యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కామ‌న్‌వెల్త్ క్రీడ‌లు 2022, నాలుగ‌వ రోజున ఒక ర‌జ‌తాన్ని, రెండు కాంశ్యాల‌ను సాధించిన భార‌త్ క్రీడాకారులు

నాడు పోస్టు చేయడమైనది: 02 AUG 2022 12:02PM by PIB Hyderabad

కీల‌కాంశాలుః
సుశీలాదేవి లిక్మాబామ్‌, విజ‌య్‌కుమార్ యాద‌వ్‌, హ‌ర్జింద‌ర్ కౌర్ 4వ రోజు ప‌త‌క విజేత‌లుగా నిలిచారు
వారి అసాధ‌ర‌ణ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర‌చినందుకు రాష్ట్ర‌ప‌తి శ్రీ‌మ‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ ప‌త‌క విజేత‌ల‌ను అభినందించారు. 
ఈ కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో కూడా ఎన్ఎస్ఎన్ఐఎస్ పాటియాలా తాను చాంపియ‌న్ల‌కు పుట్టిల్ల‌ని రుజువు చేసుకుందిః శ్రీ అనురాగ్ ఠాకూర్
బ‌ర్మింగ్‌హాంలో జ‌రుగుతున్న కామ‌న్‌వెల్త్ క్రీడ‌లు 2022లో నాలుగ‌వ రోజున భార‌త్ మూడు ప‌త‌కాల‌ను సాధించింది.  మ‌హిళ‌ల 48 కేజీల విభాగంలో జుదోక సుశీలాదేవి లిక్మాబ‌మ్ ర‌జ‌తాన్ని సాధించ‌గా, జూడో స్టార్ విజ‌య్‌కుమార్ యాద‌వ్ పురుషుల 60కేజీల విభాగంలో కాంశ్య‌ప‌తకాన్ని గెలువ‌గా, మ‌హిళ‌ల 71 కేజీల ఈవెంట్‌లో వెయిట్ లిఫ్ట‌ర్ హ‌ర్జీంద‌ర్ కౌర్ కూడా కాంశ్య‌ప‌త‌కాన్ని పొందారు. మొత్తం 3 స్వ‌ర్ణ, 3 ర‌జ‌త, 3 కాంశ్య ప‌త‌కాల‌తో స‌హా భార‌త్ ఖాతాలో 9 ప‌త‌కాలు చేరాయి. రాష్ట్ర‌ప‌తి శ్రీ‌మ‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోడీ, కేంద్ర క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్‌, దేశం న‌లుమూలల నుంచీ భార‌తీయులు వారు క‌న‌బ‌రిచిన ప్ర‌తిభ‌కి అభినంద‌న‌లు తెలిపారు. మీ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో లెక్క‌లేనంత‌మంది అభిమానుల‌ను గెల‌చుకోవ‌డ‌మే కాక ల‌క్ష‌లాదిమంది ఆడ‌పిల్ల‌ల‌కు ప్రేర‌ణ‌గా నిలిచారు. భార‌త్ మిమ్మ‌ల్ని చూసి గ‌ర్విస్తోంది అని రాష్ట్ర‌ప‌తి శ్రీ‌మ‌తి ద్రౌప‌ది ముర్ము ట్వీట్ చేశారు. 
కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో కాంశ్య ప‌త‌కాన్ని సాధించిన‌ హ‌ర్జింద‌ర్ కౌర్ కు అభినంద‌న‌లు. ఈ వేదిక‌ను చేరుకునేందుకు ఆమె త‌న జీవితంలో అనేక ఆటంకాల‌ను అధిగ‌మించింది. అది అంద‌రికీ ప్రేర‌ణ క‌లిగించే క‌థ‌. రానున్న సంవ‌త్స‌రాల‌లో మీరు మరింత కీర్తిని గ‌డించాలి, అని రాష్ట్ర‌ప‌తి ముర్ము మ‌రొక ట్వీట్‌లో పేర్కొన్నారు. 
మ‌రొక ట్వీట్ చేస్తూ, త‌న తొలి కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో విజ‌య్‌కుమార్ స్ఫూర్తిదాయ‌క‌మైన స‌మ‌ర్ధ‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. పురుషుల 60 కేజీల జూడోలో కాంశ్య ప‌త‌కాన్ని సాధించినందుకు అభినంద‌న‌లు.  గ‌త రౌండ్ల‌లో మీ ఆధిప‌త్యం మీకు ప‌త‌కాన్ని తెచ్చిపెట్టేందుకు కార‌ణ‌మైన మీ సామ‌ర్ధ్యాల‌ను ప‌ట్టి చూపింది. భ‌విష్య‌త్తులో మీరు మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకుంటున్నాన‌ని, రాష్ట్ర‌ప‌తి అన్నారు. 
ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ సుశీలాదేవి లిక్మాబ‌మ్ ను, విజ‌య్ కుమార్ యాద‌వ్‌, హ‌ర్జీంద‌ర్ కౌర్‌ల‌ను అభినందించారు. సుశీలాదేవి లిక్మాబ‌మ్ చూపిన అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న ఎంతో ఆనంద‌ప‌రిచింది అని ప్ర‌ధాన‌మంత్రి ఒక ట్వీట్‌లో అన్నారు. ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించినందుకు ఆమెకు శుభాకాంక్ష‌లు. ఆమె అద్భుత నైపుణ్యాన్ని, శ‌క్తిని ప్ర‌ద‌ర్శించారు. ఆమె భ‌విష్య‌త్ య‌త్నాల‌కు శుభాకాంక్ష‌లు అని ప్ర‌ధాని ఆమెను అభినందించారు. 
మ‌రొక ట్వీట్‌లో, కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో జూడో విభాగంలో విజ‌య్ కుమార్ యాద‌వ్ కాంశ్య ప‌తకాన్ని సాధించి, జాతి గ‌ర్వ‌ప‌డేలా చేశారు. అత‌డి విజ‌యం భార‌త్‌లో క్రీడ‌ల భవిష్య‌త్తుకి శుభ‌సూచ‌న‌. రానున్న కాలంలో అత‌డు మ‌రిన్ని విజ‌య శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని, ప్ర‌ధాని అభినందించారు. 
మ‌రొక ట్వీట్‌లో, మ‌న వెయిట్ లిఫ్టింగ్ బృందం బ‌ర్హింగ్‌హాం కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో అసాధార‌ణ ప్ర‌తిభ‌ను, నైపుణ్యాల‌ను ప్ర‌ద‌ర్శించింది. దీనిని కొన‌సాగిస్తూ, హ‌ర్జింద‌ర్ సింగ్ కాంశ్య ప‌త‌కాన్ని సాధించారు. ఆమె ప్ర‌త్యేక విజ‌యానికి నా అభినంద‌న‌లు. ఆమె భ‌విష్య య‌త్నాల‌కు శుభాకాంక్ష‌లు అని ప్ర‌ధాని ప్ర‌శంసించారు. 
ప‌త‌కాల‌ను గెలుచుకున్నందుకు సుశీలాదేవి లిక్మాబామ్‌, విజ‌య్‌కుమార్ యాద‌వ్‌, హ‌ర్జింద‌ర్ కౌర్ కు క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినంద‌న‌లు తెలిపారు. 
కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో తొలి ప‌త‌కాన్ని గెలుచుకున్నందుకు హ‌ర్జింద‌ర్ కౌర్ కు శుభాకాంక్ష‌లు! కాంశ్య ప‌త‌కం కోసం పంజాబ్‌లోని ఒక కుగ్రామం నుంచి అంత‌ర్జాతీయ వేదిక వ‌ర‌కు మీ ప్ర‌యాణం, అనేక‌మంది యువ‌త త‌మ క‌ల‌ల‌ను కొన‌సాగించేందుకు ప్రేర‌ణ‌ను క‌లిగిస్తుంది! అని శ్రీ ఠాకూర్ త‌న ట్వీట్‌లో అభినంద‌న‌ల జ‌ల్లు కురిపించారు. 
మ‌రొక ట్వీట్‌లో, మీరు శిక్ష‌ణ పొందే ఎన్ ఎస్ ఎన్ ఐఎస్ ఈ కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో కూడా ఛాంపియ‌న్ల‌కు పుట్టిల్లు అని రుజువు చేసుకుంది. మీ ఖేలో ఇండియా యూనివ‌ర్సిటీ గేమ్స్ ర‌జ‌త‌నం బ‌హుశ పెద్ద విజ‌యాల‌కు తొలి మెట్టు. భ‌విష్య‌త్తులో మీరు మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకుంటున్నాను! అని ఠాకూర్ అన్నారు. 
కామ‌న్‌వెల్త్ క్రీడ‌లు 2022లో జూడో విభాగంలో మీరు అద్భుతంగా రాణించ‌డం సంతోష‌దాయ‌కం. సుశీలాదేవి ర‌జ‌తాన్ని సాధించగా, విజ‌య్‌కుమార్ యాద‌వ్ కాంశ్య ప‌త‌కాల ఖాతాకు త‌న ప‌త‌కాన్ని జ‌త చేశారు. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో సైప్ర‌స్ పెట్రోస్ సి పై 10-0 స్కోర్ తో విజ‌యాన్ని సాధించి, త‌న తొలి మెడ‌ల్‌ను పొందారు. వారిద్ద‌రికీ నా శుభాకాంక్ష‌లు 
  సుశీలాదేవి లిక్మాబామ్ విజ‌యాల వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి
, విజ‌య్‌కుమార్ యాద‌వ్ విజ‌యాల వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి
 హ‌ర్జింద‌ర్ కౌర్ విజ‌యాల వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

***

 


(రిలీజ్ ఐడి: 1847518) సందర్శకుల సూచీ సంఖ్య : : 178
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Tamil