ప్రధాన మంత్రి కార్యాలయం
ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం లో భాగం గా, నవీకరించిన విద్యుత్తు పంపిణీరంగ పథకాన్ని జులై 30వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
ఈ పథకాని కి గాను అయిదు సంవత్సరాల లో వ్యయం 3 లక్షల కోట్ల రూపాయల కు పైనే
డిఐఎస్ సిఒఎమ్ స్ (డిస్కమ్స్) మరియు విద్యుత్తు విభాగాల నిర్వహణ సామర్థ్యాలను మరియు ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడం ఈ పథకం ధ్యేయాలు గా ఉన్నాయి
‘ఉజ్జ్వల్ భారత్ ఉజ్జ్వల్ భవిష్య - పవర్@2047’ ముగింపు సూచకం గా ఏర్పాటయ్యే భవ్య మైన కార్యక్రమంలో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
ఎన్ టిపిసి కి చెందిన 5,200 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన వివిధ గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయడం తో పాటు మరికొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపనకూడా చేస్తారు
నేశనల్ సోలర్ రూఫ్ టాప్ పోర్టల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు
Posted On:
29 JUL 2022 2:18PM by PIB Hyderabad
‘ఉజ్జ్వల భారత్ ఉజ్జ్వల భవిష్య - పవర్ @2047’ ముగింపు సూచకం గా ఏర్పాటయ్యే ఒక భవ్యమైన కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జులై 30వ తేదీ నాడు మధ్యాహ్నం 12:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా మెరుగుపరచిన పంపిణీ రంగ పథకాన్ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఎన్ టిపిసి కి చెందిన వివిధ హరిత శక్తి పథకాల లో కొన్నిటిని ఆయన దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. దీనితో పాటు కొన్ని పథకాల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన కూడా చేయనున్నారు. నేశనల్ సోలర్ రూఫ్ టాప్ పోర్టల్ ను కూడా ఆయన ప్రారంభించనున్నారు.
విద్యుత్తు రంగం లో అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాల ను ప్రధాన మంత్రి నాయకత్వం లో ప్రభుత్వం అమలు చేసింది. ఈ సంస్కరణ లు అందరికీ అందుబాటు లో విద్యుత్తు అనే లక్ష్యాన్ని సాధించడం పైన శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఈ రంగం రూపు రేఖల లో చెప్పుకోదగిన మార్పుల ను తీసుకువచ్చాయి. ఇంతకు ముందు విద్యుత్తు సౌకర్యాని కి నోచుకోనటువంటి దాదాపు 18,000 గ్రామాల కు విద్యుత్తు సౌకర్యాన్ని సమకూర్చడం అనేది లాస్ట్ మైల్ అవుట్ రీచ్ దిశ లో ప్రభుత్వం యొక్క వచన బద్ధత కు కట్టబెట్టిన ప్రాధాన్యాన్ని చాటి చెప్తున్నది.
ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం లో భాగం గా, విద్యుత్తు మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రతిష్టాత్మకమైన రీవాంప్ డ్ డిస్ట్రిబ్యూశన్ సెక్టర్ స్కీము ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. డిఐఎస్ సిఒఎమ్ స్ (డిస్కమ్స్) లు మరియు విద్యుత్తు విభాగాల నిర్వహణ పరమైన సామర్థ్యాల ను మరియు వాటి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడం ఈ మెరుగుపరచిన పథకం యొక్క ధ్యేయం గా ఉంది. తుది వినియోగదారుల కు ఆధారపడదగినటువంటి మరియు నాణ్యమైనటువంటి విధం గా సరఫరా ను మెరుగు పరచడం పై దృష్టి పెడుతూ, పంపిణీ సంబంధి మౌలిక సదుపాయాల పటిష్టీకరణ కు, ఆధునికీకరణ కు గాను డిస్కమ్స్ కు 2021-22 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు అయిదు సంవత్సరాల లో మొత్తం 3 లక్షల కోట్ల రూపాయల కు పైగా ఆర్థిక సహాయాన్ని అందించాలనేది నవీకరించినటువంటి ఈ పథకం లక్ష్యం. ఇది సాంకేతిక పరమైనటువంటి మరియు వాణిజ్య పరమైనటువంటి సమష్టి నష్టాల (ఏగ్రిగేట్ టెక్నికల్ ఎండ్ కమర్శియల్.. ఎటి&సి లాసెస్) ను అఖిల భారత స్థాయి లో 12 నుంచి 15 శాతం మేర తగ్గించడం తో పాటుగా అన్ని స్టేట్- సెక్టర్ డిస్కమ్ స్ మరియు విద్యుత్తు విభాగాల యొక్క నిర్వహణ పరమైన సామర్ధ్యాల ను, ఆర్థిక పరమైన స్థిరత్వాన్ని మెరుగుపరచడం ద్వారా ఎసిఎస్-ఎఆర్ఆర్ (అంటే ఏవరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లయ్ - ఏవరేజ్ రెవిన్యూ రియలైజ్ డ్) సంబంధి అంతరాన్ని 2024-25 కల్లా సున్నా స్థాయి కి చేర్చాలని కూడా మరో లక్ష్యం గా పెట్టుకొంది.
