ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన శ్రమ శాఖ మంత్రుల తోఆగస్టు 25వ తేదీ న జరిగే నేశనల్ లేబర్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నప్రధాన మంత్రి


ఈ సమావేశం ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి లో రెండు రోజుల పాటు జరుగుతుంది

శ్రమ కు సంబంధించిన అంశాలు మరియు శ్రామికుల సంక్షేమం తో జతపడ్డ  అంశాల లో కేంద్రాని కి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకుమధ్య పరస్పర సమన్వయాన్ని ఏర్పరచడం లో ఈ సమావేశం తోడ్పడనుంది

Posted On: 23 AUG 2022 9:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా 2022వ సంవత్సరం ఆగస్టు 25వ తేదీ నాడు సాయంత్రం 4:30 గంటల కు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల శ్రమ శాఖ మంత్రుల జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాన్ని కేంద్ర శ్రమ మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ 2022వ సంవత్సరం ఆగస్టు 25, 26వ తేదీల లో ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి లో నిర్వహించనున్నది.

 

సహకారాత్మక సమాఖ్య విధానం అనే భావన తో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడమైంది. శ్రమ కు సంబంధించిన వివిధ మహత్వపూర్ణమైనటువంటి అంశాల ను ఈ సమావేశం లో చర్చించడం జరుగుతుంది. ఈ సమావేశం ద్వారా శ్రామికుల సంక్షేమం కోసం పథకాల ను ప్రభావవంతమైన విధం గా అమలు చేయడానికి పూచీపడడం లో మరియు మెరుగైన విధానాల ను రూపొందించడం లో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాల కు మధ్య మరింత క్రియాశీల సమన్వయాన్ని ఏర్పరచడం లో తోడ్పాటు లభించనుంది.

 

సమావేశం లో ఇతర అంశాల కు తోడు సామాజిక భద్రత ను సార్వజనీకరించడం కోసం సామాజిక భద్రత పథకాల ను ఒక చోటుకు తెచ్చి వాటి ని ఇ-శ్రమ్ పోర్టల్ తో ఏకీకృతం చేయడానికి సంబంధించి నాలుగు సదస్సులు జరగనున్నాయి. వాటి లో - రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణ లో ఉన్నటువంటి ఇఎస్ఐ ఆసుపత్రుల లో జరుగుతున్న చికిత్సల లో మెరుగుదల కు గాను ‘స్వాస్థ్య సే సమృద్ధి’ ని మరియు పిఎమ్ జెఎవై ల ఏకీకరణ; నాలుగు లేబర్ కోడ్ లలో భాగం గా నియమాల ను రూపొందించడం, మరి వాటి ని అమలు పరచేందుకు విధి విధానాల ను ఏర్పరచడం; విజన్ శ్రమేవ జయతే @ 2047’ శ్రమ కు మరియు న్యాయసమ్మతమైన, సమాన పరిస్థితులపై శ్రద్ధ వహించడం, ఇంకా క్రమం కాని కొలువు ను చేసే/ తాత్కాలిక కంట్రాక్టు పై పని చేసే/ స్వల్పకాలిక సేవ ను గాని లేదా పాక్షిక కాలసేవ ను గాని అందించే/ చేసిన పని కి బదులు గా చెల్లింపు అందుకొనే శ్రమికులు (గిగ్ వర్కర్స్) మరియు ప్లాట్ ఫార్మ్ శ్రమికులు సహా అందరు శ్రమికుల కోసం సామాజిక భద్రత, శ్రమ కు సంబంధించి మహిళల కు మరియు పురుషుల కు మధ్య సమానత్వం- వంటి అంశాల ను చేర్చడం జరిగింది.

 

***


(Release ID: 1854056) Visitor Counter : 221