ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో స్థానికులకు ప్రాధాన్యత

Posted On: 26 JUL 2022 12:10PM by PIB Hyderabad
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో స్థానికులకు ప్రాధాన్యత కల్పించి, ఆర్థిక సాంకేతిక, వ్యాపార అంశాలలో సహకారం అందించి, సూక్ష్మ   ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనను ప్రోత్సహించేందుకు  ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ  కేంద్ర ప్రాయోజిత పథకంగా  "పీఎం  ఫార్మలైజేషన్ ఆఫ్  మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME)" పధకాన్ని అమలు చేస్తోంది. 2021-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు పథకం అమలు జరుగుతుంది. దేశంలో 10,000 కోట్ల రూపాయల ఖర్చు అంచనాలతో పథకం అమలు జరుగుతున్నది. ముడి సరుకుల సేకరణ,  ఉత్పత్తులకు ఒకే విధమైన మార్కెటింగ్ సౌకర్యాలు, ఒకే విధంగా ఉండే సేవలను సమకూర్చేందుకు "ఒక జిల్లా ఒక ఉత్పత్తి" (ఓడిఓపి)విధానంలో పథకం అమలు జరుగుతుంది. ఉత్పత్తులకు విలువ ఆధారిత విలువలు జోడించేందుకు 
అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు పథకం ప్రాధాన్యత ఇస్తుంది. 
పరిశ్రమల వార్షిక నివేదిక, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 73వ నివేదిక ప్రకారం దేశంలో 25 లక్షల నమోదుకాని/రిజిస్టర్ కాని  ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు ఉన్నాయి. దేశంలో  నమోదుకాని/రిజిస్టర్ కాని  ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల వివరాలు   రాష్ట్రాల వారీగా వివరాలు  అనుబంధం-I లో ఉన్నాయి.
సంస్థల స్థాపన, అభివృద్ధి సమయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి, సూక్ష్మ సంస్థలకు సంస్థాగత, సహకార వ్యవస్థ సహాయ సహకారాలు లభించేలా చూడాలన్న లక్ష్యంతో  "పీఎం  ఫార్మలైజేషన్ ఆఫ్  మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్" పథకం అమలు జరుగుతున్నది. అసంఘటిత రంగంగా పనిచేస్తున్న  ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కొత్తగా ఏర్పాటైన, ఇప్పటికే పనిచేస్తున్న సంస్థల మధ్య పోటీని పెంపొందించి రంగాన్ని సంఘటిత రంగంగా అభివృద్ధి చేయాలన్నది పథకం ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది.  "పీఎం  ఫార్మలైజేషన్ ఆఫ్  మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్" పథకం కింద సూక్ష్మ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అందిస్తున్న సహాయ సహకార వివరాలు:
(i )వ్యక్తిగత / సమూహ తరగతి లో సూక్ష్మ సంస్థలకు సహకారం: రుణంతో ముడిపడిన మూలధన సబ్సిడీగా  అర్హతగల  ప్రాజెక్ట్ వ్యయంలో @35%. యూనిట్‌కు   గరిష్ట పరిమితి  రూ.10 లక్షలు
(ii) ప్రధాన  మూలధనం కోసం స్వయం సహాయక సంఘాలకు సహకారం :  వర్కింగ్ క్యాపిటల్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్‌లో పనిచేస్తున్న స్వయం సహాయక బృందం  సభ్యునికి విత్తన మూలధనం @ రూ. 40,000/-  మరియు చిన్న సాధనాల కొనుగోలుకు  స్వయం సహాయక బృందం సమాఖ్యకు గరిష్టంగా 4 లక్షల రూపాయలు. 
(iii)  సాధారణ మౌలిక సదుపాయాలకు సహకారం : సాధారణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎఫ్ పీ ఓ,స్వయం సహాయక బృందం, సహకార సంఘం లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థకు  క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ @35% గరిష్టంగా మూడు కోట్ల రూపాయల వరకు. కల్పించిన సాధారణ మౌలిక సదుపాయాలను ఇతర యూనిట్లు లేదా ప్రజలు నిర్ణీత రుసుం చెల్లించి వినియోగించుకునేందుకు అవకాశం కల్పించబడుతుంది. 
(iv). బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ సహకారం :  బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ కోసం  ఎఫ్ పీ ఓ,స్వయం సహాయక బృందం, సహకార సంఘంకు 50% వరకు గ్రాంట్ లభిస్తుంది. 
(v). సామర్ధ్య పెంపుదల :  ఈ పథకం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ స్కిల్లింగ్ (ఈడీపీ +) కోసం శిక్షణ అందిస్తుంది. 
సూక్ష్మ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు  సాంకేతిక అంశాల్లో అభివృద్ధి సాధించి, సంఘటిత రఁగంగా అభివృద్ధి సాధించేందుకు అవసరమైన సామర్ధ్య పెంపుదల, శిక్షణ కార్యక్రమాలకు పథకం ప్రాధాన్యత ఇస్తుంది.  వ్యవస్థాపకత అభివృద్ధి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రమాణాల అమలు  మరియు సాధారణ పరిశుభ్రత మరియు ఇతర చట్టబద్ధమైన అంశాలను అమలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారించి పథకం అమలు జరుగుతుంది.  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  మరియు ఇతర చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా  జిల్లా రిసోర్స్ పర్సన్‌లకు (DRPలు)  సూక్ష్మ   ఫుడ్ ప్రాసెసింగ్  యూనిట్లకు సహకారం అందిస్తాయి. 

