వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వినియోగదారులకు అధమ స్థాయి నాణ్యత కలిగిన ప్రెజర్ కుక్కర్‌లను విక్రయించినందుకు ఫ్లిప్ కార్ట్ +Flipkart) కి ₹ 1 లక్ష జరిమానా విధించిన సి సి పి ఎ (CCPA)

Posted On: 17 AUG 2022 2:17PM by PIB Hyderabad

తప్పనిసరిగా పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలను ఉల్లంఘించిన దేశీయ ప్రెషర్ కుక్కర్‌లను విక్రయించడానికి అనుమతించినందుకు ఈ-కామర్స్ బజారు ‘ఫ్లిప్‌కార్ట్’ కు వినియోగదారుల హక్కుల ఉల్లంఘనపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ జరిమానా ఉత్తర్వులు జారీ చేసింది.

చీఫ్ కమీషనర్ శ్రీమతి నిధి ఖరే నేతృత్వంలో, సి సి పి ఎ ఫ్లిప్‌కార్ట్  తన ప్లాట్‌ఫారమ్‌లో విక్రయించిన మొత్తం 598 ప్రెషర్ కుక్కర్‌ల గురించి వినియోగదారులకు తెలియజేయాలని, ప్రెషర్ కుక్కర్‌లను వెనక్కి తీసుకోవాలని వినియోగదారులకు డబ్బు తిరిగి చెల్లించాలని , 45 రోజులలోపు తమకు పూర్తి నివేదికను సమర్పించాలని ఫ్లిప్‌కార్ట్‌ని ఆదేశించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అటువంటి ప్రెషర్ కుక్కర్‌లను విక్రయించడానికి అనుమతించినందుకు మరియు వినియోగదారుల హక్కులను ఉల్లంఘించినందుకు ₹1,00,000 జరిమానా చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.

వినియోగదారులను గాయాల నుండి  మరియు ప్రాణహాని కలిగించే ప్రమాదం నుండి రక్షించడానికి మరియు మొత్తం గా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఉత్పత్తి పై ప్రామాణిక మార్కును ఉపయోగించడాన్ని మరియు తప్పనిసరిగా పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలను నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను  జారీజేస్తుంది.  ప్రెజర్ కుక్కర్‌లను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో విక్రయించినా అన్ని దేశీయ ప్రెజర్ కుక్కర్‌లు 01.02.2021 నుండి అమల్లోకి వచ్చిన దేశీయ ప్రెజర్ కుక్కర్ (నాణ్యత ప్రమాణాలు)  IS 2347: 2017ఆదేశాలకు అనుగుణంగా ఉండాలి.

ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రెజర్ కుక్కర్ల విక్రయంలో ఉత్పత్తి యొక్క ప్రతి ఇన్‌వాయిస్‌పై 'ఫ్లిప్‌కార్ట్ శక్తి తో' అనే పదాలను తప్పనిసరిగా ఉపయోగించడం మరియు వివిధ ప్రయోజనాల పంపిణీ కోసం విక్రేతలను బంగారం, వెండి మరియు కాంస్యంగా గుర్తించడం వంటి 'ఫ్లిప్‌కార్ట్ వినియోగ నిబంధనల'లోని నిబంధనలు ఫ్లిప్‌కార్ట్ పోషించిన పాత్రను సూచిస్తున్నాయని సి సి పి ఎ గమనించింది. 

ఫ్లిప్‌కార్ట్ తన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఇటువంటి ప్రెషర్ కుక్కర్‌లను విక్రయించడం ద్వారా మొత్తం  ₹1,84,263 ఆదాయం సంపాదించిందని అంగీకరించింది. అటువంటి ప్రెషర్ కుక్కర్ల అమ్మకం ద్వారా ఫ్లిప్‌కార్ట్ వాణిజ్యపరంగా లాభపడినప్పుడు, వినియోగదారులకు వాటి విక్రయం వల్ల ఉత్పన్నమయ్యే ప్రభావం మరియు బాధ్యత నుండి అది తనను తాను దూరం చేసుకోలేదని సి సి పి ఎ తెలిపింది.

