ప్రధాన మంత్రి కార్యాలయం

బర్మింగ్‌హామ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో స్వర్ణ పతకం సాధించిన కుస్తీ వీరుడు దీపక్‌ పునియాకు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 06 AUG 2022 12:10AM by PIB Hyderabad

   బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో స్వర్ణ పతకం సాధించిన దీపక్‌ పునియాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాభినందనలు తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా పంపిన సందేశంలో;

   “అత్యద్భుత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన మన దీపక్‌ పునియాను చూసి నేనెంతో గర్విస్తున్నాను! దేశానికి  ఎనలేని కీర్తిప్రతిష్టలు ఆర్జించి పెట్టిన ఆయన భారతదేశం మొత్తానికీ గర్వకారణం. ఆయన స్వర్ణ పతకం సాధించడం చూసి ప్రతి భారతీయుడూ ఉప్పొంగిపోతున్నాడు. భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నా శుభాశీస్సులు” అని పేర్కొన్నారు.

 
*****
DS/ST


(Release ID: 1849093) Visitor Counter : 149