ఈ కార్యక్రమం లో భాగం గా, ఎన్ టిపిసి కి చెందిన 5,200 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగినటువంటి వివిధ హరిత శక్తి పథకాల ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. దీని తో పాటు మరికొన్ని పథకాల కు ఆయన శంకుస్థాపన కూడా చేస్తారు. తెలంగాణ లో 100 మెగా వాట్ ల సామర్థ్యాన్ని కలిగి ఉండే రామగుండం ఫ్లోటింగ్ సోలర్ ప్రాజెక్టు ను మరియు కేరళ లో 92 ఎమ్ డబ్ల్యు సామర్థ్యాన్ని కలిగి ఉండే కాయంకుళమ్ ఫ్లోటింగ్ సోలర్ ప్రాజెక్టు ను ఆయన ప్రారంభించనున్నారు. రాజస్థాన్ లో 735 ఎమ్ డబ్ల్యు సామర్థ్యాన్ని కలిగి ఉండే నోఖ్ సోలర్ ప్రాజెక్టు కు, లేహ్ లో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటి ప్రాజెక్టు కు మరియు గుజరాత్ లోని కవాస్ ప్రాంతం లో సహజ వాయువు తో హరిత ఉదజని ని కలిపేటటువంటి ఒక ప్రాజెక్టు కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
రామగుండం ప్రాజెక్టు భారతదేశం లో అతి పెద్దదైన ఫ్లోటింగ్ సోలర్ పివి ప్రాజెక్టు గా ఉంది. దీని లో 4.5 లక్షల ‘మేడ్ ఇన్ ఇండియా’ సోలర్ పివి మాడ్యూల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కాయం కుళమ్ ప్రాజెక్టు రెండో అతి పెద్దదైన ఫ్లోటింగ్ సోలర్ పివి ప్రాజెక్టు గా ఉంది. దీనిలో 3 లక్షల ‘మేడ్ ఇన్ ఇండియా’ సోలర్ పివి ప్యానల్స్ ను నీటి మీద తేలియాడే విధం గా అమర్చడం జరిగింది.
రాజస్థాన్ లో జైసల్మేర్ ప్రాంతం పరిధి లోకి వచ్చే నోఖ్ లో ఏర్పాటు చేసే 735 ఎమ్ డబ్ల్యు సామర్థ్యం కలిగి ఉండే సోలర్ ఫోటో వోల్టాయిక్ (పివి) ప్రాజెక్టు భారతదేశం లో కెల్లా అతి పెద్దది అయినటువంటి డమెస్టిక్ కంటెంట్ రిక్వైర్ మెంట్ బేస్ డ్ సోలర్ ప్రాజెక్టు గా రూపుదిద్దుకోనుంది. ఇది ఒకే ప్రదేశం లో స్థాపన జరిగే 100 ఎమ్ డబ్ల్యుపి (MWp) గా ఉంటుంది. దీని కి హై వాటేజీ తో కూడిన ద్విముఖ పివి మాడ్యూల్స్ ను, ట్రాకర్ సిస్టమ్ ను జతపరచడం జరుగుతుంది. లద్దాఖ్ లోని లేహ్ లో స్థాపించే గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటి ప్రాజెక్టు ఒక ప్రయోగాత్మకమైనటువంటి ప్రాజెక్టు గా ఉండబోతోంది. దీనిని లేహ్ లో మరియు లేహ్ చుట్టుపక్కల ప్రాంతాల లో నడిపే అయిదు ఫ్యూయల్ సెల్ బస్సుల ను దృష్టి లో పెట్టుకొని రూపుదిద్దడం జరిగింది. ఈ పైలెట్ ప్రాజెక్టు భారతదేశం లో సార్వజనిక వినియోగం కోసం ఉద్దేశించిన తొలి ఫ్యూయల్ సెల్ ఆధారిత విద్యుత్తు వాహనాల కై లక్షించింది. ఎన్ టిపిసి కవాస్ బస్తీ లో ఏర్పాటు చేయబోయే హరిత ఉదజని మిశ్రణం తాలూకు పైలెట్ ప్రాజెక్టు భారతదేశం లో ఈ కోవ కు చెందినటువంటి ఒకటో ప్రాజెక్టు కానుంది. సహజ వాయువు వినియోగాన్ని తగ్గించడం లో ఈ ప్రాజెక్టు సహాయకారి కానుంది.
నేశనల్ సోలర్ రూఫ్ టాప్ పోర్టల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. సోలర్ ప్లాంటుల ను పై కప్పుల యొక్క పై భాగం లో ప్రతిష్టించే ప్రక్రియ ను- దరఖాస్తు ల నమోదు మొదలుకొని ప్లాంటు స్థాపన అనంతరం దాని ని తనిఖీ చేశాక సబ్సిడీ ని నివాస వినియోగదారుల యొక్క బ్యాంకు ఖాతాల లోకి విడుదల చేయడం వరకు- ఆన్ లైన్ మాధ్యమం లో జాడ తీయడం ఈ పోర్టల్ ద్వారా సాధ్యపడనుంది.
ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగం గా ‘ఉజ్జ్వల్ భారత్ ఉజ్జ్వల్ భవిష్య- పవర్ @2047’ జులై 25వ తేదీ మొదలుకొని జులై 30వ తేదీ వరకు జరుగనున్నది. దేశవ్యాప్తం గా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం గడచిన ఎనిమిది సంవత్సరాలుగా విద్యుత్తు రంగం లో చోటు చేసుకొన్న మార్పు ను కళ్ళకు కడుతున్నది. విద్యుత్తు కు సంబంధించిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల లో పౌరులు పాలుపంచుకొనేటట్లు చూడడం ద్వారాను, ఆయా పథకాల పట్ల వారి లో చైతన్యాన్ని మెరుగు పరచడం ద్వారాను పౌరుల కు సాధికారిత ను కల్పించాలి అనే ధ్యేయం తో ఈ కార్యక్రమాన్ని రూపొందించడమైంది.
***
(Release ID: 1846289)
Visitor Counter : 253
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam