ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

75 రోజులు - ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలలో అర్హులైన వయోజనులందరికీ ఉచిత ముందుజాగ్రత్త డోస్ అందించడానికి రేపటి నుండి ‘కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్’ ప్రారంభం


మిషన్ మోడ్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపుల సంఖ్యను విస్తరిస్తూ ‘కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ’ని ‘జన్ అభియాన్’గా అమలు చేయనున్న రాష్ట్రాలు/యుటిలు

వివిధ యాత్రా మార్గాలు, మేళాలు, సమ్మేళనాల వద్ద ప్రత్యేక టీకా శిబిరాలు

కార్యాలయ సముదాయాలు, పారిశ్రామిక సంస్థలు, రైల్వే స్టేషన్‌లు, అంతర్రాష్ట్ర బస్ స్టేషన్‌లు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యస్థల టీకా శిబిరాలు

Posted On: 14 JUL 2022 5:25PM by PIB Hyderabad

75 రోజులు - ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌లలో (సీవీసీలు) అర్హత ఉన్న పెద్దలందరికీ (18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ) ముందు జాగ్రత్త మోతాదును అందించడానికి ‘కోవిడ్ టీకా అమృత్ మహోత్సవం’ రేపటి (15 జూలై ) నుండి  ప్రారంభమవుతుంది. 'మిషన్ మోడ్'లో జరిగే ఈ ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా నిర్వహిస్తున్నారు. అర్హత కలిగిన వయోజన జనాభాలో కోవిడ్ వ్యాక్సిన్ ముందు జాగ్రత్త డోస్ తీసుకోవడాన్ని పెంచడం ఈ స్పెషల్ డ్రైవ్ లక్ష్యం.

ఈ రోజు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అధ్యక్షతన రాష్ట్ర/యూటీ ఆరోగ్య కార్యదర్శులు, ఎన్హెచ్ఎం ఎండీ లతో జరిగిన వర్చువల్ సమావేశంలో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అర్హులైన లబ్ధిదారులందరికీ టీకాలు వేయడం ద్వారా పూర్తి ప్రికాషనరీ కోవిడ్ -19 టీకా కవరేజీ వైపు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గట్టి ఆశయంతో ముందుకు సాగాలని కోరారు. 

 

 

18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రూపులో (8%), 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులలో (27%) ముందు జాగ్రత్త మోతాదుల శాతం తక్కువగా తీసుకోవడం ఆందోళన కలిగిస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రముఖం గా ప్రస్తావించారు.  ప్రభుత్వ 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం అన్ని ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌లలో ఉచిత ముందస్తు జాగ్రత్తలను అందించడానికి భారతదేశం ప్రత్యేక డ్రైవ్ ‘కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ’ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇది 15 జూలై 2022 నుండి 30 సెప్టెంబర్ 2022 వరకు 75 రోజుల పాటు ఉంటుంది. 2వ డోస్ ఇచ్చిన తేదీ నుండి 6 నెలలు (లేదా 26 వారాలు) పూర్తి చేసిన 18 సంవత్సరాల  పైన వయస్సు గల వ్యక్తులందరూ ముందు జాగ్రత్త మోతాదుకు అర్హులు.

రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు 75 రోజుల పాటు ‘కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవాన్ని’ ఉద్యమ స్పూర్తితో భారీ జన సమీకరణతో ‘జన్ అభియాన్’గా అమలు జరుగుతుంది. చార్ ధామ్ యాత్ర (ఉత్తరాఖండ్), అమర్‌నాథ్ యాత్ర (జమ్ము కాశ్మీర్), కన్వర్ యాత్ర (ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు/యూటీలు) అలాగే ప్రధాన మేళాలు, సమ్మేళనాల మార్గాలలో ప్రత్యేక టీకా శిబిరాలను నిర్వహించాలని వారికి సూచించారు. పెద్ద కార్యాలయ సముదాయాలు (పబ్లిక్ & ప్రైవేట్), పారిశ్రామిక సంస్థలు, రైల్వే స్టేషన్లు, అంతర్ రాష్ట్ర బస్ స్టేషన్లు, పాఠశాలలు, కళాశాలల వంటి వాటి వద్ద ప్రత్యేక కార్యాలయ టీకా శిబిరాలను నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలు/యుటిలకు సూచించారు. అటువంటి అన్ని ప్రత్యేక టీకా శిబిరాల్లో, తప్పనిసరిగా కోవిన్ ద్వారా టీకాలు వేయాలి, టీకా ధృవీకరణ పత్రాన్ని అందించాలి. ప్రతిష్టాత్మకమైన జిల్లా/బ్లాక్/సీవీసీ-వారీగా సెషన్ ప్లాన్‌లు చొరవ విజయవంతంగా అమలు కావడానికి, అన్ని అర్హతగల జనాభా ముందుజాగ్రత్త డోస్ పరిధిలో ఉండేలా చూసుకోవాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ & మాస్ మీడియాలో ఈ చొరవను విస్తృతంగా ముందస్తుగా ప్రచారం చేయాలని రాష్ట్రాలు/యూటీలకు సూచించారు. రాష్ట్ర స్థాయిలో ప్రగతిని ప్రతి వారం క్రమం తప్పకుండా సమీక్షించాలని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శులను కోరారు.

అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులను సకాలంలో వినియోగించుకునేలా చూడాలని రాష్ట్రాలు/యుటిలకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సౌకర్యాలలో ఎటువంటి డోస్ గడువు ముగియదు. 

****


(Release ID: 1841677) Visitor Counter : 187