హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆయ‌న స్మార‌ర‌కం వ‌ద్ద నివాళులర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


- న్యూఢిల్లీలోని 'సదైవ అటల్' స్మారకాన్ని సందర్శించి నివాళుల‌ర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి

- ‌గౌరవనీయులైన శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి తన జీవితంలోని ప్రతి క్షణాన్ని తల్లి భారతావ‌ని వైభవాన్ని పునరుద్ధరించడానికి వెచ్చించారుః శ్రీ అమిత్ షా

- శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ రాజకీయాల్లో పేదల సంక్షేమం, సుపరిపాలనలో కొత్త శకాన్ని ప్రారంభించాడు మరియు అదే సమయంలో భారతదేశం యొక్క ధైర్యాన్ని మరియు శక్తిని ప్రపంచం గుర్తించేలా చేశారు.. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులుః కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి

प्रविष्टि तिथि: 16 AUG 2022 1:11PM by PIB Hyderabad

మాజీ ప్రధాన మంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
న్యూఢిల్లీలోని 'సదైవ అటల్' స్మారకాన్ని సందర్శించి నివాళుల‌ర్పించారు. గౌరవనీయులైన మాజీ ప్ర‌ధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి తన జీవితంలోని ప్రతి క్షణాన్ని తల్లి భారతావ‌ని వైభవాన్ని పునరుద్ధరించడానికి వెచ్చించార‌ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా త‌న వ‌రుస ట్వీట్లలో పేర్కొన్నారు. శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ రాజకీయాల్లో పేదల సంక్షేమం, సుపరిపాలన యొక్క కొత్త శకాన్ని ప్రారంభించాడు మరియు అదే సమయంలో భారతదేశం యొక్క ధైర్యాన్ని మరియు శక్తిని ప్రపంచం గుర్తించేలా చేసారు ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులుల‌ర్పిస్తున్నాను అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఎన్‌డ‌బ్ల్యు/ఆర్‌కే /ఏవై /ఆర్ఆర్‌

 


(रिलीज़ आईडी: 1852296) आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam