మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మాన్ని వేడుక‌గా నిర్వ‌హించిన భార‌త ప్ర‌భుత్వం


ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో ఝాల్కారీ బాయ్ విగ్ర‌హం వ‌ద్ద జాతీయ జెండాను ఎగుర‌వేసిన డాక్ట‌ర్‌. సంజీవ్ కుమార్ బ‌ల్యాన్‌

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా దేశంలోని 400 విశిష్ట ప్రాంతాల‌లో కార్య‌క్ర‌మాలు

Posted On: 16 AUG 2022 11:41AM by PIB Hyderabad

ఆగ‌స్టు 11 నుంచి 15 ఆగ‌స్టు 2022 వ‌ర‌కుభార‌త ప్ర‌భుత్వం  హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మాన్ని వేడుక‌గా నిర్వ‌హించింది.  ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కింద గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి నాయ‌క‌త్వంలో భార‌త ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా 400 విశిష్ట ప్రాంతాల‌లో ఈ వేడుక‌ను జ‌రుపుకుంది. 
భార‌త మ‌త్స్య, ప‌శుసంవ‌ర్ధ‌క‌, పాడి ప‌రిశ్ర‌మ‌ల శాఖ ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ స‌మ‌న్వ‌యంతో హ‌ర్‌ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మాన్ని ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో ఝ‌ల్కారీ బాయ్ విగ్ర‌హం వ‌ద్ద 15 ఆగ‌స్టు 2022 నిర్వ‌హించింది. 
భార‌త మ‌త్స్య‌, పాడిప‌రిశ్ర‌మ‌, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ సంజీవ్ కుమార్ బ‌ల్యాన్ ముఖ్య అథిగా ప‌లువురు గౌర‌వ అతిథుల‌తో క‌లిసి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. గౌర‌వ మ‌త్స్య శాఖ స‌హాయ మంత్రి ఝ‌ల్కారి బాయ్ విగ్ర‌హం వ‌వ‌ద్ద జాతీయ జెండాను ఎగుర‌వేసి, స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌, అమ‌ర‌వీరుల కుటుంబ స‌భ్యుల‌ను స‌త్క‌రించారు. హ‌ర్‌ఘ‌ర్ తిరంగా ప్ర‌చారంలో చురుకుగా పాల్గొన‌వ‌ల‌సిందిగా మంత్రి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రిచారు. 
ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉత్సాహంగా ప‌రిపాల‌నాప‌ర‌మైన‌, ఇత‌ర ఏర్పాట్ల‌తో తోడ్పాటునందించింది. 


 



(Release ID: 1852297) Visitor Counter : 167