ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

సెప్టెంబర్ 1వ  మరియు 2వ తేదీ లలో కేరళ ను మరియు కర్నాటక ను సందర్శించనున్నప్రధాన మంత్రి


దేశం లో తయారైన ఒకటో యుద్ధ విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రధాన మంత్రి దేశ సేవ కు అంకితం చేయనున్నారు

రక్షణ రంగం లో ఆత్మనిర్భరత కు ఒక ప్రకాశపుంజం గా ఉన్న విక్రాంత్ నుభారతదేశం లోని ప్రధానమైన పారిశ్రామిక సంస్థల తో పాటు 100 కు పైగా ఎమ్ఎస్ఎమ్ఇ ల ద్వారా ఉత్పత్తిఅయిన స్వదేశీ ఉపకరణాలు మరియు యంత్రాల ను ఉపయోగించి తయారు చేయడమైంది

భారతదేశం  యొక్క సముద్ర రంగ చరిత్ర లో నిర్మాణం జరిగిన అతిపెద్ద నౌక ఇదే; మరి ఈ నౌక లో అత్యాధునిక ఆటోమేశన్ సంబంధి అంశాల ను జతపరచడమైంది

వలస హయాం కు భిన్నం గా, ఒక నూతనమైన నౌకాదళ  చిహ్నాన్నిప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు

కాలడి గ్రామం లో గల శ్రీ ఆది శంకర జన్మ భూమి క్షేత్రాన్ని ప్రధాన మంత్రిసందర్శిస్తారు

సుమారు 3800 కోట్ల విలువ కలిగిన యాంత్రీకరణ మరియు పారిశ్రామికీకరణ పథకాల కుమంగళూరు లో ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం జరపడం తో పాటు కొన్ని పథకాల కు శంకుస్థాపన చేస్తారు 

Posted On: 30 AUG 2022 11:12AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబరు 1వ మరియు 2వ తేదీల లో కేరళ ను, కర్నాటక ను సందర్శించనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నాడు సాయంత్రం పూట 6 గంటల కు ప్రధాన మంత్రి కోచి విమానాశ్రయం సమీపం లో ఉన్న కాలడి పల్లె ప్రాంతం లో ఆది శంకరాచార్యుల వారి పవిత్ర జన్మస్థలం అయినటువంటి శ్రీ ఆది శంకర జన్మభూమి క్షేత్రాన్ని సందర్శిస్తారు. సెప్టెంబర్ 2వ తేదీ నాడు ఉదయం 9:30 గంటల కు ప్రధాన మంత్రి కోచి లోని కోచీన్ శిప్ యార్డ్ లిమిటెడ్ లో ఒకటో స్వదేశీ విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ ను దేశ సేవ కు సమర్పణం చేయిస్తారు. ఆ తరువాత ప్రధాన మంత్రి మధ్యాహ్నం పూట 1:30 గంటల కు మంగళూరు లో దాదాపు గా 3800 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల లో కొన్నిటి ని ప్రారంభించడం తో పాటుగా మరికొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు.

కోచి లో ప్రధాన మంత్రి

ఆత్మనిర్భరత, ప్రత్యేకించి వ్యూహాత్మక రంగాల లో స్వావలంబన ముఖ్యం అని ప్రధాన మంత్రి తన వాణి ని బలం గా వినిపిస్తూ వస్తున్నారు. రక్షణ రంగం లో స్వావలంబన దిశ లో ఒక ముఖ్యమైన అడుగు ను వేయడానికి సూచకం గా ప్రధాన మంత్రి మొట్టమొదటి స్వదేశీ నిర్మాణం అయినటువంటి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను దేశ సేవ కు అంకితం చేయనున్నారు. దీనికి భారతదేశం నౌకాదళం లోని వార్ శిప్ డిజైన్ బ్యూరో (డబ్ల్యుడిబి) రూపు రేఖల ను అందించగా, నౌకాశ్రయాలు, శిపింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో నడుస్తున్న ప్రభుత్వ రంగ శిప్ యార్డ్ అయిన కోచీన్ శిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా దీని ని నిర్మించడం జరిగింది. విక్రాంత్ నిర్మాణం లో అత్యాధునిక ఆటోమేశన్ సదుపాయాలు ఉన్నాయి; ఇది భారతదేశం యొక్క సముద్ర సంబంధి చరిత్ర లో ఇంతవరకు నిర్మాణం అయిన నౌక లు అన్నిటిలోకీ అతి పెద్దది కూడా అని చెప్పుకోవాలి.

