నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మోఖ్‌బర్‌ను కలుసుకున్న శ్రీ సర్బానంద సోనోవాల్; ఇండో ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన నిబద్ధతపై పునరుద్ఘాటన


భారతదేశం, ఇరాన్ సముద్ర ప్రయాణాలపై అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి; చాబహార్ పోర్ట్ ద్వారా వాణిజ్య సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారతదేశ నిబద్ధతను నొక్కి చెప్పిన సందర్భం.


ఇండియా పోర్ట్స్ అండ్ గ్లోబల్ కంపెనీ (IPGL) చబహార్ పోర్ట్ ద్వారా వాణిజ్యరవాణాను ప్రోత్సహించడానికి టెహ్రాన్, చబహార్‌లో కార్యాలయాలను తెరవనుంది.


మధ్య ఆసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియాకు మధ్యవర్తిగా పనిచేసే చబహార్ సంభావ్యత ఈ ప్రాంతంలో వాణిజ్య సామర్థ్యాన్ని పెంపొందించడానికి కీలకమైనది

Posted On: 22 AUG 2022 3:32PM by PIB Hyderabad

కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు, ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ ఐన మహమ్మద్ మొఖ్బర్ను టెహ్రాన్లో కలుసుకున్నారు. ఇండో ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు. భారత్తో సంబంధాల కోసం ఇరాన్ ప్రత్యేక రాయబారి అయిన ఆ దేశ ఉపరాష్ట్రపతి మహమ్మద్ మొఖ్బర్, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత నౌకాయాన మంత్రి పర్యటన ద్వారా ప్రోత్సాహాన్ని అందించడాన్ని అభినందించారు. చబహార్ పోర్ట్ అభివృద్ధి వాణిజ్యం రవాణా పరిమాణంలో పెరుగుదలకు దారి తీస్తుందని వారు తెలిపారు. వాణిజ్య రవాణాలో ప్రాంతీయ వృద్ధికి చబహార్ ఓడరేవును సాధనంగా మార్చేందుకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఇరుపక్షాలు సహకరించుకోవాల్సిన ప్రాముఖ్యతను కూడా కేంద్ర మంత్రి నొక్కి చెప్పారు.

 

శ్రీ సర్బానంద సోనోవాల్ ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ తో తన సమావేశం తర్వాత మాట్లాడుతూ, “ఇరాన్ వైస్ ప్రెసిడెంట్, శ్రీ మహమ్మద్ మోఖ్బర్ని కలవడం చాలా సంతోషంగా ఉంది, అక్కడ మేము శక్తివంతమైన ఇండో -ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఏకీకృతం చేయడానికి మార్గాలు, అవకాశాలను చర్చించాము. మేము ఇరాన్తో మా డైనమిక్ సంబంధాన్ని బలోపేతం చేస్తూనే ఉన్నాము. భారతదేశ ప్రధాన మంత్రి, నరేంద్ర మోడీ, పరస్పర ప్రయోజనకరమైన ఒకదాని కోసం మా సంబంధాన్ని మరింత లోతుగా విస్తరించడానికి అత్యున్నత స్థాయి నిబద్ధత గురించి ప్రస్తావించమని నన్ను కోరారు.

అంతకుముందు, శ్రీ సోనోవాల్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కు చెందిన రోడ్లు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో ద్వైపాక్షిక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా, నావికుల కోసం శిక్షణ, ధృవీకరణ పర్యవేక్షణ ప్రమాణాలపై అంతర్జాతీయ ఒడంబడిక నిబంధనల ప్రకారం రెండు దేశాలకు చెందిన నావికులకు సహాయార్ధం అపరిమిత ప్రయాణాలలో యోగ్యత సర్టిఫికేట్ల గుర్తింపుపై రెండు దేశాలు అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశాయి.

 

శ్రీ సర్బానంద సోనోవాల్, రోస్తమ్ ఘసేమి తో ఇండో ఇరాన్ సంబంధాలను మరింతగా బలోపేతం చేయడంపై ఫలవంతమైన ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రెండు దేశాలకు చెందిన నావికుల రాకపోకలను సజావుగా చేయడమే ఎమ్ఒయుపై సంతకాలు చేయడం. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. మధ్య ఆసియా దక్షిణాసియా, ఆగ్నేయాసియా మధ్య కూడా వేగవంతమైన, ఆర్థిక వాణిజ్య మార్గంగా పనిచేయడానికి ఈ నౌకాశ్రయం సంభావ్యతను, ఈ ప్రాంతానికి వాణిజ్య గుణకం వలె ఉన్న చబహార్ పాత్రను సమావేశంలో కేంద్ర మంత్రి హైలైట్ చేశారు.

ఇండియా పోర్ట్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ (IPGPL) షాహిద్ బెహెష్టీ పోర్ట్ కార్యకలాపాలను చేపట్టినప్పటి నుండి, ఇది 4.8 మిలియన్ టన్నుల స్థూల రవాణాను నిర్వహించింది. ఇరాన్ పోర్ట్ మారిటైమ్ ఆర్గనైజేషన్, ఇరాన్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ చబహార్ ఫ్రీ జోన్ అథారిటీ, షాహిద్ బెహెస్తి పోర్ట్ అథారిటీ ఇతర వాటాదారులతో సహా భారతదేశంIGPL ఇరాన్ ప్రాంత వాటాదారుల మధ్య సన్నిహిత సహకారంతో, పోర్ట్ భారీ వాణిజ్య సంభావ్యతను బలోపేతం చేయడానికి ఉత్ప్రేరకంగా పని చేస్తుంది.

2020లో, భారతదేశం మానవతా సహాయ కార్యక్రమాల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్కు 75000 టన్నుల గోధుమలను సరఫరా చేసింది, అలాగే వ్యవసాయంలో మిడుత ముప్పును తగ్గించడానికి, ఆహార భద్రతను పెంపొందించే సమిష్టి ప్రయత్నంలో ఇరాన్కు 40,000 లీటర్ల మలాథియాన్ 96% యు ఎల్ వి పురుగుమందులను చబహార్ నౌకాశ్రయం ద్వారా అందించింది. చబహార్ పోర్ట్ సామర్థ్యాన్ని ఉత్తేజపరిచే ప్రయత్నంలో, కేంద్ర మంత్రి ఆరు మొబైల్ హార్బర్ క్రేన్లను ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ చబహర్ ఫ్రీ ట్రేడ్ జోన్ (IPGCFTZ)ని ప్రారంభించారు.

 

శ్రీ సర్బానంద సోనోవాల్ ఇరాన్లో మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. తన ఇరాన్ పర్యటన తర్వాత, మంత్రి యుఎఇలో ఒక రోజు అధికారిక పర్యటన లో ఉంటారు, అక్కడ అతను జెబెల్ అలీ నౌకాశ్రయాన్ని సందర్శించి ద్వైపాక్షిక సమావేశాలు పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొంటారు.

 

*****


(Release ID: 1854057) Visitor Counter : 160