హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ప్రారంభించబడింది, వివిధ అవార్డుల కోసం నామినేషన్ల ఆహ్వనం

Posted On: 27 JUL 2022 1:12PM by PIB Hyderabad


 

భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు / ఏజెన్సీలు తమ తమ రంగాలలో విశిష్టమైన మరియు అసాధారణమైన కృషి చేసిన వ్యక్తులను సత్కరించడానికి అనేక పౌర పురస్కారాలను ఏర్పాటు చేశాయి .

వివిధ అవార్డుల కోసం నామినేషన్లను ఆహ్వానించడానికి , ఒక ఉమ్మడి జాతీయ అవార్డుల పోర్టల్ ( https://awards.gov.in ) ప్రభుత్వంచే అభివృద్ధి చేయబడింది , దీని వలన భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు / ఏజెన్సీల అన్ని అవార్డులు అందజేయబడతాయి .

 

పారదర్శకత మరియు ప్రజల భాగస్వామ్యం (జన్  భగీదారి) ఖచ్చితంగా ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ క్రిందకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ పోర్టల్ ఏర్పాటు చేయబడింది.

 

భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ అవార్డులకు పౌరులు, వ్య క్తులు/సంస్థలను నామినేట్ చేయడానికి వీలు కల్పించడం ఈ పోర్టల్ లక్ష్యం.

ప్రస్తుతం , కింది అవార్డుల కోసం నామినేషన్లు / సిఫార్సులు ఆహ్వానించపడ్డాయి :

  1. పద్మ అవార్డులు- చివరి తేదీ 15/09/2022
  • ii. కౌశలాచార్య అవార్డులు- చివరి తేదీ 30/07/2022
  1. సీనియర్ సిటిజన్లకు జాతీయ అవార్డు -వయోశ్రేష్ఠ సమ్మాన్- చివరి తేదీ 18/08/2022
  2. నేషనల్ అవార్డ్ ఫర్ ఇండివిజువల్ ఎక్సలెన్స్ 2021- చివరి తేదీ 28/08/2022
  3. నేషనల్ అవార్డ్ ఫర్ ఇండివిజువల్ ఎక్సలెన్స్ 2022- చివరి తేదీ 28/08/2022
  4. వికలాంగులకు సాధికారత కల్పించడంలో నిమగ్నమైన సంస్థలకు జాతీయ అవార్డులు-2021- చివరి తేదీ 28/08/2022
  5. వికలాంగులకు సాధికారత కల్పించడంలో నిమగ్నమైన సంస్థలకు జాతీయ అవార్డులు-2022- చివరి తేదీ 28/08/2022
  6. జాతీయ CSR అవార్డులు- చివరి తేదీ 31/07/2022
  7. నారీ శక్తి పురస్కారం- చివరి తేదీ 31/10/2022
  8. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం- చివరి తేదీ 31/08/2022
  9. ఇ-గవర్నెన్స్ కోసం జాతీయ అవార్డులు- చివరి తేదీ 31/07/2022
  10. సర్దార్ పటేల్ నేషనల్ యూనిటీ అవార్డు- చివరి తేదీ 31/07/2022
  11. మద్యపానం మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగం నివారణ రంగంలో అత్యుత్తమ సేవలకు జాతీయ అవార్డులు- చివరి తేదీ 30/07/2022
  12. జీవన్ రక్షా పదక్ - చివరి తేదీ 30/09/2022

 

మరింత సమాచారం కోసం మరియు నామినేషన్లు చేయడానికి , దయచేసి జాతీయ అవార్డుల పోర్టల్ ( https://awards.gov.in ) సందర్శించండి .

 

 


(Release ID: 1845329) Visitor Counter : 240