మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఎనిమిది అగ్రశ్రేణి ఆస్ట్రేలియన్ యూనివర్శిటీలతో చర్చాగోష్టి లో పాల్గొన్నారు


శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఆస్ట్రేలియా-భారత్ పరిశోధన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు

Posted On: 24 AUG 2022 4:23PM by PIB Hyderabad

కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు విజయవంతమైన ఆస్ట్రేలియా-భారత పరిశోధన భాగస్వామ్యం పై ఎనిమిది అగ్రశ్రేణి  (G08) ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాల  బృందంలోని విద్యావేత్తలతో చర్చలు జరిపారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన 76వ స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసాన్ని ప్రస్తావిస్తూ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదానికి అదనంగా జోడించిన జై అనుసంధాన్ మంత్రాన్ని పునరుద్ఘాటించారు.  రాబోయే దశాబ్దంలో ఆతరువాత భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధికి పునాదిని ఈ విశిష్ట అంశం కల్పిస్తుంది. ఈ దశాబ్దాన్ని భారతదేశం యొక్క సాంకేతిక దశాబ్ది గా అభివర్ణిస్తూ దేశ స్వావలంబనకోసం తన వనరులోని ప్రతి ఒక్కటినీ ను ప్రోది చేయాలనే భారతదేశ సంకల్పాన్ని మంత్రి పంచుకున్నారు. భారత్‌తో పరిశోధన భాగస్వామ్యం బలోపేతం చేసుకోవడం అందరికీ విజయమని ఆయన అన్నారు.

 

భారతదేశం ఆస్ట్రేలియా మధ్య మంచి పరిశోధనా భాగస్వామ్యం ఉందని శ్రీ ప్రధాన్ అన్నారు.జాతీయ ప్రాధాన్యతలను నెరవేర్చడానికి మరియు ప్రపంచ సవాళ్లకు పరిగణించగల పరిష్కారాలను అందించడానికి కొత్త అవకాశాలను స్వీకరించడానికి మన పరస్పర పరిశోధన సహకారాలను మరింత తీవ్రతరం చేయడం కోసం  ఎనిమిది విశ్వవిద్యాలయాల బృందాన్ని ఆయన స్వాగతించారు. 

 

 'విద్య, పరిశోధన మరియు నైపుణ్య రంగాలలో సహకారానికి నూతన అవకాశాలు' అనే అంశంపై జరిగిన సమావేశం లో మోనాష్ విశ్వవిద్యాలయంలోని ఆస్ట్రేలియా ప్రభుత్వ విద్యావేత్తలు మరియు ఆస్ట్రేలియా ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో కూడా మంత్రి సంభాషించారు. నిర్ధారిత ఆధారిత పరిశోధనలపై ప్రధాని నొక్కిచెప్పారని, మానవాళి పురోగతి, సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం పరిశోధనశాల నుంచి క్షేత్ర స్థాయి కి ‘ల్యాబ్-టు-ల్యాండ్’ మరియు క్షేత్ర స్థాయి నుంచి పరిశోధనశాలకు ‘ల్యాండ్-టు-ల్యాబ్’ అనే మంత్రాన్ని అందించారని మంత్రి తెలిపారు. భారతదేశం అన్ని స్థాయిలలో ఉత్సుకత సృనాత్మకత ప్రేరణ తో పరిశోధన మరియు ఆవిష్కరణలను పెంపొందించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.

 

శ్రీ ప్రధాన్ మెల్‌బోర్న్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులతో కూడా ఉల్లాసంగా సంభాషించారు. వారి విద్యానుభవాల గురించి అడిగి తెలుసుకోవడం ఆనందంగా ఉంది మరియు భారతదేశాన్ని విజ్ఞాన అగ్ర శక్తి గా ఉన్నతీకరించాలనే వారి ఆలోచనల ద్వారా తాను సంపన్నమయ్యానని చెప్పారు.

***



(Release ID: 1854271) Visitor Counter : 139