హోం మంత్రిత్వ శాఖ
అక్రమ విదేశీ రోహింగ్యాలు
Posted On:
17 AUG 2022 3:16PM by PIB Hyderabad
అక్రమ విదేశీయులైన రోహింగ్యాలకు సంబంధించి, న్యూభిల్లీలోని బక్కర్‌వాలాలోని అక్రమ రోహింగ్యా వలసదారులరే ఇడబ్ల్యుఎస్ ఫ్లాట్‌లను ఇవ్వడంపై మీడియాలో వచ్చిన వార్తలకు సంబంధించి స్పందిస్తూ, వారికి వాటిని ఇచ్చేందుకు ఎటువంటి ఆదేశాలనూ ఇవ్వలేదని హోం వ్యవహరాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం రోహింగ్యాలను కొత్త ప్రాంతానికి తరలించాలని ప్రతిపాదించింది. కాగా, అక్రమ విదేశీయులను వారి వారి దేశాలకు తరలించేందుకుఆయా దేశాలతో చర్చించవలసిందిగా హోం శాఖ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ అంశాన్ని చేపట్టినందున అక్రమ విదేశీయులైన రోహిగ్యాలు ప్రస్తుతం వారున్న ప్రాంతమైన మదాన్‌పూర్ కధర్‌లోని కంచన్ కుంజ్‌లోనే కొనసాగించవలసిందిగా హోం వ్యవహారాల శాఖ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. .
చట్టప్రకారం వారిని వారి దేశాలకు తరలించేవరకూ అక్రమ విదేశీయులను నిర్బంధ కేంద్రంలో ఉంచుతారు. ప్రస్తుతం ప్రాంతాన్ని నిర్బంధ కేంద్రంగా ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటి దాకా ప్రకటించలేదు. కనుక, వారు ఆ పని తక్షణమే చేయవలసిందిగా ఆదేశించడమైంది.
***
(Release ID: 1852876)
Visitor Counter : 189