ఈ దేశవాళీ విమాన వాహక నౌక కు దీనికి ముందు సేవలు అందించిన భారతదేశం తొలి యుద్ధ విమాన వాహక నౌక పేరు నే పెట్టారు. ఆ నౌక 1971వ సంవత్సరం జరిగిన యుద్ధం లో ఒక ముఖ్య పాత్ర ను పోషించింది. అయితే, తాజా నౌక కు పెద్ద సంఖ్య లో స్వదేశీ ఉపకరణాలను, యంత్ర పరికరాల ను అమర్చడమైంది. వీటి నిర్మాణం దేశం లోని ప్రధానమైన పారిశ్రామిక సంస్థ లు మరియు 100 కు పైగా సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా వాణిజ్య సంస్థ ( ఎమ్ఎస్ఎమ్ఇ) ల ద్వారా జరిగింది. విక్రాంత్ ను జల ప్రవేశం చేయించడం తో ఇక భారతదేశం తరఫున రెండు యుద్ధ విమాన వాహక నౌక లు క్రియాశీలం కానున్నాయి; వీటి తో దేశ సముద్ర సంబంధి సురక్ష కు చాలా బలం అందిరాగలదు.

ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి నౌకాదళాని కి నూతన ధ్వజాన్ని (చిహ్నాన్ని) కూడా ఆవిష్కరించనున్నారు. ఇది వలస హయాము సంప్రదాయాని కి అతీతం గాను, సమృద్ధమైన భారతదేశ సముద్ర సంబంధి వారసత్వ ప్రతీక కు అనుగుణం గాను ఉండబోతోంది.

మంగళూరు లో ప్రధాన మంత్రి

ఇంచుమించు 3800 కోట్ల రూపాయల విలువైన యాంత్రీకరణ మరియు పారిశ్రామికీకరణ పథకాల ను ప్రధాన మంత్రి మంగళూరు లో ప్రారంభించడం తో పాటు కొన్నిటి కి శంకుస్థాపన కూడా చేయనున్నారు.

న్యూ మంగళూరు పోర్ట్ ఆథారిటి ఆధ్వర్యం లో నడిచేటటువంటి కంటేనర్ స్ మరియు ఇతర సరకు రవాణా కు ఏర్పాటుల ను చేయాలి అనే ఉద్దేశం తో బెర్త్ నెంబర్ 14 యొక్క యాంత్రికీకరణ కోసమని 280 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. యాంత్రీకరణ పూర్తి కావడం అనేది టర్మినల్ యొక్క సామర్థ్యాన్ని పెంపొందింపచేస్తుంది. అంతే కాకుండా నౌకాశ్రయం లో సరకుల ను దించడానికి, ఎక్కించడానికి తక్కువ సమయం పడుతుంది. సరకులను బెర్త్ వద్దకు చేరవేసే కంటే ముందు చేపట్టే ప్రక్రియల లో ఆలస్యం తలెత్తదు. నౌకాశ్రయం లో సరకు ను అట్టిపెట్టి ఉంచే కాలం లో సుమారు 35 శాతం వరకు తగ్గిపోగలదు. ఈ విధం గా కార్యకలాపాలు చేపట్టే వాతావరణం లో మెరుగుదల చోటు చేసుకొంటుంది. నౌకాశ్రయం లో వ్యాపారపరమైన అవకాశాల కు ప్రోత్సాహం లభించనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు లోని ఒకటో దశ ను ఫలప్రదం గా పూర్తి చేయడమైంది. తద్వారా నౌకాశ్రయం హేండ్ లింగ్ కెపాసిటీ కి 4.2 ఎమ్ టిపిఎ తోడయింది; 2025వ సంవత్సరాని కల్లా నౌకాశ్రయం హ్యాండ్ లింగ్ కెపాసిటీ మరింత అధికమై 6 ఎమ్ టిపిఎ కు పైచిలుకు స్థాయి కి చేరుకొంటుంది.

