ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహిళల కుస్తీ 76 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన పూజా సిహాగ్కు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 07 AUG 2022 8:21AM by PIB Hyderabad

   బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌-2022 మహిళల కుస్తీ 76 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన పూజా సిహాగ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా పంపిన సందేశంలో;

   “ప్రతిభావంతురాలైన కుస్తీ క్రీడాకారిణిగా పూజా సిహాగ్‌ తననుతాను రుజువు చేసుకున్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందడుగు వేసిన ఆమె ఆత్మవిశ్వాసం ప్రశంసననీయం. కామన్వెల్త్‌ గేమ్స్‌-2022లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నందుకు అభినందనలు. ఆమె మరిన్ని విజయాలు సాధించి భవిష్యత్తులోనూ మన దేశం గర్వించేలా చేయగలదన్న విశ్వాసం నాకుంది. #Cheer4India” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1849549) Visitor Counter : 105