అనుబంధం

దేశంలో రిజిస్టర్ కాని/ఇన్‌కార్పొరేటెడ్ ఎంటర్‌ప్రైజెస్ రాష్ట్రాల వారీగా రాష్ట్రాల వారీగా వివరాలు

క్ర.సం. నం.

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం 

  ఆహార మరియు పానీయాల తయారీ రంగంలో నమోదు కాని సంస్థల సంఖ్య 

1

అండమాన్ నికోబార్ దీవులు

774

2

ఆంధ్రప్రదేశ్

1,54,330

3

అరుణాచల్ ప్రదేశ్

145

4

అస్సాం

65,997

5

బీహార్

1,45,300

6

చండీగఢ్

656

7

ఛత్తీస్‌గఢ్

26,957

8

డి అండ్ ఎన్   హవేలీ మరియు డామన్డయ్యూ

758

9

ఢిల్లీ

14,350

10

గోవా

2,929

11

గుజరాత్

94,066

12

హర్యానా

24,577

13

హిమాచల్ ప్రదేశ్

21,885

14

జమ్మూ  కాశ్మీర్

28,089

15

జార్ఖండ్

116536

16

కర్ణాటక

127458

17

కేరళ

77,167

18

లడఖ్

-

19

లక్షదీవులు 

127

20

మధ్యప్రదేశ్

1,02,808

21

మహారాష్ట్ర

2,29,372

22

మణిపూర్

6,038

23

మేఘాలయ

3,268

24

మిజోరం

1,538

25

నాగాలాండ్

3,642

26

ఒడిశా

77,781

27

పుదుచ్చేరి

3,482

28

పంజాబ్

63,626

29

రాజస్థాన్

1,01,666

30

సిక్కిం

101

31

తమిళనాడు

1,78,527

32

తెలంగాణ

80,392

33

త్రిపుర

13,998

34

ఉత్తర ప్రదేశ్

3,50,883

35

ఉత్తరాఖండ్

18,116

36

పశ్చిమ బెంగాల్

3,22,590

 

మొత్తం

24,59,929

మూలం: పరిశ్రమల వార్షిక సర్వే, 2016-17 మరియు   నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 73వ  నివేదిక   (జూలై 2015-జూన్ 2016)

ఈ సమాచారాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో  అందించారు.

 

 

****



(Release ID: 1845055) Visitor Counter : 164