ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

201.30 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.83 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,49,482

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 21,880

ప్రస్తుత రికవరీ రేటు 98.46%

వారపు పాజిటివిటీ రేటు 4.51%

Posted On: 22 JUL 2022 9:44AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 201.30 కోట్ల ( 2,01,30,97,819 ) డోసులను అధిగమించింది. 2,65,61,942 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.83 కోట్లకు పైగా ( 3,83,43,085 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10410750

రెండో డోసు

10083124

ముందు జాగ్రత్త డోసు

6115148

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18428561

రెండో డోసు

17658239

ముందు జాగ్రత్త డోసు

11693029

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

38343085

రెండో డోసు

26817744

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

60961790

రెండో డోసు

50476535

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559109317

రెండో డోసు

506930982

ముందు జాగ్రత్త డోసు

10976867

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203605661

రెండో డోసు

194808808

ముందు జాగ్రత్త డోసు

7974448

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127386371

రెండో డోసు

121730361

ముందు జాగ్రత్త డోసు

29586999

ముందు జాగ్రత్త డోసులు

6,63,46,491

మొత్తం డోసులు

2,01,30,97,819

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,49,482. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.34 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 21,219 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,31,71,653 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 21,880 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,95,359 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.16 కోట్లకు పైగా ( 87,16,56,205 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.51 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1844196) Visitor Counter : 120