ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ రోజు న మంత్రిమండలి తీసుకొన్న నిర్ణయం భారతదేశం లో ప్రజల కు టీకా మందుఇప్పించే కార్యక్రమం యొక్క పరిధి ని పెంచడం తో పాటు ఒక ఆరోగ్యవంతమైనటువంటి దేశాన్నిఆవిష్కరించనుంది: ప్రధాన మంత్రి

Posted On: 13 JUL 2022 10:13PM by PIB Hyderabad

దేశ పౌరుల లో 18 ఏళ్ళ వయస్సు పైబడిన వారందరికీ 2022వ సంవత్సరం జులై 15వ తేదీ మొదలుకొని రాబోయే 75 రోజుల లో ప్రభుత్వ టీకాకరణ కేంద్రాల లో కోవిడ్-19 ముందుజాగ్రత డోజు (ప్రీకాశన్ డోజు) ను ఉచితం గా ఇప్పించాలన్న నిర్ణయం భారతదేశం లో ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం యొక్క పరిధి ని విస్తరించడమే కాకుండా ఒక ఆరోగ్యవంతమైనటువంటి దేశాన్ని ఆవిష్కరించడానికి తోడ్పడగలదన్న ఆశాభావాన్ని’ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ఈ రోజు న జరిగిన మంత్రివర్గ సమావేశం లో ఈ నిర్ణయాన్ని #AzadiKaAmritMahotsav కార్యక్రమం లో భాగం గా తీసుకోవడమైంది.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ చేసిన ఒక ట్వీట్ కు జవాబు గా ప్రధాన మంత్రి తాను కూడా ఒక ట్వీట్ చేశారు. అందులో -

కేంద్రం ‘‘ప్రజల కు టీకాల ను ఇప్పించడం అనేది కోవిడ్-19 కి వ్యతిరేకం గా పోరాటాన్ని జరపడం లో ఒక ప్రభావవంతమైనటువంటి సాధనం గా ఉంది. ఈ రోజు న మంత్రిమండలి తీసుకొన్న నిర్ణయం భారతదేశం లో ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం తాలూకు పరిధి ని విస్తరించడం తో పాటు ఒక ఆరోగ్యవంతమైన దేశాన్ని ఆవిష్కరించడాని కి కూడా తోడ్పడగలుగుతుంది.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***

DS/SH

 

 



(Release ID: 1841464) Visitor Counter : 126