వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

మేధో సంపత్తి (IP) అవగాహనపై పది లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలనే లక్ష్యాన్ని సాధించిన జాతీయ మేధోసంపత్తి అవగాహనా సమితి- నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అవేర్‌నెస్ మిషన్ (NIPAM)


28 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలలోని 3662 విద్యా సంస్థల వ్యాప్తిలో ఈ ప్రయత్నం సాధ్యమైంది

Posted On: 11 AUG 2022 4:00PM by PIB Hyderabad

నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అవేర్‌నెస్ మిషన్ (NIPAM) 15 ఆగస్టు 2022 గడువు కంటే ముందే, 31 జూలై 2022న మిలియన్ విద్యార్థులకు మేధో సంపత్తి (IP) అవగాహన ప్రాథమిక శిక్షణను అందించాలనే లక్ష్యాన్ని సాధించింది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్వేడుకల్లో భాగంగా మేధో సంపత్తి అవగాహన , దాని పై ప్రాథమిక శిక్షణను అందించడానికి ప్రధాన కార్యక్రమం NIPAM 8 డిసెంబర్ 2021న ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మేధో సంపత్తి కార్యాలయం, పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ (CGPDTM), వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కంట్రోలర్ జనరల్ కార్యాలయం అమలు చేస్తోంది.

08 డిసెంబర్ 2021 నుండి 31 జూలై 2022 మధ్య కాలంలో, కింది మైలురాళ్లను సాధించారు:

మేధోసంపత్తిపై శిక్షణ పొందిన పాల్గొనేవారి సంఖ్య (విద్యార్థులు/అధ్యాపకులు) = 10, 05, 272

పాల్గొన్న విద్యా సంస్థలు = 3662

భౌగోళిక పరిధి = 28 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు

అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM) సహకారంతో మేధోసంపత్తి కార్యాలయ ప్రస్తుత వనరులను ఉపయోగించి పునరుద్ధరించిన పద్ధతిలో సమాజ సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడటం, ఆవిష్కరణలకు చేయూత, సృజనాత్మకతను పెంపొందించడానికి ప్రోత్సహించడానికి AICTE, UGC మొదలైనవ సంస్థల సౌజన్యంతో NIPAM కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడం తదుపరి కార్యాచరణ.

 

****



(Release ID: 1852305) Visitor Counter : 207