వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ ఈ మార్కెట్‌ ప్లేస్ (జిఇఎమ్‌) పనితీరు,పురోగతిని సమీక్షించిన శ్రీ పీయూష్ గోయల్


ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక సమ్మేళనాన్ని ప్రోత్సహించడానికి అన్నిప్రభుత్వ కొనుగోళ్లు ప్రభుత్వ ఈ మార్కెట్‌ ప్లేస్ ( జిఇఎమ్‌ ) ద్వారా జరగాలి .. శ్రీ పీయూష్ గోయల్

ప్రభుత్వ ఈ మార్కెట్‌ ప్లేస్ ( జిఇఎమ్‌ ) ద్వారా అన్ని కార్యకలాపాలు, చెల్లింపులు ఆన్‌లైన్‌లో జరిగేలా చూడాలి .. శ్రీ పీయూష్ గోయల్

నిర్ణీత సమయానికి వస్తువుల సరఫరా జరిగేలా చూసేందుకు జిఇఎమ్‌ చర్యలు తీసుకోవాలి.. శ్రీ పీయూష్ గోయల్
పోర్టల్‌లో మోసపూరిత కార్యకలాపాలు నిరోధించి, మోసాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు బలమైన వ్యవస్థ ఏర్పాటు కావాలి...శ్రీ పీయూష్ గోయల్

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సాంకేతిక ఆధునీకరణ కోసం ప్రణాళిక సిద్ధం చేసిన జిఇఎమ్‌

Posted On: 28 AUG 2022 9:53AM by PIB Hyderabad

ప్రభుత్వ ఈ  మార్కెట్‌ప్లేస్ ( జిఇఎమ్‌) పనితీరు, పురోగతిని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్  సమీక్షించారు.

జిఇఎమ్‌   అమలు చేస్తున్న  వివిధ ప్రణాళికలు, సేకరణ మరియు సరఫరా,  సమయపాలన తదితర అంశాలను మంత్రి సమీక్షించారు. 2022 ఏప్రిల్ నుంచి  జిఇఎమ్‌   సమయపాలన మెరుగుపడిందని సమీక్షలో గుర్తించారు.  జిఇఎమ్‌   ద్వారా చెల్లింపులు జరిగిన లావాదేవీల్లో  95% కంటే ఎక్కువ సరుకులను  సమయానికి అందించినట్టు సమీక్షలో వెల్లడయింది. 
జిఇఎమ్‌   ద్వారా  జరిగిన అన్ని లావాదేవీలు  రకాలు (ప్రత్యక్ష  కొనుగోళ్లు ,ఎల్ 1, బిడ్లు / రివర్స్ వేలం) ఆన్-టైమ్ సరఫరా  స్థిరమైన మెరుగుదల ఉందని గుర్తించారు. అయితే, సరఫరాను  మరింత వేగవంతం చేయడానికి, ప్రభుత్వ కొనుగోలుదారులకు మరిన్ని వెసులుబాట్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.   ప్రభుత్వ కొనుగోలుదారులకు తమ  అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని అన్నారు. 

జిఇఎమ్‌లో వస్తువులు కొనుగోలు చేసిన కొనుగోలుదారులు అన్ని చెల్లింపులు చేసేందుకు ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టి  సరఫరా జరుగుతున్న తీరును పర్యవేక్షించేందుకు  పటిష్ట వ్యవస్థకు రూపకల్పన చేయాలని  శ్రీ గోయల్ సూచించారు.
సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి  ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు అన్ని ప్రభుత్వ కొనుగోళ్ళు జిఇఎమ్‌లో జరిగేలా చూసేందుకు పారదర్శక ఆన్‌లైన్ విధానం  పూర్తిగా అమలులోకి రావాల్సి ఉంటుందని  చెప్పారు.

 కుట్రపూరిత వ్యవహారాలు, మోసాలను గుర్తించి నివారించడానికి  జిఇఎమ్‌   అమలు చేస్తున్న  AI-ML విధానాలను మంత్రి సమీక్షించారు. దీనితో పాటు   సేకరణ సమయంలో అవకతవకలు నివారించేందుకు అమలు చేస్తున్న   పర్యవేక్షణ చర్యలను కూడా శ్రీ గోయల్ చట్టవ్యతిరేక, మోసపూరిత  కార్యకలాపాలకు పాల్పడే  కొనుగోలుదారులు మరియు సరఫరాదారులపై చర్యలు తీసుకునేందుకు పటిష్టమైన చట్టపరమైన మరియు శిక్షాత్మక చర్యలను తీసుకోవాలని శ్రీ గోయల్ సూచించారు.

అవకతవకలు  గుర్తించడంతోపాటు కొనుగోలుదారులకు వస్తువుల వివరాలు అందించేందుకు, ప్రజలు ఖర్చు తగ్గించేంచేలా సహకరించేందుకు  AI-ML ని ఉపయోగించేందుకు కూడా  జిఇఎమ్‌ ప్రణాళిక రూపొందిస్తుంది. 
వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలు, సేవలు అందించేందుకు అధునాతన  సాంకేతిక అంశాలను  ఉపయోగించాలని  జిఇఎమ్‌ నిర్ణయించింది.ఎంఎస్ఎంఈ ల కోసం  జిఇఎమ్‌ అమలు చేస్తున్న కార్యక్రమాలు, నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ప్రచారం అనేక ఇతర కార్యక్రమాలు మంత్రి అభినందించారు. 

***



(Release ID: 1855071) Visitor Counter : 155