పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పునరుద్దరించిన జాతీయ పంచాయతీ అవార్డులలో పాల్గొనవలసిందిగా కోరుతూ సర్పంచులు/గ్రామ ప్రధానులకు లేఖ రాసిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్


జాతీయ పంచాయతీ అవార్డుల కోసం ఎంట్రీలు 10 సెప్టెంబర్, 2022 నుండి ప్రారంభమవుతాయి; అలాగే ఆన్‌లైన్‌లో ఎంట్రీల సమర్పణకు చివరి తేదీ 31 అక్టోబర్, 2022

Posted On: 02 SEP 2022 3:28PM by PIB Hyderabad

కేంద్ర గ్రామీణాభివృద్ధి & పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ సర్పంచులు/గ్రామ ప్రధానులకు ఒక లేఖ రాశారు. పునరుద్ధరించిన జాతీయ పంచాయతీ అవార్డుల ఎంపిక ప్రక్రియలో అన్ని గ్రామ పంచాయతీలు పాల్గొనేలా చూడాలని వారిని ఉద్బోధించారు. పునరుద్ధరించిన జాతీయ పంచాయతీ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానించే ప్రక్రియ సెప్టెంబర్ 10, 2022 నుండి ప్రారంభమవుతుంది. ఈ అవార్డుల కోసం ఆన్లైన్లో ఎంట్రీలను సమర్పించడానికి చివరి తేదీ 31 అక్టోబర్, 2022.

మండలం, జిల్లా, రాష్ట్రం మరియు జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలను పునర్వ్యవస్థీకరించడానికి, సత్కరించడానికి మరియు ప్రోత్సహించడానికి బహుళ-స్థాయి పోటీని ఏర్పాటు చేయడమే జాతీయ పంచాయతీ అవార్డుల ఫార్మాట్. ఈ విధానాలు మరియు వర్గాలను సమగ్రంగా సవరించినట్లు కేంద్ర మంత్రి తన లేఖలో తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికీకరణ మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (SDGలు) సాధనకు సంబంధించిన నేపథ్య రంగాలలో స్థాయిలు ఆధారంగా కూడా ఈ అవార్డులు ఉంటాయి.

ఈ సంవత్సరం, పంచాయితీలలో SDGల స్థానికీకరణ మరియు సాధన యొక్క వేగాన్ని వేగవంతం చేయడానికి, బహుళ-స్థాయి పోటీని నిర్వహించడానికి, జాతీయ పంచాయతీ అవార్డుల ఫార్మాట్ మరియు కేటగిరీలను గణనీయంగా సవరించారు. అలాగే SDGల స్థానికీకరణ యొక్క తొమ్మిది థీమ్లతో వాటిని సమలేఖనం చేశారు. 9 ఇతివృత్తాలు- (i) పేదరికం లేని మరియు మెరుగైన జీవనోపాధి గల గ్రామం, (ii) ఆరోగ్యకరమైన గ్రామం, (iii) పిల్లల స్నేహపూర్వక గ్రామం, (iv) నీరు సరిపడా గల గ్రామం, (v) స్వచ్ఛమైన మరియు పచ్చని గ్రామం, (vi) స్వయం సమృద్ధిగా మౌలిక సదుపాయాలు గల గ్రామం, (vii) సామాజికంగా సురక్షితమైన మరియు న్యాయమైన గ్రామం (viii) సుపరిపాలనతో కూడిన గ్రామం మరియు (ix) మహిళా-స్నేహపూర్వక పంచాయతీ (ఇంతకుముందు గ్రామంలో లింగ పక్షపాతరహితంగా జరిగిన అభివృద్ధి అని పిలుస్తారు).

కొత్తగా పునర్నిర్మించిన జాతీయ పంచాయతీ అవార్డుల వ్యవస్థ గురించిన సవివరమైన సమాచారం www.panchayataward.gov.in పోర్టల్లో అందుబాటులో ఉంది.

నేపధ్యం;

దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధమైన హోదాను పురస్కరించుకుని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా (NPRD) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుండి పంచాయితీ ప్రతినిధులతో నేరుగా సంభాషించడానికి, అలాగే వారిని శక్తివంతం చేయడానికి మరియు వారి ద్వారా ఇతరులను ప్రేరేపించడానికి వారి విజయాలను గుర్తించడానికి అవకాశం కల్పిస్తుంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క లక్ష్యం పంచాయతీలు మరియు గ్రామసభలు, రాజ్యాంగం ద్వారా నిర్దేశితమైన గ్రామీణ ప్రాంతాల కోసం స్థానిక స్వపరిపాలన సంస్థలు మరియు వాటి పాత్రలు, బాధ్యతలు, విజయాలు, ఆందోళనలు, తీర్మానాలు మొదలైన వాటి గురించి అవగాహన పెంచడం వీటి యొక్క ఉద్దేశ్యం. రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని సముచితమైన రీతిలో జరుపుకోవాలని అభ్యర్థించారు. అలాగే పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని 'సమాజం మొత్తం' విధానంతో 'జన్ భగీదరి'గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రతి సంవత్సరం, ఈ సందర్భంగా, పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న పంచాయితీలు/రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు సేవలు మరియు ప్రజా వస్తువుల డెలివరీని మెరుగుపరచడంలో వారి మంచి పనిని గుర్తించి పంచాయితీల ప్రోత్సాహకం కింద అవార్డులను అందజేస్తోంది.

 

***


(Release ID: 1856863)