రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్త మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ‘ఆజాదీ కా అమృత్ మోహత్సవ్’ లో భాగంగా జరుపుకుంటున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)


Posted On: 15 JUL 2022 2:28PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ఆధ్వర్యంలో, 2022 జూలై 17న దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని NHAI యోచిస్తోంది. ఒకే రోజు దేశవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటడం లక్ష్యం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాలు జాతీయ రహదారుల వెంబడి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాండ్ పార్శిల్స్టోల్ ప్లాజాల వద్ద ఉన్న తోటల వంటి 100 స్థలాలను గుర్తించాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని 2022 ఆగస్టు 15 వరకు 75 లక్షల ప్లాంటేషన్లను సాధించడం NHAI లక్ష్యం.

కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, మంత్రిత్వ శాఖ NHAI సీనియర్ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యావరణ సుస్థిరత సందేశాన్ని వ్యాప్తి చేస్తూ, ఈ డ్రైవ్‌లో ప్రజా ప్రతినిధులు, పౌర సమాజంలోని స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు  కళాశాల విద్యార్థులు పాల్గొంటారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జి) మొక్కలు నాటడం, వాటి నిర్వహణలో కూడా పాల్గొంటాయి.

పర్యావరణ అనుకూల జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు మొక్కలు నాటే కార్యక్రమాలు  నిర్వహిస్తోంది. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు (SRLMలు) అటవీ ఉద్యానవన నిపుణుల ద్వారా రాయితీదారులు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రైవేట్ ప్లాంటేషన్ ఏజెన్సీలు మహిళా SHG లను చేర్చుకోవడం ద్వారా జాతీయ రహదారుల వెంబడి సమిష్టిగా తోటలను పూత్రి గ మొక్కలతో  నెలకొల్పడం  లక్ష్యం.

****(Release ID: 1841838) Visitor Counter : 268