వినియోగదారులలో అవగాహన మరియు నాణ్యత స్పృహను పెంపొందించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను ఉల్లంఘించే నకిలీ ఉత్పత్తులు మరియు నకిలీ వస్తువుల విక్రయాలను నిరోధించడానికి  సి సి పి ఎ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రచారంలో భాగంగా  దైనందిన వినియోగ ఉత్పత్తులయిన హెల్మెట్‌లు, దేశీయ ప్రెజర్ కుక్కర్లు మరియు వంట గ్యాస్ సిలిండర్లను గుర్తించారు. అటువంటి ఉత్పత్తుల తయారీ లేదా విక్రయాలకు సంబంధించిన అక్రమ వాణిజ్య పద్ధతులు మరియు వినియోగదారుల హక్కుల ఉల్లంఘనపై దర్యాప్తు చేసి, చర్య తీసుకున్న నివేదికను సమర్పించాలని  దేశవ్యాప్తంగా సి సి పి ఎ జిల్లా కలెక్టర్లకు లేఖ రాసింది. నాణ్యత ప్రచారం లో భాగంగా బి ఐ ఎస్  ప్రమాణాలకు అనుగుణంగా లేని హెల్మెట్‌లు మరియు ప్రెషర్ కుక్కర్‌లను శోధించి, స్వాధీనం చేసుకుంది. తప్పనిసరి నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా లేని 1,435 ప్రెషర్ కుక్కర్లు మరియు 1,088 హెల్మెట్లను బి ఐ ఎస్ స్వాధీనం చేసుకుంది.

 

వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన    ప్రమాణాలను పాటించడానికి చట్టం ప్రకారం అవసరమైన చర్యలను తీసుకోవాలని సి సి పి ఎ అన్ని రాష్ట్రాలు మరియు యు. టి ల ప్రధాన కార్యదర్శులకు కూడా లేఖ రాసింది.

 

అంతేకాకుండా, బి ఐ ఎస్ చట్టం, 2016లోని నిబంధనల ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన ప్రమాణాలను ఉల్లంఘించిన నేరాలను తక్షణమే గుర్తించాలని బి ఐ ఎస్ కు చెందిన అన్ని ప్రాంతీయ శాఖలకు  తెలియజేయాలని సి సి పి ఎ డైరెక్టర్ జనరల్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి లేఖ రాసింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కొత్త షార్ట్ కోడ్ '1915'ని ప్రారంభించినప్పటి నుండి, ఎక్కువ మంది వినియోగదారులు తమ ఫిర్యాదులను నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఎన్‌సిహెచ్‌లో నమోదైన అన్ని ఫిర్యాదులలో ఇ-కామర్స్ బజారు అత్యధిక భాగాన్ని ఆక్రమిస్తూనే ఉందని గమనించాలి. జూలై 2022 నెలలో, ఎన్‌సిహెచ్‌పై వచ్చిన ఫిర్యాదులలో 38% ఇ-కామర్స్‌కు సంబంధించినవి. ఇ-కామర్స్‌ పై వస్తున్న వినియోగదారుల ఫిర్యాదులలో ప్రధానమైనవి  లోపభూయిష్ట ఉత్పత్తిని పంపడం, చెల్లించిన మొత్తాన్ని వాపసు చేయడంలో వైఫల్యం, ఉత్పత్తి డెలివరీలో జాప్యం మొదలైనవి.

ఐ ఎస్ ఐ మార్క్ లేని మరియు  బి ఐ ఎస్ ప్రమాణాలను ఉల్లంఘించే వస్తువులను కొనుగోలు చేయకుండా వినియోగదారులను అప్రమత్తం చేయడానికి మరియు హెచ్చరించడానికి సి సి పి ఎ చట్టంలోని సెక్షన్ 18(2)(j) కింద భద్రతా నోటీసులను కూడా జారీ చేసింది. హెల్మెట్‌లు, ప్రెజర్ కుక్కర్లు మరియు వంట గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి మొదటి భద్రత నోటీసు జారీ చేయగా, ఎలక్ట్రిక్ ఇమ్మర్షన్ వాటర్ హీటర్లు, కుట్టు మిషన్లు, మైక్రోవేవ్ ఓవెన్‌లు, ఎల్‌పిజి వంటి  గృహోపకరణాలకు సంబంధించి రెండవ భద్రత నోటీసు జారీ చేయబడింది.

 

***

 


(Release ID: 1852559) Visitor Counter : 292