నౌకాశ్రయం ఆధ్వర్యం లో నడిచే ఇంచుమించు 1,000 కోట్ల రూపాయల విలువ కలిగిన అయిదు ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అత్యాధునిక క్రయోజనిక్ ఎల్ పిజి స్టోరేజి ట్యాంక్ టర్మినల్ కలసి ఉండేటటువంటి ఏకీకృత ఎల్ పిజి మరియు బల్క్ లిక్విడ్ పిఒఎల్ సదుపాయం, 45,000 టన్నుల పూర్తి సామర్థ్యం కలిగివుండే విఎల్ జిసి (అతి పెద్ద గ్యాస్ కేరియర్) లను నింపే మరియు ఖాళీ చేసే పని ని చక్కని నేర్పు తో చేయగలుగుతుంది. ఈ సదుపాయం ఆ ప్రాంతం లో ‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’ కు అండదండల ను అందించడంతో పాటు దేశం లో అగ్రగామి ఎల్ పిజి దిగుమతి సౌలభ్యం కలిగిన నౌకాశ్రయాల లో ఒకటి అయ్యే హోదా ను ఈ పోర్టు కు కట్టబెడుతుంది. నిలవ ట్యాంకు లు, ఖాద్య తైలాల శుద్ధి కర్మాగారం, బిట్యుమిన్ నిలవ మరియు తత్సంబంధి సదుపాయాలు, బిట్యుమిన్ మరియు ఖాద్య తైలాల నిలవ తత్సంబంధి సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుల తో బిట్యుమిన్ మరియు ఖాద్య తైలాల వాహక నౌకల పనుల కు పట్టే సమయం తగ్గుతుంది, అంతేకాకుండా సరకు రవాణా కు అయ్యే వ్యయం సైతం తగ్గుతుంది. కులాయి లో ఫిశింగ్ హార్బర్ అభివృద్ధి పనుల కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా చేపల ను పట్టే అవకాశాలు, వాటికి ప్రపంచ బజారు లో మెరుగైన ధరలు లభించే అవకాశాలు పెరిగిపోగలవు. ఈ కార్యాన్ని సాగర్ మాల కార్యక్రమం లో భాగం గా చేపట్టడం జరుగుతుంది; మరి వీటి వల్ల మత్స్యకారుల సముదాయాని కి సామాజిక పరమైన, ఆర్థికపరమైన ప్రయోజనాలు చెప్పుకోదగిన స్థాయి లో లభిస్తాయి.

మంగళూరు రిఫైనరీ ఎండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ చేపట్టే రెండు పథకాల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఆ పథకాల లో బిఎస్-6 ఉన్నతీకరణ ప్రాజెక్టు మరియు సముద్ర జలం నిర్లవణీకరణ ప్లాంటు లు ఉన్నాయి. వీటిలో బిఎస్-6 అప్ గ్రెడేశన్ ప్రాజెక్టు విలువ దాదాపు గా 1830 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇది బిఎస్-6 గ్రేడు కు చెందిన పర్యావరణ హితకరమైనటువంటి అత్యధిక శుద్ధత కలిగిన ఇంధనం ఉత్పత్తి కి దోహదం చేస్తుంది. దీనిలో గంధకం మోతాదు 10 పిపిఎమ్ కంటే తక్కువ గా ఉంటుంది. ఇదే విధం గా సుమారు 680 కోట్ల రూపాయల వ్యయం తో ఏర్పాటయ్యే సీ వాటర్ డీశాలినేశన్ ప్లాంటు తాజా నీటి పై ఆధారపడటాన్ని తగ్గించడం లో తోడ్పడడం తో పాటుగా ఏడాది అంతటా క్రమం తప్పక హైడ్రోకార్బన్స్ మరియు పెట్రోకెమికల్స్ తాలూకు సరఫరా కు పూచీ పడుతుంది. రోజు కు 30 మిలియన్ లీటర్ (ఎమ్ఎల్ డి) సామర్థ్యాన్ని కలిగి ఉండేటటువంటి ఈ ప్లాంటు లో సముద్ర జలాన్ని శుద్ధి ప్రక్రియ ల కోసం అవసరపడే సామాన్యమైనటువంటి నీటి రూపం లోకి మార్పు చేయడం జరుగుతుంది.

 

***

 



(Release ID: 1855513) Visitor Counter : 157