వహిస్తాయి. అవి సత్వర నిఘా, త్వరితగతిన గుర్తించడం వంటి వ్యాధుల పర్యవేక్షణతో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి, తద్వారా ముందస్తు ప్రయత్నాలను ప్రారంభిస్తాయి. ఆరు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, త్రిపుర ఉత్తర ప్రదేశ్) నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) శాఖలకు శంకుస్థాపన చేస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ విషయాన్ని తెలిపారు..

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది. నాణ్యమైన, సరసమైన అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను నిర్ధారించడానికి సహకార సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్న అరకొరపనుల నుంచి సమూల విధానానికి మార్పు జరిగింది. దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రధానమంత్రి దార్శనికత అని డాక్టర్ మాండవ్య తెలిపారు. PM-ABHIM (ప్రధాన మంత్రి- ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్) కింద భారత ప్రభుత్వం రాష్ట్రాల్లో వివిధ ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం రూ.64,000 కోట్లు కేటాయించింది. కోవిడ్19-ప్రస్తుత సమయంలో ఈ మహమ్మారి తిరిగి ఉద్భవిస్తున్న అంటువ్యాధుల ప్రాబల్యతను చూపిందని, స్థానికంగా వ్యాప్తి చెందడాన్ని అరికట్టకపోతే మాత్రమే కాకుండా మహమ్మారిగా కూడా దారితీస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని NCDC శాఖలు సకాలంలో వ్యాధి పర్యవేక్షణ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇస్తాయి. క్షేత్రం నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా సకాలంలో నివారణకి దారితీసే ముందస్తు హెచ్చరికను ఇవి ప్రారంభిస్తాయి, అని మంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర శాఖలు న్యూ ఢిల్లీలోని NCDC ప్రధాన కార్యాలయంతో సమన్వయం చేసుకుంటాయి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో డేటా సమాచారాన్ని నిజ సమయంలో సహా శాఖలకు భాగస్వామ్యం చేస్తుంది. NCDC శాఖలు కూడా ఖచ్చితమైన శాస్త్రీయంగా మద్దతు ఉన్న సమాచారాన్ని సులభంగా వ్యాప్తి చేయడానికి నవీకరించిన మార్గదర్శకాలతో, సకాలంలో లభ్యతను నిర్ధారించడంలో కీలకంగా ఉంటాయి.

ప్రస్తుతం, NCDC ఒకటి లేదా కొన్ని వ్యాధులపై దృష్టి సారించే రాష్ట్రాలలో ఎనిమిది శాఖలను కలిగి ఉంది, వీటిని ఆదినికరించి పునర్నిర్మిస్తారు యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR), బహుళ-విభాగ కీటక శాస్త్రానికి సంబంధించిన సమగ్ర వ్యాధి నిఘా కార్యకలాపాల కోసం ఆదేశంతో కొత్త శాఖలు జోడిస్తున్నారు.ఈ దిశగా పరిశోధనలు మొదలయ్యాయి.

నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్-NCDC లాబొరేటరీ బ్లాక్ -1, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ NRLని కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రారంభించారు. NCDC లేబొరేటరీ బ్లాక్లో ప్రజారోగ్యానికి సంబంధించిన బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ పరాన్నజీవి వ్యాధులకు సంబంధించిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెస్టింగ్ రిఫరల్ ప్రయోగ శాలలు ఉంటాయి. ఈ ప్రయోగశాలలో 30 బయో-సేఫ్టీ లెవల్3 ల్యాబ్లు, 5 RT-PCR ల్యాబ్లు 15 ఇతర ల్యాబ్లను కలిగి ఉన్న 50 హై-కెపాసిటీ లాబ్లు ఉన్నాయి. ప్రయోగశాలలు కేవలం పరీక్షా సౌకర్యాలను అందించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం నెట్వర్క్ లేబొరేటరీలకు శిక్షణ, సామర్థ్య పెంపుదల నాణ్యత హామీ సేవలు అందించేలా రూపొందించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు. శ్రీ వి. మురళీధరన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి, డాక్టర్ తానాజీ రావ్ సావంత్, ఆరోగ్య శాఖ మంత్రి (మహారాష్ట్ర), శ్రీ అలోలిబాంగ్, ఆరోగ్య మంత్రి (అరుణాచల్ ప్రదేశ్), శ్రీ శశి థరూర్, పార్లమెంటు సభ్యులు శ్రీ మయాంకేశ్వర్ శరణ్ సింగ్, (ఉత్తరప్రదేశ్), శ్రీ రాజేశ్వర్ సింగ్, ఎమ్మెల్యే, శ్రీ తానా హలీ తార, ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీ రాజేష్ భూషణ్, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, డాక్టర్. అతుల్ గోయెల్, DGHS (MoHFW) శ్రీ లవ్ అగర్వాల్, MoHFW అదనపు కార్యదర్శి కూడా పాల్గొన్నారు.

 

****(Release ID: 1857173) Visitor Counter : 183