హోం మంత్రిత్వ శాఖ

దేశ ప్రజలకు 76 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


భారతదేశ సంస్కృతి, శక్తివంతమైన ప్రజాస్వామ్య సంప్రదాయం మరియు గత 75 సంవత్సరాలలో సాధించిన విజయాల గురించి గర్వించదగ్గ రోజు ఇది

దేశానికి స్వాతంత్ర్యం సాధించిన స్వాతంత్ర్య సమరయోధులు, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నా నివాళులు.. శ్రీ అమిత్ షా

దేశ ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ భారత దేశం అన్ని రంగాల్లో స్వావలంబన సాధించాలన్న స్వాతంత్ర్య సమరయోధులు కన్న కలలు సాకారం చేస్తున్నారు.. శ్రీ అమిత్ షా
మన స్వాతంత్య్ర శతాబ్ది సంవత్సరం నాటికి భారతదేశాన్ని మరోసారి 'విశ్వగురువు' గా మార్చేందుకు జరుగుతున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.. శ్రీ అమిత్ షా

Posted On: 15 AUG 2022 11:36AM by PIB Hyderabad

దేశ ప్రజలకు కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా 76వ స్వాతంత్ర్య దినోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ అమిత్ షా  ట్వీట్ చేశారు. "భారతదేశ సంస్కృతి, శక్తివంతమైన ప్రజాస్వామ్య సంప్రదాయం మరియు గత 75 సంవత్సరాలలో సాధించిన విజయాల గురించి గర్వించదగ్గ రోజు ఇది.  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా   మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన స్వాతంత్ర్య సమరయోధులకు, దేశ రక్షణ కోసం సర్వస్వం త్యాగం చేసిన మన వీర జవాన్లకు నా నివాళులర్పిస్తున్నాను" అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. 

దేశ ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న  ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ భారత దేశం అన్ని రంగాల్లో స్వావలంబన సాధించాలన్న స్వాతంత్ర్య సమరయోధులు కన్న  కలలు సాకారం చేస్తున్నారని  శ్రీ అమిత్ షా అన్నారు.  

 స్వాతంత్య్ర శతాబ్ది సంవత్సరం నాటికి భారతదేశాన్ని మరోసారి 'విశ్వగురువు' గా మార్చేందుకు జరుగుతున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని  శ్రీ అమిత్ షా అన్నారు. 



(Release ID: 1852120) Visitor Counter : 241