జౌళి మంత్రిత్వ శాఖ

పట్టు పరిశ్రమకు ప్రోత్సాహం, భారతీయ పట్టుకు దేశ, విదేశాల్లో.బ్రాండ్ ఈక్విటీని పెంపొందించడం సిల్క్ మార్క్ ఉద్దేశం: జౌళి శాఖ మంత్రి శ్రీమతి దర్శనా విక్రమ్ జర్దోష్


సిల్క్ మార్క్ ఎక్స్ పోను ప్రారంభించిన శ్రీమతి దర్శనా జర్దోష్

2022 ఆగస్టు 22 నుంచి 2022 ఆగస్టు 28 వరకు జరిగే సిల్క్ మార్క్ ఎక్స్ పోలో పాల్గొంటున్న 12 రాష్ట్రాలకు చెందిన 39 మంది ఎగ్జిబిటర్లు

Posted On: 22 AUG 2022 2:52PM by PIB Hyderabad

కేంద్ర జౌళి , రైల్వే శాఖల సహాయ మంత్రి  శ్రీమతి దర్శనా విక్రమ్ జర్దోష్ సోమవారం ఢిల్లీలో సిల్క్ మార్క్ ఎక్స్ పోను ప్రారంభించారు. జౌళి మంత్రిత్వ శాఖ  (ఎంఒటి) కార్యదర్శి శ్రీ ఉపేంద్ర ప్రసాద్ సింగ్, (ఎంఒటి) , సెంట్రల్ సిల్క్ బోర్డ్, ఎంవోటీ. సీఈఓ అండ్ మెంబర్ సెక్రటరీ, శ్రీ.రజిత్ రంజన్ ఒఖండియార్ ,ఐ ఎఫ్ ఎస్  కూడా హాజరయ్యారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఆధ్వర్యంలో సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎంఓఐ) అనే సొసైటీ ఈ ఎక్సిబిషన్ ను  నిర్వహిస్తోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ARES.jpg

ఈ సందర్భంగా శ్రీమతి దర్శన జార్దోష్ ప్రసంగిస్తూ, భారతీయ టెక్స్ టైల్స్ రంగం ప్రపంచవ్యాప్తంగా అవకాశాలకు అగ్రభాగాన ఉండడంతో, పట్టు ఉత్పత్తుల లేబులింగ్ ప్రక్రియ ద్వారా వినియోగ దారులకు వాటి కంటెంట్ ల గురించి అనుకూల సమాచారం కోసం నిర్దిష్ట మార్కింగ్ లు ఉండేలా చూసేందుకు సెంట్ర ల్ సిల్క్ బోర్డు ఒక కొత్త వ్యవస్థను తీసుకువచ్చిందని చెప్పారు.

 

సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ద్వారా "సిల్క్ మార్క్" పేరిట ఒక పథకాన్ని రూపొందించినట్లు ఆమె తెలిపారు. సిల్క్ ను జనరిక్ గా ప్రోత్సహించడం తో పాటు, దేశ, విదేశాల్లో ఇండియన్ సిల్క్ k uh బ్రాండ్ ఈక్విటీని పెంపొందించడం సిల్క్ మార్క్ లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు.  ఇది పట్టు వినియోగదారుల ప్రయోజనాలను మాత్రమే కాకుండా, రైతులు, రీలర్లు, ట్విస్టర్ల తయారీదారులు ,స్వచ్ఛమైన పట్టు వ్యాపారులతో సహా పట్టు విలువ గొలుసు వాటాదారులందరి ప్రయోజనాలను కూడా పరిరక్షిస్తోందని ఆమె అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002IFPM.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TXMC.png

మన సుసంపన్న వారసత్వాన్ని పరిరక్షించడం, పట్టు రంగంలో నిమగ్నమైన మహిళా నేత కార్మికులు , కార్మికులకు  మెరుగైన జీవనం కోసం ఎక్కువ అవకాశాలతో శక్తివంతం

చేయడం  ఈ ఎగ్జిబిషన్ ఉద్దేశ్యం అని మంత్రి పేర్కొన్నారు. ఈ పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు. 

శ్రీమతి జర్దోష్ ఈ సందర్భంగా ఎగ్జిబిటర్లు,  చేనేత కార్మికులతో ముచ్చటించారు. కొన్ని అపురూపమైన  సిల్క్ ఉత్పత్తులను కొనుగోలు చేశారు.

సిల్క్ మార్క్ అనేది నాణ్యత హామీ కి (క్వాలిటీ అస్యూరెన్స్ ) లేబుల్, ఇది అతికించ బడిన  ఉత్పత్తి (ప్రొడక్ట్) పూర్తి నాణ్యమైన సిల్క్ తో తయారు చేయబడిందని తెలియజేస్తుంది. దీనిని సిల్క్ దారం, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, మేడప్స్, ఫర్నిషింగ్ మెటీరియల్స్ ఇంకా 100% నేచురల్ సిల్క్ తో తయారు చేయబడ్డ ఇతర సిల్క్ ప్రొడక్ట్ లకు అతికించవచ్చు. 4300 మందికి పైగా సభ్యులతో,  4.3 కోట్లకు పైగా సిల్క్ మార్క్ లేబుల్డ్ ఉత్పత్తులు మార్కెట్ లో ఉన్నాయి, 'సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా' సిల్క్ లో నాణ్యమైన ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది, ఇది సిల్క్ సౌభ్రాతృత్వానికి స్వచ్ఛత యొక్క భరోసా. ఈ గుర్తును అతికించడం అర్హతా ప్రమాణాలను హైలైట్ చేస్తుంది, ఇది చివరికి పట్టు సౌభ్రాతృత్వాన్ని ఏకం చేయడంతో పాటు దేశీయ , ఎగుమతి మార్కెట్లలో వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది.

 

సిల్క్ మార్క్ ఎక్స్ పో లు సిల్క్ మార్క్ ను ప్రోత్సహించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా రుజువయింది. . 2022 ఆగస్టు 22 నుంచి 2022 ఆగస్టు 28 వరకు జరిగే ఈ ఎక్స్ పోలో 12 రాష్ట్రాలకు చెందిన 39 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.

 

*****



(Release ID: 1853817) Visitor Counter : 153